జియో ఎఫెక్ట్ : ఎయిర్‌టెల్ కొత్త వ్యూహం
విస్తరణలో భాగంగా మరో కీలక అడుగు,
దేశంలోనే అతి పెద్ద టెలికం రంగంగా పేరుగాంచిన ఎయిర్‌టెల్ భారీ విస్తరణకు సిద్ధమవుతోంది. ఓ పక్క జియో ఎంట్రీతో టెలికం సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తుంటే మరో పక్క దేశీయ అతి పెద్ద టెలికం తమ మార్కెట్ వాటాను నిలబెట్టుకునేందుకు జియోను ఢీ కొట్టేందుకు అలాగే తన మార్కెట్ ని పెంచుకోవాలని చూస్తోంది. ఈ విస్తరణలో భాగంగా మరో కీలక అడుగు వేయనున్నట్లు తెలుస్తోంది.
వాట్సప్‌పై హై అలర్ట్ , భారీగా వైరస్ ఫైల్స్ షేర్

టెలినార్ కు చెందిన భారత వాటాను
నార్వే ఆధారిత టెలికం సంస్థ టెలినార్ కు చెందిన భారత వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సుమారు 350 మిలియన్ డాలర్ల టెలినార్ వాటాను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

టెలినార్‌తో చర్చలు
ఇందుకోసం టెలినార్‌తో చర్చలు కూడా జరుపుతోంది. సంస్థలోని సగం వాటాను ప్రస్తుతం కొనుగోలు అనంతరం మిగిలిన సగభాగాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. జనవరి చివరికి నాటికి ఇరు సంస్థల మధ్య ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని నివేదికలు తెలుపున్నాయి.

దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు
టెలినార్కు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5.3 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. అయినా తీవ్ర నష్టాలను చవిచూస్తోంది. స్పెక్ట్రం వేలం చెల్లింపులకు సంబంధించి భారత ప్రభుత్వానికి టెలినార్ రూ .1900 కోట్లు, రుణాల రూపంలో బ్యాంకులకు మరో రూ .1800 కోట్లు బకాయి పడింది.

రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా
దీంతో ఈ రుణ భారంలో సగం చెల్లించడం ద్వారా దానిని సొంతం చేసుకోవాలని ఎయిర్టెల్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే టెలినార్ ప్రత్యర్థుల నుంచి తీవ్రంగా ఎదురవుతున్న పోటీ, డేటా స్పెక్ట్రం ఎక్కువగా లేకపోవడం, భారీ నష్టాల కారణంగా భారత్ మార్కెట్ నుంచి వైదొలగాలని భావిస్తోంది.

టెలినార్ ఇండియా ఐడియాతో చర్చలు
ఈ మేరకు గతనెలలో టెలినార్ ఇండియా ఐడియాతో చర్చలు జరిపింది. టెలినార్ మొత్తం 7 సర్కిల్స్ లో 4 జీ సేవలు అందిస్తుండగా ఆంధ్రప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర తదితర 6 సర్కిల్స్ లో 2 జీ సేవలు అందిస్తోంది. అసోంలో ఇంకా తన సేవల్ని ప్రారంభించాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








