జియో దెబ్బ.. ఎయిర్‌టెల్ సంచలనం

Written By:

రిలయన్స్ జియో దెబ్బకు టెల్కోలు ఒక్కొక్కటిగా ఆఫర్లను ప్రకటిస్తూ కష్టమర్లను నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడుతున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్‌టెల్ జియోకి ధీటుగా ఆఫర్లను ప్రకటించాలని చూస్తోంది. దేశ వ్యాప్తంగా రోమింగ్ సేవలను ఎత్తివేసి కష్టమర్లను నిలబెట్టుకోవాలని తగిన వ్యూహాలు రచిస్తోందని సదర కంపెనీ వర్గాలు తెలిపాయి. జియో మాదిరిగా వాయిస్ కాల్స్, డేటా సేవలపై రోమింగ్ చార్జీలు ఎత్తివేయనున్నట్టు సమాచారం.

జియో కొత్త స్కెచ్, ఈ సారి టార్గెట్ ఎవరు.?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎలాంటి అదనపు చార్జీలు

దేశ వ్యాప్తంగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు కంపెనీ ఇన్‌కమింగ్ కాల్స్, ఎస్‌ఎమ్‌ఎస్‌లపై ఉచిత రోమింగ్ సేవలు అందించనుందని, ఔట్ గోయింగ్ చార్జీలపై కూడా ఎలాంటి అదనపు చార్జీలు ఉండబోవని ఎయిర్ టెల్ ఉద్యోగి ఒకరు జాతీయ మీడియాకు వెల్లడించారు. డేటా సేవల్లోనూ నేషనల్ రోమింగ్‌పై ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని పేర్కొన్నారు.

విదేశాలకు వెళ్లే వినియోగదారులకు

దీంతో పాటు యాక్టివేషన్‌ను మరింత సరళతరం చేయనున్నారనీ.. విదేశాలకు వెళ్లే వినియోగదారులకు సైతం ధరలు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు.

ఎయిర్ నుంచి మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన

ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్‌లను ఉపయోగించుకునేలా ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. కాగా ఈ వార్తలపై భారత అతిపెద్ద టెలీకాం దిగ్గజం భారతీ ఎయిర్ నుంచి మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన ప్రకటన వెలువడలేదు.

2013 నాటి ప్లాన్‌ తరహాలో

గతంలో 2013 నాటి ప్లాన్‌ తరహాలో రోజుకు రూ .5 ఛార్జ్ వద్ద ఎయిర్టెల్ 'ఉచిత ఇన్కమింగ్ కాల్స్' ను తిరిగి పరిచయం చేయనుందట. నెలకు రూ.79ల వన్‌ టైం ప్యాక్‌ కింద ఉచిత రోమింగ్‌ ఇన్‌కమింగ్‌ వాయిస్‌ సేవలను కూడా వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. అయితే ఆ తర్వాత వీటిని రద్దుచేసి రూ. 99 రీచార్జ్‌ ప్లాన్‌లో ఫ్రీ ఇన్‌ కమింగ్‌ ‌, ఎస్‌ఎంఎస్‌కి 1.50 (రోమింగ్‌) లను ప్రవేశ పెట్టింది.

నిమిషానికి రూ .80 పైసలు

ప్రస్తుతం ఎయిర్‌ టెల్‌ స్థానిక కాల్ కోసం నిమిషానికి రూ .80 పైసలు, ఎస్టీడీ కాల్ కోసం నిమిషానికి రూ 1.15, ఇన్కమింగ్ కాల్ కోసం నిమిషానికి 45 పైసలు రోమింగ్‌ చార్జీలు వసూలు చేస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel May Bring Back Happy Days for Roaming; May Drop Charges Completely read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot