Home
News

Airtel Rewards123 సేవింగ్స్ అకౌంట్ గురించి తెలుసుకోవలసిన కొన్ని విషయాలు..

ఇండియాలోని టెలికాం రంగంలో ఒకటైన ఎయిర్‌టెల్ తన యొక్క వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త సర్వీసులను అందిస్తున్నది. అందులో భాగంగా 'ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123' సేవింగ్స్ బ్యాంక్ అకౌంటును ప్రారంభించింది. ఈ అకౌంటును రూ.299 కనీస ధర వద్ద అందిస్తోంది.

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంటు

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంటును తెరవాలనుకునే వినియోగదారులు ఎయిర్‌టెల్ థాంక్స్ యాప్‌లోని ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌కు వెళ్లి అక్కడ ఈ అకౌంటును సృష్టించవచ్చు. నార్మల్ బ్యాంక్ / భరోసా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వినియోగదారులు రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంటుకు కూడా అప్‌గ్రేడ్ చేయవచ్చు. ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ యొక్క ప్రయోజనాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు

ఎయిర్‌టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ నిబంధనలు

సాధారణ బ్యాంక్ / భరోసా సేవింగ్స్ అకౌంటును రివార్డ్స్ 123 అకౌంటుకు అప్‌గ్రేడ్ చేయడానికి వినియోగదారుడు అర్హత పొందాలంటే అతను / ఆమె ఎయిర్‌టెల్ యొక్క క్రియాశీల కస్టమర్ అయి ఉండాలి. దీనికి జోడిస్తే కనుక వినియోగదారుడు పేమెంట్ చేస్తే మరియు అతని / ఆమె బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బు తీసివేయబడితే మరియు ప్రయోజనాలు అన్‌లాక్ చేయబడకపోతే కనుక ఆ డబ్బు 3 దినాలలోపు వినియోగదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. అలాగే వినియోగదారుడి భరోసా సేవింగ్స్ అకౌంట్ నుండి అప్‌గ్రేడ్ చేయబడితే భరోసా అకౌంటుతో అనుబంధించబడిన క్యాష్‌బ్యాక్‌లు మరియు భీమా యొక్క ప్రయోజనాలు రద్దు చేయబడతాయి మరియు బదిలీ చేయబడవు.

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు

ఎయిర్టెల్ రివార్డ్స్ 123 సేవింగ్స్ బ్యాంక్ అకౌంటుతో లభించే ప్రయోజనాల విషయానికి వస్తే వినియోగదారులకు సుమారు రూ.960 వరకు వార్షిక క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. అలాగే యుపిఐ ద్వారా రూ.1,000 లోడ్ అవుతున్న ప్రతి సారి వినియోగదారుడికి 1% క్యాష్‌బ్యాక్ అంటే నెలకు రూ.10 వరకు పొందటానికి అర్హులు అవుతారు. అలాగే దీని సాయంతో రూ.1,000 వరకు కొనుగోలు చేస్తే 2% క్యాష్‌బ్యాక్ ఉంటుంది అంటే నెలకు రూ.40 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. దీనికి తోడు మొబైల్ లేదా బ్రాడ్‌బ్యాండ్ సేవలకు కనీసం రూ.225 రీఛార్జ్ చేసిన వారికి రూ.30 ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rewards123 Savings Bank Account Offers and Benefits: Here are Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X