చరిత్ర సృష్టించిన జియో, యూజర్లకు తప్పని తిప్పలు !

Written By:

ఎటువంటి అనుభవం లేకుండా టెలికం రంగంలోకి దూసుకొచ్చి సంచలనాలు సృష్టించిన జియో ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించబోతోంది. ఉచిత ఆఫర్లతో దిగ్గజల టెల్కోలకు షాకిస్తూ వచ్చిన జియో అతి కొద్ది కాలంలో అత్యధికమంది వినియోగదారులను సొంతం చేసుకున్న సంస్థగా చరిత్రలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జియో సృష్టించిన ప్రభజంనం ఎలా ఉందో మీరే చూడండి.

జియో యూజర్లకి దిమ్మతిరిగే షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కొత్త శకానికి నాంది

జియో కొత్త శకానికి నాంది పలికింది. ప్రారంభమైన అతి కొద్ది కాలంలోనే 24 మిలియన్ల వినియోగదారులను సాధించిన తొలి కంపెనీగా కొత్త చరిత్రను లిఖించింది.

సెప్టెంబర్ 30కు ఆ సంఖ్య 24 మిలియన్లు

తొలి నెల సగంలో తమ వినియోగదారుల సంఖ్య 16 మిలియన్లుగా ప్రకటించిన కంపెనీ సెప్టెంబర్ 30కు ఆ సంఖ్య 24 మిలియన్లుగా పేర్కొంది.

ప్రపంచంలోని అతిపెద్ద డేటా ప్రొవైడర్ జియో

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని అతిపెద్ద డేటా ప్రొవైడర్ జియోనే. చైనా మొబైల్, వొడాఫోన్ గ్లోబల్ లు జియో తర్వాతి స్ధానాల్లో ఉన్నాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో 12 లక్షల మంది

ప్రస్తుతం తెలంగాణలో 12 లక్షల మంది జియో సిమ్ లను వాడుతున్నవారుండగా, గుజరాత్ లో 15 లక్షల మంది వీటిని వినియోగిస్తున్నారు. న్యూఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో అతి కొద్ది మంది మాత్రమే జియోను వినియోగిస్తున్నారు.

టైర్-2 నగరాల్లో జియోకు అత్యధిక వినియోగదారులు

రిలయన్స్ ఇండస్ట్రీస్ విడుదల చేసిన వివరాల ప్రకారం.. టైర్-2 నగరాల్లో జియోకు అత్యధిక వినియోగదారులు ఉన్నారు. గుజరాత్, తెలంగాణాల తర్వాత తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో జియో అత్యధిక యూజర్లను కలిగివుంది.

4జీ నెట్ స్పీడ్

అయితే తమ వినియోగదారుల సంఖ్య 16 మిలియన్లుగా జియో పేర్కొన్న కొద్ది రోజుల్లోనే 4జీ నెట్ స్పీడ్ చాలా తక్కువగా ఉంటోందనే ఫిర్యాదులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడ్డాయి.

పెరుగుతున్న కొద్దీ జియో ఇంటర్నెట్ వేగం

సిమ్ లను తీసుకున్న వారిలో ఎంతో మంది తాము కాల్స్ చేసుకోలేకపోతున్నామని ఫిర్యాదులు చేస్తున్నారు. యూజర్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ జియో ఇంటర్నెట్ వేగం గణనీయంగా తగ్గిపోయింది.

వొడాఫోన్ కన్నా తక్కువ

దీంతో పాటు ట్రాయ్ 4జీ నెట్ వర్క్ లలో జియోకు చివరి ర్యాంకు వచ్చింది.ఈ ర్యాంకు వొడాఫోన్ కన్నా తక్కువ కావడం అనేది యూజర్లను చాలా షాకింగ్ కు గురిచేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టైర్-1 నగరాల్లో పటిష్ట కవరేజ్

టెలికాం రంగ దిగ్గజాలు ఎయిర్ టెల్, వొడాఫోన్లు టైర్-1 నగరాల్లో పటిష్ట కవరేజ్ ను కలిగివున్నాయి. సంచలనాల జియోను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండటంతో టైర్-1 నగరాల్లో పట్టు సాధించేందుకు జియోకు కష్టాలు తప్పడం లేదు.

సిమ్ ఉన్నప్పటికీ

సిమ్ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో విఫలమవుతున్న ఎంతో మంది యూజర్లు ఇప్పుడు దాన్ని పక్కన పడేస్తున్నారు. ఒక్క కాల్ చేసుకోవడానికి అదే పనిగా డయల్ చేస్తూనే ఉండాల్సి వస్తోందన్నది జియో యూజర్ల నుంచి వస్తున్న ప్రధాన ఫిర్యాదు.

సమస్యను పరిష్కరించేందుకు

ఈ సమస్యను పరిష్కరించేందుకు తాము చర్యలు తీసుకుంటున్నామని రిలయన్స్ జియో అధికారులు ప్రకటించినా, ఇంతవరకూ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు.

యూజర్లు పెరిగే కొద్దీ డేటా స్పీడ్ మరింతగా పడిపోతుందనే ఊహాగానాలు

అయితే జియో యూజర్లు పెరిగే కొద్దీ డేటా స్పీడ్ మరింతగా పడిపోతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. డేటా వేగం తగ్గుతుందన్న చేదువార్త జియో సిమ్ తీసుకున్న వారిలో ఆందోళన కలిగిస్తోంది.

ఇంటర్ కనెక్ట్ పాయింట్ల కొరత

జియోకు ప్రధానంగా ఇంటర్ కనెక్ట్ పాయింట్ల కొరత జియోను వేధిస్తోంది. జనవరిలోగా ఈ సమస్యను కంపెనీ పరిష్కరించుకోకుంటే కచ్చితంగా సమస్యలు ఎదుర్కొవాల్సివుంటుందని టెక్ విశ్లేషకులు వాపోతున్నారు.

ముందు ముందు జియో ఈ సమస్యలను

మరి ముందు ముందు జియో ఈ సమస్యలను ఎలా పరిష్కరించుకుంటూ వెళుతుందనేదానిపైనే జియో భవిష్యత్ ఆధారపడా ఉంది. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio crosses 24 million users: Should users worry Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot