Bharti Airtel ఉచిత OTT చందాలతో అందించే డేటా ప్యాక్‌లు ఇవే...
భారతీ ఎయిర్‌టెల్ ఇటీవల ఉచిత OTT సబ్స్క్రిప్షన్ల ప్రయోజనాలతో ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్తగా డేటా ప్యాక్‌లను తీసుకువచ్చింది. వీటిలో కొన్ని వారాల క్రితం ఎయిర్టెల్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్తో కూడిన కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వింక్ ప్రీమియం సభ్యత్వంతో కూడిన కొన్ని డేటా ప్లాన్లు కూడా ఉన్నాయి. అంతకుముందు ఎయిర్టెల్ కేవలం మూడు డేటా ప్యాక్‌లను కలిగి ఉంది.

అయితే ఇప్పుడు ఈ సంఖ్య ఎనిమిదికి పెరగడంతో పాటుగా డేటా ప్యాక్‌ల ప్రారంభ ధర రూ.48 వద్ద ఉండగా పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం డేటా ప్యాక్ ధర అధికంగా రూ.401 వరకు ఉంది. ఎనిమిది కంటే ఎక్కువ డేటా ప్యాక్‌లను బిఎస్ఎన్ఎల్ మాత్రమే కలిగి ఉంది. రోజువారీ డేటా పరిమితిని అయిపోయిన వారికి ఈ డేటా ప్యాక్‌లు ఉపయోగపడతాయి. అది కూడా OTT సభ్యత్వాల అదనపు ప్రయోజనంతో. ప్రస్తుతం ఆఫర్‌లో ఉన్న భారతి ఎయిర్‌టెల్ డేటా ప్యాక్‌ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రూ.100 లోపు అందించే డేటా ప్యాక్ బెనిఫిట్స్
భారతి ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు రూ.48 ధర వద్ద మొదటి డేటా ప్యాక్ ను అందిస్తున్నది. ఇది 3GB డేటాను 28 రోజులు లేదా ప్రస్తుత అపరిమిత ప్యాక్ చెల్లుబాటు కాలానికి వస్తుంది. జాబితాలో రూ.78 ధర వద్ద లభించే రెండవ ప్లాన్ 30 రోజుల వాలిడిటీ వింక్ ప్రీమియం సభ్యత్వం, అపరిమిత హెలోటూన్ ప్రయోజనాలతో పాటు 6GB డేటాను మీ ప్రస్తుత ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. తదుపరిది రూ.89 ధర వద్ద లభించే డేటా ప్యాక్ 28 రోజుల చెల్లుబాటుతో ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ తో పాటుగా 6GB డేటా, ఉచిత హెలోటూన్స్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ డేటా ప్యాక్ యొక్క వాలిడిటీ మీ ప్రస్తుత ప్లాన్ మాదిరిగానే ఉంటుంది. అలాగే రూ .98 డేటా ప్యాక్ మీ ప్రస్తుత యాక్టివ్ ప్యాక్ చెల్లుబాటుతో 12GB డేటాతో లభిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.150 లోపు అందించే డేటా ప్యాక్ బెనిఫిట్స్
భారతి ఎయిర్‌టెల్ కస్టమర్ల కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.131 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ డేటా ప్లాన్ మరింత ఆసక్తికరంగా ఉంది. ఈ ప్లాన్ 100MB డేటాను అందిస్తుంది. అయితే ఇందులో ప్రధాన ఆకర్షణ అమెజాన్ ప్రైమ్ చందా. ఎయిర్‌టెల్ ఈ డేటా ప్యాక్ తో 129 రూపాయల విలువైన అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని 30 రోజుల పాటు అదనపు ఖర్చు లేకుండా అందిస్తుంది. ఈ ప్యాక్ భారతీ ఎయిర్‌టెల్ యొక్క అన్ని యాక్టివ్ బండిల్ మరియు స్మార్ట్ ప్యాక్ వినియోగదారులకు వర్తిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.248, రూ.152 డేటా ప్యాక్ ల బెనిఫిట్స్
భారతి ఎయిర్‌టెల్ కస్టమర్లకు వింక్ ప్రీమియం చందాతో అందించే మరో ప్రీపెయిడ్ ప్లాన్ రూ.248 ధర వద్ద అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో 25GB డేటా మరియు వింక్ ప్రీమియం సభ్యత్వాన్ని అందిస్తుంది. ఇతర ప్రయోజనాలలో ఉచిత హెలోటూన్స్ అదనంగా లభిస్తుంది. వినియోగదారులు వింక్ ద్వారా లైవ్ కచేరీలను ఆస్వాదించవచ్చు. ఎయిర్‌టెల్ యూజర్లలో అధిక జనాదరణ పొందిన రూ.251 డేటా ప్యాక్ లాక్డౌన్ సమయంలో ప్రవేశపెట్టారు. లాక్డౌన్ సమయం నుంచి ఇది 50GB డేటా ప్రయోజనంతో లభిస్తుంది. ఇది మీ ప్రస్తుత ప్లాన్ చెల్లుబాటుతో డేటా ప్రయోజనంను అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.401 డేటా ప్యాక్ బెనిఫిట్స్
భారతి ఎయిర్‌టెల్ టెల్కో తన కస్టమర్లకు చివరగా అందిస్తున్న డేటా ప్యాక్ రూ.401 ధర వద్ద లభిస్తుంది. ఇది రూ.399 విలువైన డిస్నీ + హాట్స్టార్ విఐపి చందాను ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా లభిస్తుంది. ఇది మీ ప్రస్తుత ప్లాన్‌తో పాటు 28 రోజుల చెల్లుబాటు కాలంలో ఉపయోగించగలగడానికి 30GB డేటాను కూడా అందిస్తోంది.


Click it and Unblock the Notifications








