Airtel ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు: తక్కువ ధరతో అధిక బెనిఫిట్స్....
ఇండియాలోని టెలికాం రంగంలో అగ్రస్థానంలో ఉన్న భారతి ఎయిర్‌టెల్ సంస్థ ప్రస్తుతం ఉన్న తన చందాదారుల కోసం మరియు కొత్తవారిని ఆకట్టుకోవడానికి ఆకర్షణీయమైన ధరలో 'ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్' అందిస్తున్నది. ఈ ప్లాన్ల యొక్క ధరలు అన్ని కూడా రూ.749 నుంచి రూ.1,599 దరల మధ్య ఉంటాయి.

ఈ ప్లాన్ల యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇవి అపరిమిత జాతీయ రోమింగ్ మరియు అపరిమిత జాతీయ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తాయి. ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో మీరు పొందే మరికొన్ని ఇతర ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఒక సంవత్సరానికి ఉచిత చందా, ZEE5 ప్రీమియం సభ్యత్వం మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సభ్యత్వం వంటివి ఉన్నాయి.

ఎయిర్‌టెల్ ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
ఎయిర్‌టెల్ తన ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ ఆఫర్ కింద అందించే ప్లాన్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి. ఎయిర్‌టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబంలోని అందరూ వ్యక్తిగతంగా ప్లాన్లను ఎంచుకోకుండా డబ్బును ఆదా చేయడంలో సహాయపడటం. ఈ ప్లాన్‌లను ఉపయోగిస్తున్న కుటుంబాలు మొబైల్ డేటాలో వారు చెల్లించే మొత్తంలో 20% వరకు ఆదా చేయగలవని ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ పేర్కొంది. ఇది పోస్ట్‌పెయిడ్ ప్లాన్ కానీ మొత్తం కుటుంబం కోసం అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ లోని వినియోగదారులందరికీ కేవలం ఒకే బిల్లుతో అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ.749 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్టెల్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ విభాగంలో తక్కువ ధరకు లభించే చౌకైన ప్లాన్ ఇది. ఈ ప్లాన్ యొక్క ప్రయోజనాల విషయానికి వస్తే ఇది స్టార్టర్స్ కోసం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్లాన్ ప్రతి కనెక్షన్ కోసం డేటా అలవెన్స్ 125GB. ఈ ప్లాన్ ద్వారా మొదటి వినియోగదారుడితో పాటు మరొక ఇద్దరు ద్వితీయ వినియోగదారులు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. దీని అర్థం మీరు మూడు కనెక్షన్ల కోసం 749 రూపాయలు చెల్లిస్తున్నారని అర్థం. రెండు యాడ్-ఆన్ కనెక్షన్లలో సాధారణ యాడ్-ఆన్ మరియు డేటా యాడ్-ఆన్ ఉన్నాయి అని గమనించండి. డేటా యాడ్-ఆన్ వినియోగదారులను మొదటి కనెక్షన్ నుండి డేటా ప్రయోజనాన్ని వినియోగించుకోవడానికి అనుమతిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.999 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఈ ప్లాన్ ద్వారా కుటుంబంలోని మరొక నలుగురు వ్యక్తులు అన్ని రకాల ప్రయోజాలను పొందుతారు. అంటే మొత్తంగా ఒకే కుటుంబంలో ఐదుగురు వ్యక్తులు ఈ ప్లాన్ ను ఉపయోగించవచ్చు. ఈ ప్లాన్ ద్వారా డేటా యొక్క మొత్తం ప్రయోజనం కూడా అధికంగా ఉంటుంది. ఐదు కనెక్షన్ల మీద ఉపయోగించగల మొత్తం డేటా 150GBగా ఉంది. మూడు రెగ్యులర్ యాడ్-ఆన్‌లు మరియు ఒక డేటా యాడ్-ఆన్‌తో సహా మొత్తం నాలుగు యాడ్-ఆన్‌లు ఈ ప్లాన్ ద్వారా ఇవ్వబడతాయి.

ఎయిర్‌టెల్ రూ.1599 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ రూ.1599 ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ అధిక ధరను కలిగి ఉంది ఇది కుటుంబంలోని ఎక్కువ మంది అధిక డేటా కోసం దీనిని ఉపయోగించుకోవచ్చని మీరు అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. రూ.1,599 ల ఎయిర్‌టెల్ ఫ్యామిలీ ప్లాన్‌ను కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉపయోగించుకోగలరు. ఇందులో గల ఇద్దరు ఉపయోగించడానికి అధిక మొత్తంలో డేటా ఉంటుంది. ఈ ప్లాన్ లో మరొక గొప్పదనం ఏమిటంటే వినియోగదారులో ఇద్దరికీ డేటా FUP పరిమితులు లేవు.

ఇందులో గల మొదటి మరియు రెండవ వినియోగదారుడు అపరిమిత డేటా మరియు అపరిమిత కాలింగ్ సదుపాయాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తుందని ఎయిర్‌టెల్ మార్కెటింగ్ చేస్తున్నప్పటికీ వాస్తవానికి ఇది నెలకు 500GB FUP చొప్పున ఉంటుంది.

ఇతర ప్రయోజనాలు
ఎయిర్‌టెల్ సంస్థ అందిస్తున్న ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ మూడు ప్లాన్‌లు అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం, Zee5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ మరియు ఎయిర్‌టెల్ థాంక్స్ మొబైల్ యాప్ ద్వారా రీడీమ్ చేయగల అనేక ఇతర ప్రయోజనాలను కూడా అదనంగా అందిస్తాయి.

ఎయిర్‌టెల్ స్మార్ట్‌బైట్‌ల అదనపు డేటా ప్రయోజనం
భారతి ఎయిర్‌టెల్ మీ FUP పరిమితిని చేరుకున్నట్లయితే మీరు యాడ్-ఆన్ డేటాను కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. మీరు కొనుగోలు చేయగల రెండు వేర్వేరు ప్యాక్ డేటా ఉన్నాయి. అందులో మొదటిది రూ.100 ధరను కలిగి ఉండి ఇది 15GB 3G/ 4G డేటాను అందిస్తుంది. రెండవ స్మార్ట్‌బైట్ ప్యాక్ రూ.200 ధరను కలిగి ఉండి 35GB అదనపు డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.


Click it and Unblock the Notifications








