ఎయిర్‌టెల్ మరో సంచలనం..

Written By:

జియోకి షాక్ ఇచ్చేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయింది. టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ ఈ రోజు ఇంటర్నెట్ టివిని ఇండియాలో లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ ఆండ్రాయిడ్ టివి గా వాడుకొవచ్చని డిటీహెచ్ బిజినెస్ ఆప్ ఎయిర్‌టెల్ తెలిపింది. దీని ద్వారా కష్టమర్లు ఆన్ లైన్ కంటెంట్ మీ టీవీ స్క్రీన్లలో చూడొచ్చు. దాదాపు 500 టీవీ ఛానళ్లను మీరు వీక్షించవచ్చు.

మూడు నెలల పాటు 1 జిబి డేటా ఉచితం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాయిస్ రికాగ్నైజేషన్ సపోర్ట్

ఈ ఇంటర్నెట్ టీవీ వాయిస్ రికాగ్నైజేషన్ సపోర్ట్ తో వస్తోంది. ఉదాహరణకు మీరు సోని సిక్స్ ఛానల్ కావాలని చెబితే ఆటోమేటిగ్గా అక్కడికి వెళ్లిపోతుంది. ఇందులో నెట్ ఫ్లిక్, యూట్యూబ్, గూగుల్ ప్లే మ్యూజక్, గూగుల్ ప్లే గేమ్స్, ఎయిర్‌టెల్ మూవీస్ అన్ని ఫ్రీగా లోడ్ అయి ఉన్నాయి.

మూడు నెలల డిజిటల్ టివి సబ్ స్క్రిప్షన్

మూడు నెలల డిజిటల్ టివి సబ్ స్క్రిప్షన్ తో మీరు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టివిని పొందాలంటే రూ. 4999 చెల్లించాల్సి ఉంటుంది.

రూ. 7999 చెల్లించడం ద్వారా

అలాగే రూ. 7999 చెల్లించడం ద్వారా ఏడాది పాటు ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టీవీ కనెక్షన్ పొందవచ్చు.

అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా

ఎయిర్‌టెల్ ఇంటర్నెట్ టివి సెట్ టాప్ బాక్స్ ఈ కామర్స్ సైట్ అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా లభిస్తోంది.

25 జిబి అడిషనల్ డేటా

దీంతో పాటు ఎయిర్‌టెల్ కష్టమర్లు మై హోమ్ లో లాగిన్ అయి మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా 25 జిబి అడిషనల్ డేటాను పొందవచ్చు ఇది బ్రాడ్ బాండ్ యూజర్లకు మాత్రమే.

మిస్ డ్ కాల్ ఇవ్వడం ద్వారా

పాత ఎయిర్ టెల్ కష్టమర్లు 8800488001 ఈ నంబర్ కు మిస్ డ్ కాల్ ఇవ్వడం ద్వారా కాని లేకుంటే www.airtel.in/internettv ద్వారా ఆఫర్ వివరాలు పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel internet tv launched in in india read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot