2 రోజుల్లో ఎయిర్‌టెల్ దుమ్మురేపింది

Written By:

టెలికం రంగలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు రంగంలోనూ దుమ్మురేపుతోంది. ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకును స్థాపించిన రెండు రోజుల్లోనే 10వేల ఖాతాలకు పైగానే నమోదు చేసింది. దేశంలోనే మొట్టమొదటి పేమెంట్ బ్యాంకు అయిన ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కళ్లు చెదిరేలా తన ఆరంభాన్ని ప్రారంభించింది.

కొత్త న్యూస్: మరో ఏడాదిపాటు జియో ఉచితం !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కేవలం రాజస్థాన్ లో

ఎయిర్‌టెల్ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టుతో కేవలం రెండు రోజుల్లోనే 10 వేల ఖాతాలకు పైగా నమోదు చేసింది. ఇది కేవలం రాజస్థాన్ లో మాత్రమే.

ప్రతి సేవింగ్స్ పై 7.25 శాతం వడ్డీ

మీరు చేసే ప్రతి సేవింగ్స్ పై 7.25 శాతం వడ్డీతో ప్రయోగాత్మకంగా చెల్లింపుల ఖాతాను ఎయిర్‌టెల్ ప్రారంభించిన విషయం తెలిసిందే

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లక్ష రూపాయల బీమా

ఈ ఖాతాలపై అధిక వడ్డీని చెల్లించడంతో పాటు, లక్ష రూపాయల బీమాను కూడా ఎయిర్‌టెల్ అందిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలను కూడా అందించనున్నట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో శశి అరోరా తెలిపారు.

గరిష్ట పరిమితి లక్ష రూపాయలు

మరోవైపు ఆర్బీఐ ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకులో వ్యక్తిగత ఖాతాదారుల గరిష్ట పరిమితిని లక్ష రూపాయలుగా నిర్ణయించింది.

రెండు రోజుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల వారికి

అయితే ఈ బ్యాంకు రెండు రోజుల్లో పట్టణ గ్రామీణ ప్రాంతాల వారికి చేరువ కావడం దిగ్గజాలనే ఆశ్చర్యపరుస్తోంది. రానున్న రోజుల్లో ఇది ఇంకా ఎటువంటి సంచలనాలు నమోదు చేస్తోందోనని టెక్ విశ్లేషకులు ఇప్పటినుంచి తమ విశ్లేషణకు పదునుపెట్టారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Airtel Payments Bank opens 10000 savings accounts in 2 days Read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting