Airtel కొత్త కస్టమర్లకు బంపర్ ఆఫర్!!! FRC ప్లాన్‌లతో ఉచితంగా డిస్నీ + హాట్స్టార్ VIP..
ఇండియాలోని టెలికామ్ సంస్థలలో ఒకటైన ఎయిర్‌టెల్ కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేకమైన మొదటి రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. మొదటి రీఛార్జ్ (FRC) ప్లాన్‌లు అనేవి కొత్త కస్టమర్లు తమ సిమ్‌లో మొదటిసారి రీఛార్జ్ చేసుకునేటప్పుడు మాత్రమే ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లకు టెల్కో మొత్తంగా ఐదు ప్లాన్లను అందిస్తున్నది. ఇటీవలే ఎయిర్టెల్ సంస్థ తన కొత్త మొదటి రీఛార్జ్ ప్లాన్‌లను ప్రకటించింది. ఇవి ఒక సంవత్సరం డిస్నీ + హాట్స్టార్ VIP ప్రయోజనంను ఉచితంగా అందిస్తాయి. వీటి గురించి మరిన్ని వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ మొదటి రీఛార్జ్ ప్లాన్‌లు
ఎయిర్‌టెల్ అందిస్తున్న మొదటి రీఛార్జ్ (FRC) ప్లాన్‌లు 197 రూపాయల చౌకైన ధరతో ప్రారంభం అవుతున్నాయి. ఇది తక్కువ ధర వద్ద ఉన్నందున ఇది తక్కువ ప్రయోజనాలు మరియు తక్కువ చెల్లుబాటుతో లభిస్తుంది. రూ.197 ప్లాన్ 28 రోజుల చెల్లుబాటుతో అన్ని రకాల ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో పాటు 2GB డేటా మరియు మొత్తంగా 300SMS ప్రయోజనాలు అందిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.297 FRC ప్లాన్ పూర్తి వివరాలు
ఎయిర్‌టెల్ మొదటి రీఛార్జ్ ప్లాన్‌లలో రెండవ ప్లాన్ యొక్క ధర 297రూపాయలు. ఈ ప్లాన్ కూడా 28 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. కానీ ఇది వినియోగదారులకు రోజుకు 100 SMS లతో పాటు 1.5GB రోజువారీ డేటాను అందిస్తుంది. కస్టమర్ ఈ ప్లాన్‌తో దేశంలోని అన్ని రకాల నెట్‌వర్క్‌లకు అపరిమిత కాలింగ్ ప్రయోజనంను కూడా పొందుతాడు.

ఎయిర్‌టెల్ రూ.497 FRC ప్లాన్ పూర్తి వివరాలు
ఎయిర్‌టెల్ FRC ప్లాన్‌లలో లభిస్తున్న మూడవ ప్లాన్ యొక్క ధర 497రూపాయలు . ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటు కాలంతో వస్తుంది. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS లు మరియు 1.5GB రోజువారీ డేటా ప్రయోజనాలను ఈ ప్లాన్ అందిస్తుంది. ఇది రూ.297 FRC ప్లాన్ మాదిరిగానే అన్ని రకాల ప్రయోజనాలతో వస్తుంది కాని ఖచ్చితమైన డబుల్ వాలిడిటీని కలిగి ఉంది.

ఎయిర్‌టెల్ రూ.499 FRC ప్లాన్ పూర్తి వివరాలు
ఎయిర్‌టెల్ FRC ప్లాన్‌లలో అందిస్తున్న చివరి రెండు ప్లాన్ల యొక్క ధరలు వరుసగా రూ.499 మరియు రూ.647. ఇందులో రూ.499 ప్లాన్ పైన పేర్కొన్న విధంగా ఎయిర్‌టెల్ అందించే ఆఫర్లలో కొంత అదనంగా ఉంది. ఇది ఒక సంవత్సరం పాటు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను ఉచితంగా అందించే ఏకైక ఎఫ్‌ఆర్‌సి ప్లాన్ ఇది. కానీ దీని యొక్క చెల్లుబాటు 28 రోజులు మాత్రమే. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్‌తో పాటు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.647 FRC ప్లాన్ పూర్తి వివరాలు
ఎయిర్‌టెల్ FRC ప్లాన్ కేటగిరీ కింద అందించే అత్యంత ఖరీదైన ప్లాన్ రూ.647 FRC ప్లాన్. పైన పేర్కొన్న అన్ని ప్లాన్‌లతో పోలిస్తే ఇది అధిక వాలిడిటీని కలిగి ఉంది. ఈ ప్లాన్ మొత్తంగా 84 రోజుల చెల్లుబాటును కలిగి ఉంటుంది. ఈ ప్లాన్ అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో పాటుగా వినియోగదారులకు 1.5GB రోజువారీ డేటా మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. ఎక్కువ కాలం చెల్లుబాటును కోరుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది.


Click it and Unblock the Notifications