ఇదే..షియోమిని రికార్డుల వైపు నడిపిస్తోంది

Written By:

చైనా దిగ్గజం షియోమి భారత్‌లో స్మార్ట్‌‌ఫోన్‌ అమ్మకాల్లో రికార్డుల వైపు దూసుకుపోతోంది. ప్రతి నాలుగు సెకండ్లకు అయిదు రెడ్ మీ ఫోన్లు అమ్ముడుపోతున్నాయని ఇప్పటికే సగర్వంగా ప్రకటించిన షియోమి స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ ను దున్నేస్తోంది.

షియోమికి దిమ్మతిరిగేలా మోటో కొత్త ఫోన్లు !

ఇదే..షియోమిని రికార్డుల వైపు నడిపిస్తోంది

ఈ కంపెనీ నుంచి వచ్చిన రెడ్‌మి 3ఎస్ కంపెనీని టాప్ లో నిలబెడుతోంది. కేవలం తొమ్మిదినెలల్లో ​ 40లక్షల రెడ్‌ మి 3ఎస్‌ స్మార్ట్‌ఫోన్లను విక్రయించినట్టు కంపెనీ సగర్వంగా తెలిపింది. దీంతో ఆన్‌లైన్‌ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. మరి అంతలా రికార్డులు సృష్టించడానికి ఈ ఫోన్ లో ఏముంది. ఓ స్మార్ట్ లుక్కేయండి.

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లు !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిస్‌ప్లే

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే తో పాటు 1280 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ తో ఫోన్ వచ్చింది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌, అడ్రినో 505 గ్రాఫిక్స్, HDR mode, 1080p వీడియో రికార్డింగ్ వంటివి ఫోన్‌కు మరింత బలానిస్తున్నాయి.

2/3 జీబీ ర్యామ్‌

2/3 జీబీ ర్యామ్‌తో రెడ్‌మి 3ఎస్ వచ్చింది. ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్విషయానికొస్తే 16/32 జీబీ వరకు ఉంటుంది. మైక్రో ఎస్టీ ద్వారా 128 జీబీ వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా

13 మెగాపిక్స‌ల్ రియ‌ర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, పీడీఏఎఫ్, ఎల్ఈడి ఫ్లాష్, f/2.0 aperture వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలో ఉన్నాయి.

4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ ఫోన్‌లో 4,100 ఎమ్ఏహెచ్ సామర్థ్యం గల శక్తివంతమైన మాసివ్ బ్యాటరీ వ్యవస్థను ఏర్పాటు చేసారు.

అదనపు ఫీచర్లు

ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ ఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, బరువు 144 గ్రాములు, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మలో, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్ వంటివి అదనపు ఫీచర్లు.

ధర

మార్కెట్లో రెడ్‌మి 3ఎస్ ధర రూ. 6,999గా ఉంది. డార్క్ గ్రే, సిల్వర్, గోల్డ్ కలర్స్‌లో లభ్యమవుతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Xiaomi sells 4 mn Redmi 3S handsets in just 9 months read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot