Home
News

రిలయన్స్ జియో 4K సెట్-టాప్ బాక్స్ ఇతర ఆఫర్‌ల వివరాలు

ఆగష్టు 12 న రిలయన్స్ జియో తమ విలువైన వినియోగదారుల కోసం ఇండియాలో కొత్తగా తీసుకువస్తున్న కొత్త సేవలను ప్రకటించింది. ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెలికాం ఆపరేటర్ వారి కోసం ఎదురుచూస్తున్న చందాదారుల కోసం కొత్త సర్వీస్ లను ప్రవేశపెట్టారు. ఫైబర్ ఆధారిత బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం చాలా మంది ఎదురుచూస్తుండగా రిలయన్స్ జియో నుండి టీవీ సర్వీస్ ప్రకటన కోసం కూడా చాలా మంది వేచి ఉన్నారు.

Reliance Jio 4K Set-Top Box Offers

ఈ వ్యక్తుల కోసం జియో ఫైబర్ కనెక్షన్ ఆధారంగా నడుస్తున్న జియో సెట్-టాప్ బాక్స్ యొక్క ప్రకటనను రిలయన్స్ జియో ప్రకటించింది. రిలయన్స్ జియో యొక్క ప్రకటన వేదికపై డెమో నిర్వహించి సెట్-టాప్ బాక్స్ ఎలా పనిచేస్తుందో మరియు దాని యొక్క లక్షణాలను ప్రపంచానికి చూపించింది. ఇప్పుడు టెలికాం ఆపరేటర్ ఈ ఉత్పత్తి యొక్క ధరను చూపించనప్పటి నుండి వినియోగదారుల నుండి గణనీయమైన ఆసక్తిని మరియు ట్రాక్షన్‌ను సంపాదించగలిగింది.

Reliance Jio 4K Set-Top Box Offers

ఈ జియో సెట్-టాప్ బాక్స్ యొక్క సర్వీస్ ఇప్పటికే ఉన్న వాటి నుండి ఎలా భిన్నంగా ఉంటుంది అనేది తెలుసుకోవటానికి ముందుకు చదవండి.

రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ మరియు ఇతర ఆపరేటర్ల మధ్య తేడాలు:

రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ మరియు ఇతర ఆపరేటర్ల మధ్య తేడాలు:

రిలయన్స్ జియో నుండి వస్తున్న ఆఫర్లకు మరియు ఇప్పటికే ఉన్న వాటికి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం సెట్-టాప్ బాక్స్ ద్వారా రిలయన్స్ జియో అందించే మొత్తం అన్ని రకాల ఫీచర్స్. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవిలో చాలా సారూప్య ఎంపికలు ఉన్నాయి. కానీ జియో వినోద పరిష్కార కన్సోల్ ఇతర వినోద పరిష్కారాలు అందించని విస్తృత లక్షణాలతో వస్తుంది. అలాగే స్థానిక కేబుల్ ఆపరేటర్ల (LCOs) హాత్వే కేబుల్, డెన్ నెట్‌వర్క్‌ల ద్వారా వినియోగదారులు తమ టీవీలో కూడా ఛానెల్‌లను యాక్సెస్ చేయగలుగుతారని రిలయన్స్ జియో ప్రకటించింది.

 యాప్ ల పోర్ట్‌ఫోలియో:

యాప్ ల పోర్ట్‌ఫోలియో:

వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ నుండి వస్తున్న మరొక ప్రధాన ఆఫర్ లైవ్ టివి, వీడియో-ఆన్-డిమాండ్ కంటెంట్ మరియు మరిన్నింటిని రవాణా చేసే యాప్ ల అతి పెద్ద పోర్ట్‌ఫోలియో. అయితే ఇప్పటి వరకు రిలయన్స్ జియో ఈ కంటెంట్‌ను పెద్ద స్క్రీన్ పైకి తీసుకురావడానికి మార్గం లేదు. జియో సెట్-టాప్ బాక్స్‌తో ఇప్పుడు టెలికాం ఆపరేటర్ ఈ కంటెంట్‌ను టీవీ స్క్రీన్‌లకు తీసుకురాగలుగుతున్నారు. వినియోగదారులు JioSaavn, Jio TV మరియు మరిన్ని యాప్ లను టీవీ స్క్రీన్ ద్వారా ఆస్వాదించగలుగుతారు.

గేమింగ్, MR మరియు VR ఫీచర్స్:

గేమింగ్, MR మరియు VR ఫీచర్స్:

రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్ యొక్క మరొక ప్రధాన ఫీచర్ గేమింగ్. దీని ద్వారా వినియోగదారులు పూర్తి స్థాయిలో గేమ్ ఆడడానికి అనుమతిస్తుంది. జియో తన పోర్ట్‌ఫోలియోలో FIFA 19 ఆటను హోస్ట్ చేసే సెట్-టాప్ బాక్స్‌ను చూపిస్తుంది మరియు ఎస్‌టిబి అన్ని రకాల గేమ్ కంట్రోలర్‌లకు అనుకూలంగా ఉంటుంది. ఇవే కాకుండా జియో ప్లాట్‌ఫామ్‌కు మరిన్ని ఆటలను తీసుకురావడానికి గేమింగ్ కంపెనీలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వీటితో పాటు చందాదారులకు MR, VR సేవలు కూడా ఉండబోతున్నాయి. చివరగా వేగవంతమైన JioFiber కనెక్షన్ ద్వారా ఒకే సమయంలో నలుగురు వ్యక్తులతో వీడియో కాలింగ్‌ను అనుమతించే JioCalll ఫీచర్ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండబోతోంది.

ఎయిర్టెల్ ఇంటర్నెట్ టివి:

ఎయిర్టెల్ ఇంటర్నెట్ టివి:

మార్కెట్లో రిలయన్స్ జియో యొక్క సెట్-టాప్ బాక్స్‌కు దగ్గరి పోటీదారు ఎయిర్టెల్ ఇంటర్నెట్ టివి. ఇది ఆండ్రాయిడ్ టివి సపోర్ట్‌తో వస్తుంది. కానీ ఇందులో VR మరియు MR వంటి కొన్ని ఫీచర్లు లేవు. ప్రస్తుతం సెట్-టాప్ బాక్స్‌ 3,499 రూపాయల ధర మరియు OTT యాప్ లు మరియు మరిన్ని ఫీచర్లతో మార్కెట్ లో అందుబాటులో ఉంది. మార్కెట్ లో రిలయన్స్ జియో సెట్-టాప్ బాక్స్‌కు గట్టి పోటీ ఇవ్వడానికి ఇది ఒకటే అర్హమైనది.

More from GizBot

Best Mobiles in India

English summary
Reliance Jio 4K Set-Top Box Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X