హ్యాకింగ్‌ సెక్స్‌తో అమితాబ్‌ విలవిల

By Hazarath
|

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో తమ భద్రత మరియు గోప్యత గురించి సెలబ్రిటీలు భయపడ్తుంటారు. అందువల్లే కాబోలు వారు ఎక్కువగా ఆన్‌లైన్‌లో ఉండటానికి విముఖత వ్యక్తం చేస్తుంటారు. దీనికి కారణం అదపా దడపా వారి ఎకౌంట్లు హ్యాక్ కావడమే. మొదట్లో ట్విట్టర్ ఖాతాను కల్గి ఉన్న అతి తక్కువ మంది బాలీవుడ్ ప్రముఖుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. తాజాగా అమితాబ్ ట్విట్టర్ ఎకౌంట్ హాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్ ట్విట్టర్‌లో తెలిపారు. తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిన నేపథ్యంలో ఇంతకు ముందెన్నడూ లేని విధంగా స్పందించారు.అయితే అమితాబ్ తో పాటు ఇప్పటివరకు హ్యాకింగ్ తో విల విలలాడిన సెలబ్రిటీలను ఓ సారి చూద్దాం

Read more:హ్యాకింగ్ తో దేశాలను హడలెత్తిస్తున్న ఐఎస్

అలాంటివి చేయాల్సిన అవసరం లేదు

అలాంటివి చేయాల్సిన అవసరం లేదు

ఈ పని చేసిన మిత్రుడు ఎవరో గానీ అలాంటివి చేయాల్సిన అవసరం లేదంటూ ట్విట్టర్‌లో సున్నితంగా మందలించారు. కాగా, అమితాబ్ ట్విట్టర్ అకౌంట్ లోకి చొరబడ్డ హ్యాకర్ సెక్స్ సైట్స్ ను ఫాలో చేశాడు. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు విషయం గ్రహించిన అమితాబ్, తన అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని గ్రహించారు.

జుహు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ

జుహు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ

అయితే పరిస్థితి ముదిరిపోవడంతో ఆయన గత్యంతరం లేక ముంబై పోలీసులను ఆశ్రయించారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ జుహు పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు లేఖ రాశారు. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా బిగ్ బి పోలీసులను కోరారు.

బిగ్ బికి ట్విట్టర్లో 1.67 కోట్ల మంది ఫాలోయర్స్
 

బిగ్ బికి ట్విట్టర్లో 1.67 కోట్ల మంది ఫాలోయర్స్

కాగా బిగ్ బికి ట్విట్టర్లో 1.67 కోట్ల మంది ఫాలోయర్స్ ఉన్నారు. ఇక ఆయన మొబైల్ ఫోన్ కి సైతం ఇదే తరహా పరిస్థితిని ఎదుర్కోంటోంది. ఆయన మొబైల్ కు గత ఏడాది కాలం నుంచి అసభ్యకర మెసేజ్ లు వస్తున్నయని బిగ్ బి వాపోతున్నారు. అయితే వీటిలో కొన్ని అశ్లీల చిత్రాలు కూడా ఉన్నాయని అదే విషయాన్ని పోలీసులకు తెలిపానని బిగ్ బి ట్విట్టర్లో తెలిపారు.

అందరూ బాధితులే

అందరూ బాధితులే

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబాని ఆదాయపు పన్ను రిటర్న్ ఈ ఫైలింగ్ అకౌంట్ ను హైదరాబాద్ కు చెందిన యువతి హ్యక్ చేసింది.

అందరూ బాధితులే

అందరూ బాధితులే

వరుస విజయాలతో దూసుకెళుతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో విజయాలను చైనా చూడలేకపోతుంది. దీనిలో భాగంగా ఇస్రో కు చెందిన వాణిజ్య విభాగం సైట్‌ను హ‌్యక్ చేసింది. పీఎస్‌ఎల్‌వీ-సీ28 ఐదు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టిన రెండు రోజులుకే ఈ ఘటన జరగడంతో ఇస్రో అధికారులు ఉలిక్కిపడ్డారు.

రాజ్‌భవన్లో ఓ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్‌

రాజ్‌భవన్లో ఓ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్‌

గవర్నర్ నరసింహన్ నివాస సముదాయమైన రాజ్‌భవన్లో ఓ టెలిఫోన్ లైన్ హ్యాకింగ్‌ కు గురైంది. ఆ ఫోన్ బిల్లు అధికంగా రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఫోన్ నెంబర్ ను హ్యాక్ చేసిన కొందరు ఒమన్, శ్రీలంక దేశాల్లోని నెంబర్లకు భారీగా కాల్స్ చేశారని అధికారులు గుర్తించారు.సాక్ష్యాత్తూ గవర్నర్ నివాసం ఫోన్ హ్యాకింగ్‌ కు గురికావడం సంచలనం సృష్టించింది.

ఫేస్ బుక్ ను హ్యక్

ఫేస్ బుక్ ను హ్యక్

ఫేస్ బుక్ ను హ్యక్ చేసింది తామేనంటూ IS ఉగ్రవాద అనుబంధ సంస్ధ లిజర్డ్ స్క్వాడ్ ప్రకటించింది. ఫేస్ బుక్ తో పాటు వాట్సాప్, ఇన్ స్టాగ్రామ్ సైట్లను కుడా హ్యక్ చేసినట్టు సంస్ధ ట్వీట్ చేసింది. మరోవైపు ఫేస్ బుక్ లో ఏర్పడ్డ అంతరాయానికి సాంకేతికలోపం కారణమని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. తమ సేవల్లో అంతరాయానికి ఎలాంటి ఉగ్రవాదుల చర్యకు సంభందం లేదని ప్రకటించింది.

త్రిష బ్యాంక్‌ అకౌంట్‌ను హ్యాక్‌

త్రిష బ్యాంక్‌ అకౌంట్‌ను హ్యాక్‌

హీరోయిన్‌ త్రిష బ్యాంక్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారు. ఇందులోంచి దాదాపు రూ. కోటి రూపాయలు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా కోటి రూపాయలు గోవిందా కావడంతో త్రిష ఒకింత షాక్‌కు గురెైంది.

హాన్సిక ట్విట్టర్ అకౌంట్ ఇప్పటికే అయిదు సార్లు హ్యక్

హాన్సిక ట్విట్టర్ అకౌంట్ ఇప్పటికే అయిదు సార్లు హ్యక్

హీరోయిన్ హాన్సిక ట్విట్టర్ అకౌంట్ ఇప్పటికే అయిదు సార్లు హ్యక్ కు గురైందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. అయితే అది మళ్లీ తన కంట్రోల్ లోకి ఎలాగోలా తెచ్చకున్నానని ఆమె తెలిపింది.

నితిన్ ట్వీట్టర్ అకౌంట్ ను హ్యక్

నితిన్ ట్వీట్టర్ అకౌంట్ ను హ్యక్

ట్వీట్టర్ లో టచ్ లో ఉండే టాలీవుడ్ యంగ్ హీరోల్లో నితిన్ ఒకడు. అటువంటి నితిన్ ట్వీట్టర్ అకౌంట్ ను హ్యక్ చేశారట.ఈ కారణంగా ట్వీట్టర్ అకౌంట్ ని క్లోజ్ చేసుకుంటున్నాడట.

హృతిక్ పేరు మీద ఎవరో నకిలీ మెయిల్

హృతిక్ పేరు మీద ఎవరో నకిలీ మెయిల్

హృతిక్ పేరు మీద ఎవరో నకిలీ మెయిల్ ను సృష్టించటంతోపాటు తన స్నేహితులకు మెయిళ్లు కూడా పంపుతున్నారట. దీంతో కాలిన హృతిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. [email protected] పేరిట ఎవరో ఈమెయిల్ క్రియేట్ చేసి తన ఫ్యాన్స్ తోపాటు ఫ్రెండ్స్ కి కూడా మెయిల్స్ పంపుతున్నాడని. వెంటనే ఆ నకిలీ అకౌంట్ ను బ్లాక్ చేసి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

అందరూ బాధితులే

అందరూ బాధితులే

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బ్యాంకాక్ కు చెందిన ఆరు ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లను హ్యాక్ చేసింది. ట్యునీషియా నుంచి ఈ చర్యకు పాల్పడింది. ఈ సైట్లను తెరిచి చూసేవారికి రోహింగ్యా ముస్లింల చిత్రాలు దర్శనమిచ్చాయి.

ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్

ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్

గతంలో కూడా వీరే ఇజ్రాయెల్, ప్రెంచ్ సైట్లపై హ్యాకింగ్ కు పాల్పడ్డారు. దీనిపై థాయిలాండ్ సాంకేతిక శాఖ మంత్రి స్పందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సైట్లపై హ్యాకింగ్ దాడులు జరగడం సర్వ సాధారణమైందని, సమస్యను పరిష్కరిస్తున్నామని కూడా చెప్పారు.

Best Mobiles in India

English summary
here write After Twitter hack, Amitabh Bachchan takes police action against dirty abusive smses

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X