ఈ సారి ఎయిర్‌సెల్ ఆఫర్లతో దుమ్మురేపింది

Written By:

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కస్టమర్ల కోసం ఎయిర్సెల్ సరికొత్త డేటా, వాయిస్ కాంబో ప్యాక్లను అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే అన్ని టెల్కోలకు గట్టి పోటినిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఎయిర్ సెల్ ఈ ఆఫర్లతో కష్టమర్ల మనసును గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు పరిమిత రీ ఛార్జ్ మీద పుల్ టాక్ టైంతో పాటు ఉచితంగా డేటాను కూడా అందిస్తోంది.

జియో టార్గెట్‌గా కొత్త బ్రాండ్‌తో ఆర్‌కామ్, Aircel, MTS..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

497 రూపాయలతో రీచార్జ్

ఎవరైనా ఎయిర్‌సెల్ వినియోగదారులు 497 రూపాయలతో రీచార్జ్ చేసుకున్నట్లయితే వారికి 10 జిబి 3 జి డేటాను కంపెనీ అందిస్తోంది.

555 రూపాయల రీచార్జ్

అలాగే 555 రూపాయల రీచార్జ్ చేసుకున్నట్లయితే 555 రూపాయల ఫుల్ టాక్ టైంతో పాటు 5 జిబి 3 జి డేటాను ఉచితంగా అందిస్తోంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

599 రూపాయల రీచార్జ్

ఇక 599 రూపాయల రీచార్జ్ చేసుకున్నట్లయితే అపరిమిత లోకల్ కాల్స్, 1.5 జిబి 3 జి డేటాను యూజర్లకు అందిస్తోంది.

799 రూపాయల రీచార్జ్

చివరగా 799 రూపాయల రీచార్జ్ చేసుకున్నట్లయితే అపరిమిత లోకల్, ఎస్టీడి కాల్స్‌తో పాటు 2.5 జిబి 3 జి డేటాను పొందవచ్చు.

కాలపరిమితి 28 రోజులు

పైన చెప్పిన అన్ని ప్యాక్‌ల కాలపరిమితి 28 రోజులు ఉంటుందని ఇది కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమేనని ఎపి, తెలంగాణ సర్కిల్ ఆపరేషన్స్ హెడ్ వెంకటేషన్ తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Aircel launches data-voice combo packs RC497, RC555, RC599 and RC799 for Andhra Pradesh and Telangana subscribers
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting