కొత్త న్యూస్: మరో మూడు నెలలపాటు జియో ఉచితం !

Written By:

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన జియో మరిన్ని షాకులతో ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు అన్న ముఖేష్ అంబాని జియోతో టెల్కోలకు చుక్కలు చూపిస్తుంటే మరోవైపు తమ్ముడు అనిల్ అంబాని సంచలన ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఎవరికి వారు సంచలన ఆఫర్లతో కష్టమర్లను ఇట్టే కట్టి పడేస్తున్నారు. ఇప్పుడు అదే ఊపులో జియో నుంచి మరో సంచలనపు వార్త రానుంది. జియోను మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దుమ్ము రేపుతున్న మోడీ గేమింగ్ యాప్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫర్లను మరింతకాలం పాటు

తన ఉచిత ఆఫర్లతో భారత టెలికం రంగంలో పెను తుపానునే కలిగించిన రిలయన్స్ జియో, ఆఫర్లను మరింతకాలం పాటు అందించాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం జియోను మరో ఏడాదిపాటు పొడిగిస్తారని వార్తలు వస్తున్నాయి.

మరో ఏడాది వరకు కాకపోయినా

అయితే ఇది మరో ఏడాది వరకు కాకపోయినా కనీసం మరో మూడు నెలలు మాత్రం ఖచ్చితంగా పొడిగిస్తారని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మార్చి 2017 వరకూ

తొలుత డిసెంబర్ 31 వరకూ ఉచిత డేటా, వాయిస్, వీడియో కాల్స్ అందించాలని నిర్ణయించిన జియో, ఇప్పుడా ఆఫర్ ను మార్చి 2017 వరకూ అందించాలనే అధికారిక ప్రకటన డిసెంబర్ 28 న రానున్నట్టు తెలుస్తోంది.

అనుకున్న స్థాయిలో కస్టమర్లు రాకపోవడంతోనే

ఉచిత ఆఫర్ తరువాత జియో వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ, అనుకున్న స్థాయిలో కస్టమర్లు రాకపోవడంతోనే ఆఫర్ ను పొడిగించాలని జియో అధినేత ముఖేష్ అంబానీ భావిస్తున్నట్టు సమాచారం.

100 మిలియన్ మార్క్ కి

అదీగాక అనున్నట్లుగా 100 మిలియన్ మార్క్ కి చాలాదూరంలో ఉండటం కూడా ఈ ఆఫర్ పెంచేందుకు కారణంగా నిలిచిందని ఆపర్ 2 పేరుతో వినియోగాదారులను మరింతగా ఆకర్షించవచ్చని చెబుతోంది.

డిసెంబర్ 3 తో జియో ప్రివ్యూ ఆఫర్ 90 రోజుల గడువు

అదీగాక సెప్టెంబర్ 5 న జియో ప్రారంభమైయిన విషయం తెలిసిందే.. డిసెంబర్ 3 తో జియో ప్రివ్యూ ఆఫర్ 90 రోజుల గడువు ముగిసిపోతుంది. ఆఫర్ ముగిసిపోయినప్పటిక జియో లక్ష్యం నెరవేరేలా కనిపించకపోవడంతో మరో మూడు నెలలు పొడిగించి జియో లక్ష్యాన్ని చేరుకునేందుకు కసరత్తులు చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

1 జీబీ డేటా రూ. 50 కే

కాగా, జియో ఆఫర్లలో భాగంగా 1 జీబీ డేటా రూ. 50 కే లభిస్తుందన్న సంగతి తెలిసిందే.దీనికి తోడు తమ్ముడు అనిల్ అంబాని కూడా రిలయన్స్ ను పరుగులు పెట్టిస్తున్నారు.

రూ .149 రీచార్జ్ తో

రూ .149 రీచార్జ్ తో దేశవ్యాప్తంగా అన్ని నెట్వర్క్లకు అపరిమిత కాల్స్ చేసుకోవడంతో పాటు ఉచితంగా 300 ఎంబీల డేటాను పొందవచ్చని అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్ కామ్ ప్రకటించింది

జియోలో 4జీ మాత్రమే

జియోలో 4జీ మాత్రమే పనిచేస్తుందని అదే ఆర్ కామ్ లో 2 జీ, 3 జీ, 4 జీ వినియోగదారులందరూ వాడుకోవచ్చని ఇది దేశంలోనే మొబైల్ రీఛార్జ్ విప్లవమని అనిల్ అంబాని ప్రకటించిన విషయం విదితమే.

జియో మూడు నెలలు మాత్రమే పొడిగిస్తారా

మరి జియో మూడు నెలలు మాత్రమే పొడిగిస్తారా లేక 2017 మొత్తం ఉచితంగా ఇస్తారా అనేది ధీరూభాయి అంబాని పుట్టిన రోజు డిసెంబర్ 28న మాత్రమే తెలుస్తుంది. అప్పటిదాకా అందరూ వేచి చూడాల్సిందే.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio Welcome Offer 2 to be Valid Until March 2017: Here's What We Know So Far read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot