అవి చాలవా, ఇంకా ఎన్ని కావాలి...జియోతో ఎయిర్‌టెల్ కుమ్ములాట

Written By:

రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతుందే కాని తగ్గడం లేదు. ఇంటర్ కనెక్టింగ్ పాయింట్ల విషయంలో రెండు కంపెనీలు పరస్పర వాదులాటకు దిగుతున్నాయి. ఇంకా ఎన్ని కనెక్టింగ్ పాయింట్లు ఇవ్వాలని ఎయిర్‌టెల్ మండి పడుతుంటే దానికి కౌంటర్ గా జియో మరిన్ని కనెక్టింగ్ పాయింట్లు ఇవ్వాలని చెబుతోంది.

4జీ ఫోన్స్ లేకున్నా సరే, జీవితాంతం జియో ఉచిత కాల్స్ చేసుకోవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియోకి మొత్తంగా 17,000 ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను

ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల విషయంలో జియో ఆరోపణలపై ఎయిర్‌టెల్ స్పందిస్తూ జియోకి మొత్తంగా 17,000 ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేశామని. ఇవి 7.5 కోట్ల మంది కస్టమర్ల అవసరాలకు సరిపోతాయని పేర్కొంది.

ఇంకా కావాలంటే ఎలా

తాజాగా జియోకి 7,000 ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను సమకూర్చాం. దీంతో మేం జియోకి ఇచ్చిన మొత్తం ఇంటర్‌కనెక్ట్ పాయింట్ల సంఖ్య 17,000 కి చేరగా, అవి ఇంకా కావాలంటే ఎలా అని మండిపడింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యూజర్ల సంఖ్య పెరుగుదల ఆధారంగా

10 కోట్ల మంది కస్టమర్లకు సరిపడ ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను సిద్ధం చేసుకోవాలని జియో మమ్మల్ని కోరింది. కాబట్టి జియో యూజర్ల సంఖ్య పెరుగుదల ఆధారంగా మేం కూడా ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను పెంచుకుంటూ వెళ్తామని బదులిచ్చింది.

ప్రస్తుతం జియోకి 2.5 రెట్లు అధికంగా ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను

ఒక బాధ్యతాయుతమైన టెలికం సంస్థగా మేం ట్రాయ్ నిబంధనలను అనుసరిస్తాం. ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే ప్రస్తుతం జియోకి 2.5 రెట్లు అధికంగా ఇంటర్‌కనెక్ట్ పాయింట్లను ఏర్పాటు చేశామని కంపెనీ తెలిపింది.

ఈ విషయంపై జియో

అయితే ఈ విషయంపై జియో మళ్లీ విరుచుకుపడింది. ఇన్‌కమింగ్ ,అవుట్‌గోయింగ్ కాల్స్‌కు వీలుగా టూ వే ఇంటర్‌కనెక్ట్ పాయింట్లు సమకూర్చాల్సి ఉండగా, దానికి బదులు ఒకవైపు కాల్స్‌కే అవకాశం కల్పించే వన్ వే పాయింట్లను ఏర్పాటు చేస్తోందని ఆరోపించింది.

కొన్ని గంటల్లోనే

తద్వారా లెసైన్స ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందంటూ మండిపడింది. ఎయిర్‌టెల్ ఇంటర్ కనెక్ట్ కు సంబంధించిన సమాచారం ప్రకటించిన కొన్ని గంటల్లోనే జియో ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Says Has Provided 7,000 More Points of Interconnect to Reliance Jio read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot