1GB కి 100 రూపాయలు? Airtel రీఛార్జి ప్లాన్లు భారీ గా పెరిగే అవకాశం!   

By Maheswara
|

భారతి ఎయిర్‌టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఎయిర్టెల్ చందాదారులు 'ఎక్కువ ధరలు చెల్లించడానికి సిద్ధం కావాలని' కోరారు, త్వరలోనే రీఛార్జి ప్లాన్లలో పెంపు రాబోతోందని సూచించారు. మీరు ఇప్పుడు నెలకు ₹ 45 చెల్లిస్తే, మీ బిల్లు త్వరలో నెలకు రెట్టింపు కంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది.

సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ

సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ

సునీల్ భారతి మిట్టల్ మాట్లాడుతూ "మీరు నెలకు రూ.160 కి  1.6GB సామర్థ్యాన్ని వినియోగిస్తారో  లేదా మీరు ఎక్కువ ధర చెల్లించడానికి సిద్ధంఅవుతారో ఎంచుకోవలసిన సమయం వస్తుంది.మేము యుఎస్ లేదా యూరప్ లాగా 50-60 డాలర్లు ధరలు కోరుకోవడం లేదు, కాని ఖచ్చితంగా నెలకు 16 జిబికి 2 డాలర్లు ధర అంటే టెలికాం సంస్థలు నెట్టుకు రావడ కష్టమనే చెప్పాలి"అని ఒక కార్యక్రమం లో వివరించారు.

దాదాపు 100 శాతం ఎక్కువ.

దాదాపు 100 శాతం ఎక్కువ.

16 జిబి డేటాను ₹ 160 ధర కు ఇవ్వడం విషాదంగా మిట్టల్ ప్రస్తావించారు, వినియోగదారులు ఈ ధర వద్ద 1.6 జిబి డేటాను పొందాలంటే ఎక్కువ ధర చెల్లించాలని అభిప్రాయపడ్డారు.అంటే ప్రస్తుతం ఉన్న 1GB డేటా ధర రూ.10 కి బదులు, 1GB డేటా ధర రూ.100 గా అర్థం.అంటే 1GB డేటా పొందాలంటే 100 రూపాయలు చెల్లించాలి.ఇప్పుడున్న ధరలకంటే ఈ ధరలు దాదాపు 100 శాతం ఎక్కువ.

Also Read:Jio నుండి రెండు కొత్త ప్లాన్లు.వీటితో సంవత్సరం పాటు Disney+ Hotstar VIP ఉచితం!Also Read:Jio నుండి రెండు కొత్త ప్లాన్లు.వీటితో సంవత్సరం పాటు Disney+ Hotstar VIP ఉచితం!

మిట్టల్ వ్యాఖ్యల ప్రకారం

మిట్టల్ వ్యాఖ్యల ప్రకారం

మిట్టల్ చేసిన ఈ వ్యాఖ్యలు ను సునిశితంగా పరిశీలిస్తే, త్వరలో నే ఎయిర్టెల్ నుండి రీఛార్జి ధరలలో భారీ పెంపు రాబోతోంది అని గమనించవచ్చు. ప్రస్తుతం, ఎయిర్‌టెల్ రోజుకు 1GB 24 రోజులకు ప్లాన్ కు నెలకు ₹ 199 ధర చొప్పున అందిస్తుంది. మిట్టల్ వ్యాఖ్యల ప్రకారం అయితే , ఈ డేటా ప్రయోజనాలను పది రెట్లు తగ్గించవచ్చు, అంటే నెలకు కేవలం 2.4GB కి తగ్గించవచ్చు.

సాధారణ ఎయిర్‌టెల్ చందాదారులు

సాధారణ ఎయిర్‌టెల్ చందాదారులు

ఇక సాధారణ ఎయిర్‌టెల్ చందాదారులు నెలకు కనీసం ₹ 100 చెల్లించాల్సి ఉంటుందని  ప్రస్తుతం, బేస్ ఎయిర్టెల్ ప్లాన్ నెలకు ₹ 45 తో మొదలువుతుందని రిపోర్టులు వివరించారు. కాబట్టి మిట్టల్ అంచనాల ప్రకారం 100% కంటే ఎక్కువ పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU)

వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU)

టెలికాం పరిశ్రమ నిలకడగా ఉండాలంటే వినియోగదారుకు సగటు ఆదాయం (ARPU) ₹ 300 అవసరమని మిట్టల్ అన్నారు.పరిశ్రమ స్థిరంగా ఉండటానికి రాబోయే 5-6 నెలలో స్థిరమైన ARPU లు నిర్మించడాన్ని మీరు చూస్తారని" అని ఆయన అన్నారు.ధరల పెంపు ఖచ్చితంగా ఉంటుందని పునరుద్ఘాటిస్తూ, " రాబోవు ఆరు నెలల కాలంలో మేము ఖచ్చితంగా రూ .200 మార్కును దాటాలి మరియు 250 రూపాయలు ఇంకా అనువైనవి."గా పేర్కొన్నారు.

Disney+ Hotstar VIP చందాను ఉచితంగా

Disney+ Hotstar VIP చందాను ఉచితంగా

ఇక ఇటీవల కాలం లో ఎయిర్టెల్ నుండి వచ్చిన మంచి ఆఫర్లను ప్రస్తావించుకుంటే,వాటిలో మొదటగా చెప్పుకోవాల్సింది Disney+ Hotstar VIP చందాను ఉచితంగా అందిస్తున్న Airtel ప్లాన్‌లు. భారతి ఎయిర్‌టెల్ మరియు రిలయన్స్ జియో సంస్థలు డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను కొన్ని ప్లాన్ లతో అందిస్తున్నాయి. వాటిలో ఎయిర్టెల్ నుంచి రూ.448 మరియు రూ.599 ధర వద్ద గల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లతో డిస్నీ + హాట్‌స్టార్ VIP చందాను అందిస్తున్నది.డిస్నీ + హాట్‌స్టార్ విఐపి చందాను అందించే ఎయిర్‌టెల్ యొక్క లాంగ్ టర్మ్ ప్లాన్ కూడా ఉంది  ఇది రూ.2,698 ప్రీపెయిడ్ ప్లాన్. ఇది 365 రోజుల చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Airtel Plans To Increase Data Prices: Check Details Here 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X