కళ్ళుచెదిరే డేటా ఆఫర్లతో ఎయిర్‌టెల్ V-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు
భారతదేశంలో ఎయిర్‌టెల్ V-ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ఇప్పుడు అందిస్తున్న తన మూడు ప్లాన్‌లపై అదనపు డేటాను అందిస్తున్నాయి. టెల్కో తన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై ఆరు నెలల చెల్లుబాటుతో 100GB వరకు అదనపు డేటాను అందిస్తోంది. చెల్లుబాటు ముగిసిన తరువాత అదనపు ఖర్చు చేయని డేటా జప్తు చేయబడుతుంది.

ఇప్పుడు అదనపు డేటాతో కూడిన ప్లాన్‌లలో ఎయిర్‌టెల్ బేసిక్ ప్లాన్ 799 రూపాయలకు, ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ 1,099 రూపాయలకు మరియు ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ 1,599 రూపాయలకు అందించబడుతుంది.

799 రూపాయల బేసిక్ ప్లాన్ వివరాలు:
కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు డేటా ఆఫర్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యొక్క 799 రూపాయల బేసిక్ ప్లాన్ అది ముందు అందించే 100GB డేటాకు అదనంగా మరొక 100GB డేటాను కలిపి మొత్తంగా 200GB డేటాతో వస్తుంది. ఈ 200GB అదనపు డేటా యొక్క చెల్లుబాటు ఆరు నెలలు మాత్రమే. ఈ ప్లాన్ 40Mbps వేగంతో వస్తుంది. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత లోకల్ మరియు STD కాల్స్, ఎయిర్టెల్ టివి ప్రీమియం సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్ ను అందిస్తుంది.

1,099 రూపాయల ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ వివరాలు:
ఎయిర్‌టెల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ విషయానికి వస్తే ఇది 1,099 రూపాయల ధరతో ఆరు నెలల చెల్లుబాటు కాలంతో 500GB అదనపు డేటాతో వస్తుంది. ఈ ప్లాన్ మొదట 300GB డేటాను 100Mbps వేగంతో అందిస్తూ ఉండేది. ఇప్పుడు అదనంగా మరొక 200GB డేటాను అందిస్తోంది.అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ మరియు అమెజాన్ ప్రైమ్ చందా, నెట్‌ఫ్లిక్స్ చందా, జీ 5 ప్రీమియం చందా మరియు ఎయిర్‌టెల్ టివి ప్రీమియం చందా యొక్క ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రయోజనాలను అందిస్తుంది.

1,599 రూపాయల ఎయిర్‌టెల్ ప్రీమియం ప్లాన్ వివరాలు:
ఎయిర్‌టెల్ యొక్క ప్రీమియం ప్లాన్ ధర 1,599 రూపాయలు. ఈ ప్లాన్ 1000GB బోనస్ డేటాను ఆరు నెలల చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. మొదట ఈ ప్రీమియం ప్లాన్ 600GB డేటాను 300Mbps వేగంతో అందిస్తూ ఉండేది. ఇప్పుడు అదనంగా మరొక 400GB డేటాను అందిస్తోంది.అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే ఇది అపరిమిత లోకల్, STD కాల్స్ మరియు ఎయిర్టెల్ థాంక్స్ ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ చందా, నెట్‌ఫ్లిక్స్ చందా, Zee5 ప్రీమియం చందా మరియు ఎయిర్‌టెల్ టివి ప్రీమియం చందాను అందిస్తాయి.

ఎయిర్‌టెల్ VIP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు:
ఎయిర్‌టెల్ VIP బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ యొక్క ధర నెలకు 1,999 రూపాయలు. ఇది అదనపు డేటాతో బండిల్ చేయబడి రాదు. ఎందుకంటే ఇది ఇప్పటికే 100Mbps వేగంతో అపరిమిత డేటాను అందిస్తోంది. ఇది కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా అపరిమిత లోకల్ మరియు STD కాల్స్ మరియు అమెజాన్ ప్రైమ్ చందా, నెట్‌ఫ్లిక్స్ చందా,Zee5 ప్రీమియం చందా మరియు ఎయిర్‌టెల్ టివి ప్రీమియం సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఎయిర్టెల్ థాంక్స్ అన్ని ప్రయోజనాలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








