జియోకే షాక్ ఇస్తున్న ఎయిర్‌టెల్ అన్ లిమిటెడ్ ఆఫర్లు

Written By:

రిలయన్స్ జియో రాకతో అన్ని కంపెనీలు ఇప్పుడు అలర్టయ్యే పరిస్థితి వచ్చింది. రిలయన్స్ జియో కమర్షియల్‌గా ఆగష్టులో లాంచ్ చేస్తున్న నేపథ్యంలో టెలికం కంపెనీలు తమ కష్టమర్లంతా జియో వైపు వెళ్లకుండా ఉండేందుకు అదిరిపోయే ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న ఐడియా నిన్న వోడాఫోన్ నేడు ఎయిర్ టెల్ కష్టమర్లకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఎయిర్ టెల్ ఇప్పుడు అన్ లిమిటెడ్ కాల్స్ తో కష్టమర్లకు అదిరిపోయే ఆఫర్ ను ఇచ్చింది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో ప్రాజెక్టుకు కమర్షియల్ లాంచ్‌కు ముందే

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతిష్టాత్మకమైన జియో ప్రాజెక్టుకు కమర్షియల్ లాంచ్‌కు ముందే టెలికాం సంస్థలన్నీకొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం నంబర్‌వన్ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ తమ పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

నెలకు 1,199 రూపాయలకే

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

నెలకు 1,199 రూపాయలకే అన్ లిమిటెడ్ మొబైల్ కాల్స్ ఆఫర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.

పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

ఈ కొత్త ప్లాన్‌తో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. నేషనల్ రోమింగ్ కాల్స్‌పై ఎలాంటి రుసుములుండవని పేర్కొంది.

రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

ఈ ఆఫర్‌తో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, ఉచిత డేటా ఆఫర్లను ఎంజాయ్ చేయొచ్చని పేర్కొంది.

గత నెల్లోనే హ్యాపీ అవర్స్‌తో

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

గత నెల్లోనే హ్యాపీ అవర్స్‌తో వినియోగదారుల మది దోచుకున్న ఎయిర్‌టెల్ ఇప్పుడు ఈ ఆఫర్‌తో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

హ్యాపీ అవర్స్ డేటా ప్రీపెయిడ్ యూజర్ల కోసం

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

అయితే అప్పట్లో వచ్చిన హ్యాపీ అవర్స్ డేటా ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఉద్దేశించింది . ప్రస్తుతం పోస్ట్ పెయిడ్ వినియోగదారులకు ఈ కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది.

ఎప్పుడైనా రిలయన్స్ జియో సేవలు

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

రానున్న మూడునెలల కాలంలో ఎప్పుడైనా రిలయన్స్ జియో సేవలు కమర్షియల్‌గా ప్రారంభం కావొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రిలయన్స్ తమ నెట్ వర్క్ ట్రయల్స్‌కు

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

ఇదిలా ఉంటే కమర్షియల్ ప్రారంభంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో రిలయన్స్ తమ నెట్ వర్క్ ట్రయల్స్‌కు వినియోగదారుల నుంచి రిజిస్ట్రేషన్లు ఆహ్వానిస్తోందట.

ఈ విషయాన్ని పసిగట్టిన అన్ని టెలికం కంపెనీలు

అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్లతో అదరగొడుతున్న ఎయిర్‌టెల్

ఈ విషయాన్ని పసిగట్టిన అన్ని టెలికం కంపెనీలు తమ కష్టమర్లను ఎలాగైనా కాపాడుకోవాలని అలాగే కొత్త కష్టమర్లను ఆకట్టుకోవాలని సరికొత్త ఆఫర్లకు తెరలేపినట్లుగా తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Airtel Announces 'Unlimited' Voice Calling Ahead Of Reliance Jio Launch
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting