రూపాయితో రెండు గంటల టాక్‌టైమ్
ప్రముఖ టెలికామ్ ప్రొవైడర్ ఎయిర్‌సెల్ సరికొత్త ఫ్రీ కాలింగ్ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేవలం ఒక్క రూపాయి చెల్లించి ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉచితంగా కాల్స్ చేసుకునే విధంగా ‘గుడ్ మార్నింగ్ ప్యాక్'ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ దేశ్యవాప్తంగా ఉన్న 13 ఎయిర్‌సెల్ సెట్‌వర్క్ సర్కిళ్లలో అందుబాటులో ఉంటుంది.
మీ ఫోన్‌ను చిక్కుల్లో పడేసే 10 తప్పులు
రూ.1 రీచార్జ్ లేదా *121*6290#కు డయల్ చేయటం ద్వారా ఈ ఆఫర్‌ను ఎయిర్‌సెల్ చందాదారులు ‘గుడ్ మార్నింగ్ ప్యాక్'ను సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో భాగంగా ఆఫర్ నిర్థేశించిన సమయంలో చేసే మొదటి కాల్‌కు రూ.1ని వసూలు చేస్తారు. ఆ తరువాతి కాల్స్‌ను ఉచితంగా మాట్లాడుకోవచ్చు.
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
టెలికాం ఆధారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిబంధనల మేరకు పసలేని కారణాలు చూపించి మొబైల్ నెంబర్ పోర్టబులిటీ అభ్యర్థనను తిరస్కరించిన సర్వీస్ ప్రొవైడర్‌లు రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అపరాధ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (ఎంఎన్‌పీ)కి సంబంధించి ఫిర్యాదు చేయాల్సి వస్తే ఈ నిబంధనలను ఆచరించండి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
ముందుగా మీ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి టోల్ ఫ్రీ కస్టమర్ సర్వీస్ నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోండి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
వెంటనే సంబంధిత టెల్కో నుంచి ఫిర్యాదు నెంబర్, తేది, సమయంతో తదితర అంశాలతో కూడిన మెసేజ్ అందుతుంది. ఆ సందేశాన్ని భద్రపరుచుకోండి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
సమస్య పరిష్కారం కాని పక్షంలో ఆ ఫిర్యాదు నెంబర్‌ను రుజువుగా చూపించి తదుపరి చర్యకు సన్నద్ధంకండి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
మీ ఫిర్యాదుకు సంబంధించి సదరు టెల్కో స్పందించనట్లయితే అప్పీలు అధికారికి ఫిర్యాదు చేసుకునే అవకాశముంది.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
మీరు ఫిర్యాదు చేయాలనుకునే సర్వీస్ ప్రొవైడర్ అప్పిలేట్ అధికారి పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో పేర్కొనబడతాయి. లేదా మీసిమ్ కార్డు ద్వారా పొందిన బుక్‌లెట్‌లో పొందుపరచబడతాయి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
మీ ఫిర్యాదు స్వీకరించిన అప్పీలేట్ అధికారి సమస్య పరిష్కారానికి కొంత సమయాన్ని అడుగుతారు. వారు పేర్కొన్న వివరాలను భద్రంగా ఉంచాలి.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
అక్కడ కూడా మీ సమస్య ఓ కొలిక్కిరానట్లయితే అప్పీలేట్ అధికారి ఇచ్చిన వివరాలను రుజువులుగా పేర్కొంటు టెలికాం శాఖకు ఫిర్యాదు చేయవచ్చు.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
మీ సమస్యను పరిష్కరించటంలో అప్పీలేట్ అధికారి విఫలమైనట్లయితే నేరుగా సంబంధిత రుజువులతో ‘భారతదేశ ప్రభుత్వ టెలికాం శాఖ'(డాట్ )కు ఫిర్యాదు చేయవచ్చు.

మొబైల్ నెంబర్ పోర్టబులిటీ గురించి పలు ఆసక్తికర విషయాలు
ఫిర్యాదు అందాల్సిన చిరునామా: పబ్లిక్ గ్రీవెన్సెస్ సెల్, డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికామ్, రూమ్ నెం.518, సంచార్ భవన్, 20, ఆశోకా రోడ్, న్యూఢిల్లీ 110001

Click it and Unblock the Notifications