ఫోన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు : ఎయిర్‌టెల్ కొత్త సర్వీస్

Posted By: Super

 ఫోన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు : ఎయిర్‌టెల్ కొత్త సర్వీస్

 

విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచే క్రమంలో  భారతి ఎయిర్ టెల్ సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది. తన వినియోగదారులకు మొబైల్ ఫోన్లలో ఎంఎడ్యుకేషన్ సేవలు ప్రారంభించింది. దీంతో మొబైల్ ఫోన్ల ద్వారా ఇంగ్లీషు నేర్చుకోవచ్చని, పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చని, కెరీర్ కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చని  సంస్థ తెలిపింది. వినియోగదారుల మాతృభాషలో వాయిస్ ద్వారా కాని, ఎస్ఎంఎస్‌ల ద్వారా కాని ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. రోజుకు 1.5 రూపాయల నుంచి 10 రూపాయల చెల్లించడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని పేర్కొంది. యుపిఎస్‌సి, ఎంబిఎ ప్రవేశ పరీక్షలకు మొబైల్ ద్వారా మాక్ టెస్టుల నిర్వహిస్తామని తెలిపింది. 12 మాక్ టెస్టులు నిర్వహిస్తామని, ఇందుకోసం 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని ఆ సంస్థ చెప్పింది. దేశంలో కొన్ని ప్రాంతాల్లో సాధారణ విద్యకు కొన్ని పరిమితులున్నాయని, తమ ఎంఎడ్యుకేషన్ సేవల ద్వారా విద్యా రంగంలోని సవాళ్లను అధిగమించవచ్చని భారతి ఎయిర్‌టెల్ అధ్యక్షుడు(కన్స్యూమర్ బిజినెస్) కె శ్రీనివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నమ్మలేని నిజాలు..!

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot