ఎయిర్‌టెల్ దుమ్మురేపింది: ప్రపంచమంతా ఫ్రీ కాల్స్,ఒకే నంబర్

By Hazarath
|

జియో పుణ్యామాని మార్కెట్లో ఆఫర్ల సెగ రేగుతోంది.ఇప్పటికే అన్ని టెల్కోలు పోటీలు పడి మరీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.ఈ వరుసలోనే ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. మొన్నటిదాకా నేషనల్ వైపు ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆఫర్లను ప్రకటించింది. ప్రపంచం మొత్తం మీద ఎక్కడినుంచైనా ఇన్ కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. ఆఫర్ వివరాలేంటో మీరే చూడండి.

జియోకి నోకియా సవాల్ : 5జీ కోసం ఆటో,టెలి దిగ్గజాలతో జట్టు

అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్

అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్

ఎయిర్‌టెల్ నుంచి ఇప్పుడు దుమ్మురేపే ఆఫర్ బయటకొచ్చింది. అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ ను వినియోగదారుల ముందుకు ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద అంతర్జాతీయంగా అన్నీ ఇన్‌కమింగ్ కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు.

భారత దేశ మొబైల్ నెంబర్‌ను

భారత దేశ మొబైల్ నెంబర్‌ను

భారత దేశ మొబైల్ నెంబర్‌ను ఏ దేశంలోనైనా వాడుకునే విధంగా వినియోగదారులకు ఎయిర్‌టెల్ అవకాశం కల్పించనుంది. 24 గంటల్లో ఏ సమయంలోనైనా వినియోగదారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్

ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్

అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్స్ ఆఫర్ కింద ఉచిత ఇన్‌కమింగ్ కాల్స్, అలాగే విదేశాల నుంచి ఇండియాకు ఉచితంగా మెసేజ్‌లు చేసుకోవడం, అన్ని ప్రముఖ ప్రదేశాల నుంచి ఇండియాకు ఉచితంగా కాల్స్ చేసుకోవడంతో పాటు డేటాతో కూడిన ప్రయోజనాలు కూడా అందించనున్నట్టు కంపెనీ వెల్లడించింది.

30 రోజుల కాలం వరకు

30 రోజుల కాలం వరకు

ఈ ఆఫర్‌ని ఒక్క రోజు నుంచి 30 రోజుల కాలం వరకు వినియోగించుకోవచ్చు. కష్టమర్లు ఎక్కువ కాల్ చార్జీ, డేటా చార్జీలపైన ఆందోళన చెందాల్సినవసరం లేదని పేర్కొంది. ఈ ప్యాక్, పోస్ట్ పెయిడ్, ఫ్రీపెయిడ్ వినియోగదారులందరికీ వర్తించనుంది.

ఒక్క రోజు విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్న వారు

ఒక్క రోజు విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్న వారు

ఒక్క రోజు విదేశీ ప్రయాణాలు చేయదలుచుకున్న వారు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోదలుచుకుంటే వన్-డే కింద 10 డాలర్లను(రూ.649), నెలవారీ వినియోగం కోసం 30 రోజుల ప్యాక్ కింద 75 డాలర్లు(రూ.4,999)ను కస్టమర్లు చెల్లించాల్సి ఉంటుంది.

30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 3జీబీ డేటా

30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 3జీబీ డేటా

ఈ కాస్ట్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో కూడిన 3జీబీ డేటా, అపరిమితమైన ఇన్‌కమింగ్ కాల్స్, ఇండియాకు కాల్స్ చేసుకోవడానికి 400 ఉచిత నిమిషాలు, ఇండియాకు అపరిమితమైన మెసేజ్‌లు చేసుకోవడం వంటివి కంపెనీ ఆఫర్ చేయనుంది.

10 రోజుల కాల పరిమితి కోసం

10 రోజుల కాల పరిమితి కోసం

10 రోజుల కాల పరిమితి కోసం 45 డాలర్లతో మీడియం వ్యవధి ప్యాక్‌ను వచ్చే నెల మధ్యలో లాంచ్ చేయాలని కంపెనీ ప్రణాళికలు రచిస్తోంది. అన్ని ప్రముఖ ప్రదేశాల్లో ఇండియాకు చేసుకునే కాల్స్ చార్జీలు తక్కువ కానున్నాయని ఎయిర్‌టెల్ పేర్కొంది.

విదేశీ రోమింగ్ డేటా కింద ఒక్క ఎంబీని రూ.3లకే

విదేశీ రోమింగ్ డేటా కింద ఒక్క ఎంబీని రూ.3లకే

విదేశీ రోమింగ్ డేటా కింద ఒక్క ఎంబీని రూ.3లకే అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపు 99 శాతమని, అంతకముందు ఒక్క ఎంబీకి 650 చార్జ్ చేసేవాళ్లమని ఎయిర్‌టెల్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Airtel Launches New International Roaming Packs; Offers Free Incoming Calls read more telugu gizbot

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X