కనీస రీఛార్జ్ విధానాన్ని కొనసాగిస్తున్న టెల్కోలు

|

టెలికాం రంగంలో తమ నష్టాలను తగ్గించి కొంత స్థిరత్వాన్ని తీసుకురావడానికి రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా మరియు భారతి ఎయిర్‌టెల్ సంస్థలు తమ ప్రీపెయిడ్ టారిఫ్ ధరలను ఈ నెల ప్రారంభంలో విజయవంతంగా పెంచాయి. కేటాయించిన FUP పరిమితిని ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్‌గోయింగ్ కాల్‌ల కోసం రిలయన్స్ జియో ఇప్పటికీ నిమిషానికి ఆరు పైసలు వసూలు చేస్తున్నది.

ఆఫ్-నెట్ వాయిస్ కాల్‌
 

ఆఫ్-నెట్ వాయిస్ కాల్‌లపై FUP పరిమితిని తొలగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా సంస్థలు ప్రకటించాయి. వీటి ద్వారా వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభించింది. టారిఫ్ ధరల పెంపు ఉన్నప్పటికీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కనీస రీఛార్జ్‌ల విధానాన్ని తొలగించలేదు. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా చందాదారులు తమ ప్రీపెయిడ్ అకౌంట్ ను యాక్టీవ్ లో ఉంచడానికి ప్రతి నెలా తప్పనిసరిగా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

నకిలీ ఐఫోన్ ను పంపిణి చేసిన ఫ్లిప్‌కార్ట్‌.. అది కూడా బెంగళూరులో

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లలో కనీస రీఛార్జ్ విధానం

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లలో కనీస రీఛార్జ్ విధానం

కనీస రీఛార్జ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని దేశంలోని రెండు పెద్ద టెల్కోలు నిర్ణయించిన తరువాత ఆవిధానం అక్టోబర్ 2018 నుండి అమలులోకి వచ్చింది. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా కస్టమర్లు ప్రతి నెలా తప్పనిసరిగా రీఛార్జ్ చేయవలసి ఉంటుంది. ఒక వేల రీఛార్జ్ చేయకపోతే రీఛార్జ్ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత ఇన్‌కమింగ్ కాల్‌లు ఆపివేయబడతాయి. ఉదాహరణకు మీరు వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లో 249 రూపాయల అపరిమిత ప్లాన్‌లో ఉంటే మీ ప్రస్తుత ప్లాన్ ఈరోజు గడువు ముగిసింది అనుకుంటే అప్పుడు మీకు ఏడు రోజుల తర్వాత ఇన్‌కమింగ్ కాల్‌లు రావు. ప్రీపెయిడ్ అకౌంట్ లో మీకు టాక్ టైమ్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ అవుట్గోయింగ్ కాల్స్ వెంటనే ఆపివేయబడతాయి.

ఎయిర్‌టెల్
 

పునర్విమర్శ తరువాత ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా రెండు సంస్థలు ఇప్పుడు కేవలం మూడు కనీస రీఛార్జ్ ప్లాన్‌లను మాత్రమే అందిస్తున్నాయి. అవి రూ.23 (వోడాఫోన్ ఐడియాలో రూ.24), రూ.49 మరియు రూ.79 ప్లాన్‌లుగా అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో రూ.23 స్మార్ట్ రీఛార్జ్ మరియు వోడాఫోన్ ఐడియా నెట్‌వర్క్‌లోని రూ.24 ఆల్ రౌండర్ ప్రీపెయిడ్ ప్లాన్ తో యూజర్లు తమ అకౌంట్ ను యాక్టీవ్ గా ఉంచడానికి గొప్ప ఎంపిక. ఈ ప్లాన్ ఎటువంటి డేటా, టాక్ టైమ్ మరియు ఎస్ఎంఎస్ ప్రయోజనాలను అందించదు. దానికి బదులుగా ఇది ప్రీపెయిడ్ అకౌంట్ యొక్క సర్వీస్ యాక్సిస్ ను మరింత పొడగిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.23 రీఛార్జ్ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటుతో వస్తుంది. అలాగే వోడాఫోన్ ఐడియా యొక్క రూ.24 ప్లాన్ కేవలం 14 రోజులు చెల్లుబాటుతో మాత్రమే వస్తుంది. కాబట్టి మీరు నెలకు రెండుసార్లు (28 రోజులు) ఒకే రీఛార్జ్ చేయవలసి ఉంటుంది.

ఎయిర్‌టెల్

ఇక వాయిస్ కాల్‌ల విషయానికొస్తే ఏదైనా స్థానిక / ఎస్‌టిడి కాల్‌లకు వినియోగదారుల నుండి సెకనుకు 2.5 పైసలు వసూలు చేస్తారు. ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం రూ.23 స్మార్ట్ రీఛార్జిని రీఛార్జ్ చేయడం పూర్తిగా వినియోగకరంగా ఉంటుంది. కాని వోడాఫోన్ ఐడియా విషయంలో వారు రూ.24 ప్యాక్‌ను రెండుసార్లు రీఛార్జ్ చేయడానికి బదులుగా రూ.49 ఆల్ రౌండర్ ప్యాక్‌ను ఎంచుకోవడం చాలా ఉత్తమం.

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం టెల్కోస్ సరసమైన టాక్ టైమ్ ప్లాన్‌లు

ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం టెల్కోస్ సరసమైన టాక్ టైమ్ ప్లాన్‌లు

తాజా పునర్విమర్శ తరువాత టారిఫ్ ప్లాన్‌లు పాత ధరల కంటే కనీసం 25% ఎక్కువ ఖర్చు అవుతున్నాయి. కాబట్టి టెల్కోలు చందాదారులకు కొంత ఉపశమనం కూడా ఇస్తున్నాయి. ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు సరసమైన టాక్ టైమ్ ప్లాన్‌లను రూ.20, రూ.30 మరియు రూ.50 తిరిగి తీసుకువచ్చాయి. తద్వారా వారు బేస్ మినిమమ్ రీఛార్జ్ ప్లాన్‌తో పాటు వాయిస్ కాల్స్ చేయడానికి టాక్ టైమ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవచ్చు.

ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్

టాక్ టైమ్ ప్లాన్ ఏదీ కూడా ఫుల్ టాక్ టైమ్ బెనిఫిట్‌తో షిప్ చేయదు. ఇది చాలా మంది ప్రీపెయిడ్ వినియోగదారులను నిరాశపరుస్తుంది. ప్రస్తుతం ఎయిర్‌టెల్ టాక్ టైమ్ ప్లాన్‌లలో రూ.10, రూ.20, రూ.100, రూ.500, రూ.1,000 అందిస్తున్నది. అలాగే వోడాఫోన్ ఐడియా రూ.10, రూ.20, రూ.30, రూ.50, రూ.100 టాక్ టైమ్ ప్లాన్‌లను అందిస్తోంది.

ఎక్స్‌టెన్షన్‌ను

సర్వీస్ వాలిడిటీ ఎక్స్‌టెన్షన్‌తో టెల్కోస్ నుండి రూ.49 కనీస రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో రూ.38.52 టాక్‌టైమ్ మరియు 100 ఎంబి డేటాను అందిస్తున్నది. అలాగే రూ.79 ప్యాక్ 200 ఎంబి డేటా మరియు రూ.64 టాక్ టైమ్ ప్రయోజనాలతో పాటు సర్వీస్ యొక్క వాలిడిటీ ఎక్స్‌టెన్షన్‌ను 28 రోజులపాటు అందిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel and Vodafone Idea Still Continue Minimum Prepaid Recharges

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X