శాంసంగ్ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయంటే..

By Hazarath
|

ఈ మధ్య కాలంలో శాంసంగ్ అభిమానులను కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 పేళుళ్ల అంశంమే. ఎప్పుడూ లేని స్థాయిలో ఈ పేళుళ్లు జరుగుతుండటంతో శాంసంగ్ సైతం ఉలిక్కి పడుతూ వస్తోంది. అయితే ఈ ఫోన్లు ఎందుకు పేలుతున్నాయనే దానికి శాంసంగ్ వివరణ ఇచ్చింది. అది బ్యాటరీలో ఉన్న సమస్యవల్లేనని తేల్చి చెప్పింది.

75 పైసలకే 1 జిబి డేటా: బిఎస్ఎన్ఎల్ సంచలనం

#1

#1

గెలాక్సీ నోట్ 7 పేలుళ్లపై శాంసంగ్ స్పందిస్తూ బ్యాటరీ ఎక్కువ మోతాదులో హీట్ అవుతుండటం వల్లే ఫోన్లు పేలిపోతున్నాయని పేర్కొంది.

#2

#2

నోట్ 7కు అమర్చిన బ్యాటరీల్లో తయారీ లోపం కారణంగానే అవి ఎక్కువమోతాదులో హీట్ అవుతున్నట్లు తెలిపింది. పేలుళ్ల తర్వాత నోట్ 7 బ్యాటరీలపై చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలు వెల్లడైనట్లు పేర్కొంది.

#3

#3

లోపాలు ఉన్న బ్యాటరీలను సామ్‌సంగ్‌కు చెందిన ఎస్‌డీఐ తయారుచేసింది. గెలాక్సీ నోట్‌7లో 70 శాతం బ్యాటరీలను ఎస్‌డీఐ నుంచి తయారుచేసినవేనని కంపెనీ పేర్కొంది.

#4

#4

యానోడ్‌-టు-కాథోడ్‌ అనుసంధానం కావటంతో బ్యాటరీ సెల్‌ అధికంగా వేడెక్కి పేలుళ్లకు దారి తీస్తోందని వెల్లడించింది. దీన్ని చాలా అరుదైన తయారీ ప్రక్రియ లోపంగా పేర్కొంది.

#5

#5

ఇది ఫోన్‌ సమస్య కాదని.. కేవలం బ్యాటరీ సమస్య మాత్రమేనని తెలిపింది. ఈ కారణంగా గెలాక్సీ నోట్‌7 ఫోన్లను స్వచ్ఛందంగా కొత్త ఫోన్లతో రీప్లేస్‌ చేస్తున్నామని కంపెనీ వెల్లడించింది.

#6

#6

బ్యాటరీ పేలుళ్లకు దారితీస్తున్న పరిస్థితులపై సామ్‌సంగ్‌ విచారణ చేపట్టి అందుకు గల కారణాలను యూకే వెబ్‌సైట్‌లో ఉంచింది.

#7

#7

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి గెలాక్సీ నోట్‌7 పేలుళ్ల కేసులు 35వరకు నమోదయ్యాయి. కొరియాలో 17, అమెరికాలో 17, తైవాన్‌లో ఒక కేసు నమోదైనట్లు కంపెనీ వివరించింది.

#8

#8

కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ 2.5 మిలియన్ల నోట్ 7 ఫోన్లను శాంసంగ్ అమ్మింది.తమకు వినియోగదారుల రక్షణ ముఖ్యమని తన ప్రకటనలో పేర్కొన్న శాంసంగ్ ఈ ఫోన్లన్నింటినీ రీ ప్లేస్ చేయనున్నట్లు తెలిపింది.

Best Mobiles in India

English summary
Samsung finally explained why Galaxy Note 7 batteries are exploding read more gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X