Home
News

ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా యూజర్లకు శుభవార్త.. త్వరలో కొత్త కాలర్ ఐడీ ఫీచర్ విడుదల

Spam Calls - Name Display: మన దేశంలోని ప్రముఖ ప్రైవేట్ టెలికాం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్ (Airtel), రిలయన్స్ జియో (Jio), వొడాఫోన్ ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతున్నాయి. అదే కాలర్ నేమ్ ప్రజెంటేషన్ (CNAP). సింపుల్‌గా చెప్పాలంటే, ఇకపై మీకు ఎవరైనా కాల్ చేస్తే, వారి పేరు మీ ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

దీనికోసం ట్రూకాలర్ (Truecaller) లాంటి బయటి యాప్స్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయడానికి అవసరమైన సర్వర్లు, సాఫ్ట్‌వేర్ కోసం HP, డెల్, ఎరిక్‌సన్, నోకియా వంటి పెద్ద టెక్ కంపెనీలతో ఈ టెల్కోలు చేతులు కలిపినట్లు 'లైవ్ మింట్' కథనం ద్వారా తెలిసింది.

Airtel  Jio  Vi to Launch CNAP Caller ID in India Soon  Aiming to Curb Spam Calls

CNAP (సీ-న్యాప్) అంటే 'కాలర్ నేమ్ ప్రజెంటేషన్'. ఇది కాల్ చేస్తున్న వారి గుర్తింపును మరింత మెరుగ్గా తెలియజేసే ఒక సేవ. దీని ప్రత్యేకత ఏంటంటే, ట్రూకాలర్ లాంటి యాప్స్ లాగా ఎవరో యూజర్లు ఇచ్చిన సమాచారం (క్రౌడ్ సోర్స్డ్ డేటా) మీద ఆధారపడదు,

అందుకు బదులుగా కాల్ చేస్తున్న వ్యక్తి సిమ్ తీసుకునేటప్పుడు ఇచ్చిన కేవైసీ (Know Your Customer) డాక్యుమెంట్లలో అధికారికంగా నమోదైన పేరును ఇది చూపిస్తుంది. అంటే, దాదాపుగా సరైన పేరు కనిపించే అవకాశం ఎక్కువ. దీనివల్ల అవతలి వ్యక్తి ఎవరు అనేది మనకి కచ్చితంగా, చాలా సులభంగా తెలిసిపోతుంది.

* స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టడమే లక్ష్యం..

మనకు తెలీని నంబర్ల నుంచి వచ్చే స్పామ్, మోసపూరిత కాల్స్ బెడద ఎక్కువైపోయింది. వాటికి అడ్డుకట్ట వేయడం, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించడమే ఈ CNAP ముఖ్య ఉద్దేశ్యం. నిజానికి, ఈ ఫీచర్‌ను తీసుకురావాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) మొదటిసారిగా 2024 ఫిబ్రవరిలోనే సిఫార్సు చేసింది.

ఇప్పుడు, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) కూడా ఈ CNAP సేవను వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని టెలికాం కంపెనీలపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కాల్ చేస్తున్న వారి పేరు ముందే తెలిస్తే, అనవసరమైన లేదా మోసపూరిత కాల్స్‌ను గుర్తించడం తేలికవుతుంది. ఈ ఫీచర్ దశలవారీగా అందుబాటులోకి రానుంది.

* అమలులో కొన్ని సవాళ్లు.. 2G యూజర్లకు నిరాశే?

అయితే, ఈ ఫీచర్ అమలులో కొన్ని చిక్కులున్నాయి. ముఖ్యంగా, పాత 2G నెట్‌వర్క్‌లలో సాంకేతిక కారణాల వల్ల ఈ CNAP పనిచేయదని టెలికాం సంస్థలు గతంలోనే చెప్పాయి. అంటే, 2G ఫోన్లు వాడేవారికి ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. ట్రాయ్ 2022లోనే దీన్ని తప్పనిసరి చేయాలని, ఫోన్ల తయారీ కంపెనీలు కూడా దీన్ని సపోర్ట్ చేయాలని సూచించింది.

Take a Poll

ఇది స్పామ్ కాల్స్ తగ్గించినా, కొంతమంది తమ పేరు అందరికీ కనిపించడం వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు భంగం కలిగిస్తుందని భావించవచ్చు. అలాగే, కొందరు యూజర్లు తమ పేరు డిస్‌ప్లే అవ్వడానికి ఇష్టపడకపోవచ్చు అనే వాదనలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా దీన్ని తీసుకురావడం వల్ల లాభాలే ఎక్కువ.

* AIతో స్పామ్ కాల్స్‌కు చెక్..

CNAPతో పాటు, స్పామ్ కాల్స్‌ను ఆపడానికి మరిన్ని చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఈ మధ్య విదేశీ నంబర్ల నుంచి స్కామ్ కాల్స్ ఎక్కువవడంతో, మన దేశం కోడ్ (+91)తో మొదలవ్వని నంబర్లను 'అంతర్జాతీయ కాల్స్' గా గుర్తించి చూపించాలని DoT టెలికాం సంస్థలను ఆదేశించింది. ఎయిర్‌టెల్ ఇప్పటికే ఈ ఫీచర్‌ను అమలు చేస్తోంది.

ఇంకా, స్పామ్ కాల్స్, SMSల బెడదను తగ్గించడానికి ఎయిర్‌టెల్, BSNL, వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు ఇప్పటికే AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ ఆధారిత వ్యవస్థలను తమ నెట్‌వర్క్‌లలో ఉపయోగిస్తున్నాయి. దీనివల్ల కస్టమర్లు మోసాల బారిన పడకుండా రక్షణ కల్పిస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel, Jio, Vi to roll out CNAP caller name display in India, showing KYC names. New TRAI/DoT mandated feature aims to curb spam calls, offering Truecaller alternative.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X