మరో సంచలనం..ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ ఉచిత కాల్స్‌

Written By:

జియోతో మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తుతున్న నేపథ్యంలో కంపెనీలు ఒకదాని మీద ఒకటి పోటీలు పడీ మరీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఎక్కడ తమ కష్టమర్లు జారిపోతారోనని వారికి ఉచిత ఆఫర్లతో సెల్యూట్ చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఎయిర్‌టెల్, ఐడియా, బిఎస్ఎన్ఎల్,వొడాఫోన్ కంపెనీలు వేటికవే ధీటుగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి.అయితే ఇప్పుడు అదే వరసలో ఎయిర్‌సెల్ కూడా చేరింది. తమ కష్టమర్ల కోసం బంపరాఫర్‌ని ప్రకటించింది.

అన్ని కంపెనీల అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లు ఇక్కడే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చందాదారుల కోసం

పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌సెల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ చందాదారుల కోసం సరికొత్త ఆఫర్లను విడుదల చేసింది.

జోడి ఆఫర్‌తో

జోడి ఆఫర్‌తో రెండు సిమ్‌లు ఉండే ప్యాక్‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సంవత్సరంపాటు ఈ రెండు నెంబర్ల మధ్య అపరిమితంగా మాట్లాడుకోవచ్చు.

మొదటి మూడు నెలలు ఉచితంగా

మొదటి మూడు నెలలు ఉచితంగా మాట్లాడుకోవచ్చని, ఆ తర్వాత 12 నెల వరకూ ప్రతి రోజు మొదటి 60 సెకన్లకు సెకనుకు పైసా చొప్పున చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

కుటుంబసభ్యులు, స్నేహితులతో

కుటుంబసభ్యులు, స్నేహితులతో తరచూ మాట్లాడే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సర్కిల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ వెంకటేషన్‌ తెలిపారు.

333 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే

ఇందులో భాగంగా 333 రూపాయలతో రీచార్జ్‌ చేసుకుంటే 5జిబి 3జి డేటాను 28 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు కంపెనీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Aircel to offer 'Jodi Offer' SIM packs with unlimited calling benefits read more telugu gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot