జియోకి నోకియా సవాల్ : 5జీ కోసం ఆటో,టెలి దిగ్గజాలతో జట్టు

Written By:

ఉచిత ఆఫర్లతో మార్కెట్లో రిలయన్స్ జియో ప్రకంపనలు రేకెత్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దిగ్గజ టెల్కోలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రిలయన్స్ జియోకి ఇప్పుడు అదేస్థాయిలో షాక్ ఇచ్చేందుకు ఆటో,టెలీ దిగ్గజాలు ఏకమయ్యాయి. ఏకంగా 4జీని సవాల్ చేయడానికి 5జీతో ముందుకు దూసుకువస్తున్నాయి. నోకియా,ఇంటెల్ లాంటి దిగ్గజ సంస్థలు ఆడీ ,బీఎమ్ డబ్ల్యూ కంపెనీలతో జత కట్టాయి. సంచలనం రేపుతున్న స్టోరీ మీకోసం.

3జీ ఫోన్లు డెడ్..షాకవుతున్నయూజర్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

4జీ సునామితో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తాన్ని

3జీ ఫోన్లతో వచ్చిన పెను విప్లవాన్ని 4జీ సర్వీసులంటూ రిలయన్స్ జియో తొక్కేసింది. తన 4జీ సునామితో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మొత్తాన్ని తన హస్తగతం చేసుకుంది. అందరూ ఇప్పడు జియో అంటూ కలవరిస్తున్నారంటే ఎంతలా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

4జీని సవాల్ చేయడానికి 5జీ రంగ ప్రవేశం

అయితే ఇప్పుడు అదే 4జీని సవాల్ చేయడానికి 5జీ రంగ ప్రవేశం చేస్తోంది. రానున్న కాలమంతా 5జీదేనని ముందే గ్రహించిన దిగ్గజాలు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెట్టాయి. ఇందులో భాగంగా ఆటో ,టెలి దిగ్గజాలు ఏకమయ్యాయి.

5జీ సేవలపై ముందస్తుగా

వచ్చే కాలంలో మొబైల్ కమ్యూనికేషన్లో ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెల్లాయించనున్న 5జీ సేవలపై ముందస్తుగా ఇటు టెలికమ్యూనికేషన్ దిగ్గజాలు, నోకియా ,ఇంటెల్,క్వాల్‌కామ్ అటు ఆటోమోటివ్ కంపెనీలు ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, డైమ్లర్ ఇండస్ట్రీస్ చేతులు కలిపాయి.

ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ,ఇంటెల్, నోకియా,

ఆటో దిగ్గజాలైన ఆడీ, బీఎమ్‌డబ్ల్యూ, డైమ్లర్, ఎరిసన్, హ్యువాయ్, ఇంటెల్, నోకియా, క్వాల్‌కామ్ సంస్థలు ఒకటిగా ఏర్పడి '5జీ ఆటోమోటివ్ అసోసియేషన్'ను ఏర్పాటుచేసుకున్నాయి.

మార్కెట్‌కు సవాలుగా నిలువనున్న 5జీ సేవలు

వచ్చే దశాబ్దంలో మార్కెట్‌కు సవాలుగా నిలువనున్న 5జీ సేవలు డిజిటలైజేషన్‌కు, స్వయంచోధక డ్రైవింగ్‌కు ఉపయోగపడేలా ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ఇందులో భాగంగా ముందుగా 5జీ సేవలను కార్లపై ప్రయోగించనున్నారు.

టెక్నికల్, రెగ్యులేటరీ సమస్యలను

టెక్నికల్, రెగ్యులేటరీ సమస్యలను ఈ అసోసియేషన్ గుర్తిస్తూ, తదుపరి తరం మొబైల్ నెట్‌వర్క్స్ కనెక్షన్, రహదారి భద్రతా కొరకు సమాచార పరిష్కారాలను ఈ అసోసియేషన్ అభివృద్ధి చేయనుంది.

సాంకేతిక అవసరాలు, అమలు చేసే వ్యూహాలపై

సాంకేతిక అవసరాలు, అమలు చేసే వ్యూహాలపై ఈ అసోసియేషన్ పనిచేయనుంది. ప్రతి వాహనానికి అవసరమయ్యే వైర్‌లెస్ కనెక్టివిటీ, సెక్యురిటీ, భద్రత, క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ వంటి సాంకేతిక అవసరాలను ఈ అసోసియేషన్ గుర్తించనుంది.

5GAA పై అన్ని కంపెనీలు

ఇప్పటికే ఈ 5జీ నెట్ వర్క్ 5GAA పై అన్ని కంపెనీలు తమ సంసిద్ధతను కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అసోసియేషన్ లో జాయిన్ అయ్యేందుకు కసరత్తు చేస్తున్నాయి.

కార్లమీద ఈ ప్రయోగం విజయవంతమయితే

కార్లమీద ఈ ప్రయోగం విజయవంతమయితే అది మొబైల్స్ కు కూడా విస్తరించే అవకాశం లేకపోలేదు. అదే కనుక జరిగితే 4జీకి కాలం చెల్లి కష్టమర్లు 5జీ అంటూ పరుగులు పెట్టడం ఖాయం.

మెంబర్స్

ఆడికి చెందిన క్రిస్టోప్ వోగ్ట్ ఈ అసోసియేషన్ కు ఛైర్ పర్సన్ గా , క్వాల్ కామ్ కు చెందిన డినో ఫ్లోర్ ఈ అసోసియేషన్‌కు డైరక్టర్ గా జనరల్ గా వ్యవహరించనున్నారు. 

ఈ అసోసియేషన్ లో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా

ఈ అసోసియేషన్ లో ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సభ్యులు కావచ్చని యూరోపియన్ కనెక్టెడ్ ఆటోమోటివ్ డ్రైవింగ్ ప్రీ విసర్తణ ప్రాజక్ట్ మీద కలిసి పనిచేద్దామని అసోసియేషన్ పిలుపునిచ్చింది.

క్రిస్టోప్ గ్రోట్ మాట్లాడుతూ

బిఎండబ్ల్యూ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోప్ గ్రోట్ మాట్లాడుతూ 5జీ ఛాలంజ్ తో కూడుకున్నదని స్వయం ప్రతిపత్తి డ్రైవింగ్ అనేది చాలా సవాళ్లతో కూడుకున్నదని అయినా డిజిటలైజేషన్ శకం దిశగా అడుగులు వేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.

రానున్నకాలమంతా 5జీ యుగమేనని

రానున్నకాలమంతా 5జీ యుగమేనని 4జీ ఫోన్లకు కూడా కాలం చెల్లిపోనుందని 5జీ రాకతో సరికొత్త డిజిటలైజేషన్ వస్తుందని మొబైల్స్ రంగంలో సరికొత్త విప్లవం మొదలవుతుందని ఈ సంస్థ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇప్పటికే 3జీ సేవలను తొక్కేసిన రిలయన్స్

ఇప్పటికే 3జీ సేవలను తొక్కేసిన రిలయన్స్ సంస్థ జియో 4జీని ఈ 5జీ గ్రూపు ముందు ముందు ఎలాంటి పరిస్థితులకు తీసుకెళుతుందనే విషయం టెక్ విశ్లేషకులనే కాకుండా అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Telcos and car giants form 5G pact for connected cars read more telugu gizbot
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot