జియో టార్గెట్‌గా కొత్త బ్రాండ్‌తో ఆర్‌కామ్, Aircel, MTS..

Written By:

జియోని ఢీ కొట్టేందుకు ఆర్‌కామ్, Aircel, MTS టెల్కోలు వచ్చే ఏడాది నుంచి కొత్త పేరుతో రానున్నాయి. ఇప్పటికే వీలీనమైన ఈ కంపెనీలు ఓ కొత్త పేరుతో మార్కెట్లోకి దూసుకురానున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే జియోని దెబ్బ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే జియోకి ఆర్ కామ్ సవాల్ విసురుతున్న నేపథ్యంలో మూడు కలిస్తే జియోకి మరిన్ని కష్టాలు తప్పవని విశ్లేషకులు భావిస్తున్నారు.

వెడ్డింగ్ కార్లు వచ్చేస్తున్నాయ్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు కలిపి ఒకే పేరుతో

ఇంటర్నెట్ ని కొత్త పుంతలు తొక్కించడానికి ఈ మూడు టెల్కోలు ఓ కొత్త పేరుతో రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే 2017లో ఇది జరిగే అవకాశం ఉంది.

పెట్టుబడులు

ఇప్పటికే ఈ దిగ్గజాలు భారీస్ఠాయిలో పెట్టుబడులు పెట్టాయి. ఇండియన్ టెలికాం సెక్టార్ లో సింహభాగం ఈ రెండు కంపెనీలే దక్కించుకున్నాయి. దాదాపు రూ. 18 వేల కోట్లు పెట్టుబడులతో ముందుకు దూసుకెళుతున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

జియోకి పోటీ

ఉచిత ఆఫర్లతో జియో దూసుకుపోతున్న నేఫథ్యంలో దానికి ధీటైన ఆఫర్లతో ఈ కొత్త బ్రాండ్ రానున్నట్లు తెలుస్తోంది. ఉచిత కాల్స్ తో పాటు ఉచిత ఎసెమ్మెస్ లు కూడా అందించే వ్యూహం రచిస్తోంది.

కాంబో ప్లాన్స్

జియో ఆఫర్లు 31తో అయిపోతున్న నేపథ్యంలో కంపెనీ దానికనుగుణంగా టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాంబో ప్యాక్ లతో కష్టమర్లకు చేరువ కానున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్ సెల్ యూజర్లు

దేశంలో దాదాపు 36 శాతం మంది ఎయిర్ సెల్ యూజర్లు ఉండటం అదీగాక వారు ఎయిర్ సెల్ డేటాను వాడటం కూడా వీరికి ఓ రకంగా కలిసివచ్చే అవకాశం ఉంది.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
Exclusive: RComm, Aircel, and MTS Combinedly to Become a New Brand in 2017! Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting