జియోకి షాక్..రూ.145కే 14 జిబి 4జీ డేటా
భారతీ ఎయిర్‌టెల్ జియోకి పోటీగా అత్యంత తక్కువ ధరకే ప్లాన్లను ప్రవేశపెట్టింది.
జియో ఉచిత ఆఫర్లు ముగిసిపోవడం మార్చి 1 నుంచి టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టడంతో దానికనుగునంగా టెల్కోలు కూడా సరికొత్త టారిఫ్ ప్లాన్లతో రెడీ అవుతున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న భారతీ ఎయిర్‌టెల్ జియోకి పోటీగా అత్యంత తక్కువ ధరకే ప్లాన్లను ప్రవేశపెట్టింది. జియో తరహాలో ప్రతీనెల రూ.300లకు 30 జీబీ కాకుండా.. రూ.145ల చిన్న ప్యాక్ ఆఫర్ చేస్తోంది. రూ.145 14జీబీ 3జీ / 4జీ డేటాను అందిస్తోంది. ఎయిర్‌టెల్ ప్లాన్లు కింది విధంగా ఉన్నాయి.
జియో దెబ్బ.. ఎయిర్‌టెల్ సంచలనం

145 రీచార్జ్‌పై 14జీబీ, 3/4 జీ డేటా
145 రీచార్జ్‌పై 14జీబీ, 3/4 జీ డేటాను అందిస్తోది. అంతేకాదు ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ ఫ్రీ కాలింగ్ సదుపాయం.

349 రీచార్జ్ ప్యాక్‌లో
349 రీచార్జ్ ప్యాక్‌లో 14జీబీ, 3/4 జీ డేటాతో పాటు అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయం.

మార్చి 31తో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ క్లోజ్
కాగా జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ మార్చి 31తో ముగియనుండడంతో ప్రైమ్ మెంబర్ షిప్ స్కీం, కొత్త టారిఫ్‌లను ప్రకటించింది.

రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్
ప్రైమ్ మెంబర్లుగా మారాలంటే అన్నిటికన్నా ముందు రూ.99 చెల్లించాలి. ఈ ఫీజు ఏడాది వరకే చెల్లుబాటు అవుతుంది.

నెలకి మరో రూ. 303 రూపాయలు
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన దాని ప్రకారం ఇలా మెంబర్లుగా మారిన తర్వాత ఫ్రీ ఆఫర్లు వాడుకోవాలంటే మాత్రం నెలకి మరో రూ. 303 రూపాయలు చెల్లించాల్సిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications








