నెల్లూరు,తిరుపతిలో ఎయిర్ సెల్ 3జీ సేవలు
ఎయిర్ సెల్ 3జీ సర్వీసులను లాంచ్ చేసింది. చిత్తూరు నెల్లూరు జిల్లాలోని ఎయిర్ సెల్ వినియోగదారుల కోసం మూడవ తరం టెలికాం సర్వీసులను వినియోగదారుల కోసం తీసుకొచ్చింది.
Read more: ఈ 15 ఫోన్‌లు సగం రేట్లకే!

అలాగే ఎయిర్ సెల్ వినియోగదారులు 3జీ డేటా సర్వీసును వాడుకోవచ్చని ఇది చాలా స్పీడ్ గా పనిచేస్తుందని అలాగే కనెక్టివిటీ కూడా అంతే వేగంతో ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో పాటు ఎయిర్ సెల్ ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయాన్ని కూడా ఆంద్రప్రదేశ్ తెలంగాణాలో తీసుకొచ్చింది. దీని స్పీడు 64 కెబిపిఎస్ అని కంపెనీ తెలిపింది.
Read more: మోడీజీ..మీ సెల్పీ కథ అదిరింది.

వీటితో గుడ్ మార్నింగ్ ప్రొడక్ట్ ని కూడా మార్కెట్లోకి తెచ్చింది. ఈ ప్రొడక్ట్ ద్వారా ఉదయం ఎవరైనా ఫస్ట్ కాల్ ఉచితంగా చేసుకోవచ్చని దానికి ఎటువంటి చార్జింగ్ ఉండదని ఇది ఎయిర్ సెల్ సబ్ స్క్రైబర్స్ కు మాత్రమే అందుబాటులో ఉంటుందని వారు తెలిపారు.

అలాగే ఉదయం 6 నుంచి 8 గంటల మధ్యలో ఎయిర్ సెల్ టూ ఎయిర్ సెల్ ప్రీ కాల్స్ కూడా చేసుకోవచ్చని కూడా తెలిపింది.


Click it and Unblock the Notifications








