అన్ని కంపెనీల అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్లు ఇక్కడే

Written By:

జియో ఎంట్రీతో కష్టమర్లు ఇప్పుడు సంబరాలు ఆఫర్ల సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని కంపెనీలు ఇప్పడు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ దశలో ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్,బిఎస్ఎన్ఎల్ లాంటి దిగ్గజాలు జియోకు పోటీగా సరికొత్త టారిప్ ప్లాన్లను తీసుకువచ్చాయి. ఈ ఆఫర్లు జియోకి ధీటుగా ఉన్నాయని కంపెనీ చెబుతోంది. మరి బెస్ట్ ఆఫర్లు ఏంటో ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

ఎయిర్‌టెల్ దుమ్మురేపింది: ప్రపంచమంతా ఫ్రీ కాల్స్,ఒకే నంబర్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటా

రూ. 1495తో రీ ఛార్జ్ చేసుకుంటే 90 రోజుల పాటు అన్‌లిమిటెడ్ డేటాను పొందవచ్చని కంపెనీ తెలిపింది. ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్‌కు ఫెయిర్ యూసేజ్ పాలసీ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 90 రోజుల ప్లాన్ వ్యాలిడిటీలో మొదటి 30 జీబి వరకు 4జీ స్పీడ్ వర్తిస్తుందని, లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం 2జీకి పడిపోతుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

ఎయిర్‌టెల్ మిస్ డ్ కాల్ 1 జిబి ఆఫర్

తాజాగా ఎయిర్‌టెల్‌ కొత్త 4జీ యూజర్లకు 1జీబి 4జీ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ డేటాను 28 రోజులు పాటు ఉపయోగించుకోవచ్చు.ఈ ఉచిత డేటా ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ నెంబర్ నుంచి 52122 టోల్ ఫ్రీ నెంబర్‌కు మిస్సుడ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.ఆ కాల్ డిస్కనక్ట్ అయిన వెంటనే ఓ ఎస్ఎంఎస్ మీకు అందుతుంది. మీ మొబైల్ నెంబర్ తాలుకా అకౌంట్ లో 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ డేటా క్రెడిట్ అయినట్లు ఆ మెసేస్ సారాంశం ఉంటుంది. వెంటనే బ్యాలన్స్ చెక్ చేసుకునేందుకు #121*2#కు డయల్ చేయండి.

బిఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ ప్లాన్

రిలయన్స్ జియోకి పోటీగా బీఎస్ఎన్ఎల్ 'ఎక్స్‌పీరియన్స్‌ అన్‌లిమిటెడ్‌ బిబి 249 ద్వారా ఖాతాదారులు అన్ లిమిటెడ్ డేటాతో పాటు రూపాయి కంటే తక్కువ ధరకే ఒక జిబి డేటా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని చెబుతోంది.ఈ ప్లాన్ లో డేటా స్పీడ్ 2 ఎంబిపిఎస్‌ వేగంతో ఉంటుంది. అలాగే 1 ఎంబిపిఎస్‌ పోస్ట్‌ ఎఫ్‌యుపి స్పీడ్‌ ఉంటుంది. ఇది అన్ లిమిలెడ్ 4జీ డేటాను మీకందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ అన్ లిమిటెడ్ ప్లాన్

అది అయిపోయిన తరువాత 1 జిబి డేటా వరకు మీకు అదనంగా అదీ ఉచితంగా ఓ ప్లాన్ లభిస్తుంది. ఈ ప్లాన్ ద్వారా రూ.1 కంటే తక్కువ ధరకే ఒక జిబి జిబి డేటా డౌన్‌లోడింగ్‌ ని మీరు పొందవచ్చు.మీరు ఎటువంటి ఛార్జీలు లేకుండా ఈ అన్ లిమిటెడ్ అప్ లోడింగ్ అలాగే డౌన్ లోడింగ్ ను పొందవచ్చు. ఇది 1 ఎంబీపీఎస్ స్పీడ్ తో మీకు లభిస్తుంది. ఈ ప్లాన్ 6 నెలల వరకు మీరు వాడుకోవచ్చు. అంటే మీకు నెలకు 49 రూపాయల కాస్ట్ అవుతుంది. అదే రోజుకి కేవలం 75 పైసలు మాత్రమే ఛార్జ్ అవుతుంది.

వొడాఫోన్ 1 జిబి కాస్ట్ తో 10 జిబి

 రిలయన్స్ జియో ఉచిత సర్వీస్ ఆఫర్‌కు ధీటుగా సరికొత్త ఆఫర్‌ను వొడాఫోన్ సోమవారం మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సంచలనాత్మక ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్‌ను పొందే అవకాశాన్ని వొడాఫోన్ తన సూపర్ నెట్ యూజర్లకు కల్పించింది.

వొడాఫోన్ 1 జిబి కాస్ట్ తో 10 జిబి

కొత్త 4జీ స్మార్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వొడాఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ మూడు నెలల పాటు వర్తిస్తుంది. అంటే ప్రతినెలా 1జీబి ఇంటర్నెట్‌కు డబ్బులు వెచ్చిస్తే చాలు, మీగితా 9జీబి ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్‌కు సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్‌లో ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది.

ఐడియా ఆఫర్లు

ఐడియా డేటా ఆఫర్లను తగ్గించింది. దాదాపు 67 శాతం వరకు ధరలను తగ్గించింది. 10 జిబి డేటాను రూ. 990 కే పొందవచ్చు. అలాగే 2జిబిని రూ. 349కి ,3 జిబిని రూ. 649 కి పొందవచ్చు. నెల రోజుల వ్యాలిడితో లభిస్తుంది.

ఐడియా ఆఫర్లు

దీంతో పాటు ఫ్రీడం ప్యాక్ పేరుతో సరికొత్త ఆఫర్లను ప్రీపెయిడ్ కష్టమర్ల కోసం ప్రకటించింది. ఇందులో భాగంగా 300MB(2G)రూ. 100 కు, 500MB రూ. 175కు లభిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Jio 4G is here so Airtel, Idea, Vodafaone, BSNL line up unlimited data offers read more telugu gizbot
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting