Airtel Thanks కస్టమర్లకు సూపర్ న్యూస్.. ఉచితంగా Zee5 ప్రీమియం యాక్సిస్!!!
ఇండియాలోని టెలికాం సంస్థలలో ఒకటైన భారతి ఎయిర్టెల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తున్నది. ఎయిర్టెల్ థాంక్స్ ప్రోగ్రాం ద్వారా తన వినియోగదారులకు రీఛార్జ్ చేసుకోవడానికి మరియు సినిమాలను మరియు లైవ్ టీవీ ఛానెళ్లను చూడడానికి కూడా అవకాశం ఇచ్చింది.

ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రోగ్రామ్‌లో ఉన్న వినియోగదారులకు టెల్కో ప్రత్యేక ప్రయోజనాలు మరియు అద్భుతమైన అవార్డులను కూడా అందిస్తోంది. ఒక వేల మీరు ఎయిర్టెల్ యొక్క కస్టమర్ అయితే మీరు ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొని మీకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను తనిఖీ చేయడానికి మీ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వవచ్చు. ఇప్పుడు ఎయిర్టెల్ తన ఎయిర్టెల్ థాంక్స్ కస్టమర్లకు ZEE5 యొక్క అన్ని ప్రీమియం కంటెంట్లకు అపరిమిత యాక్సిస్ ను ఉచితంగా ఇవ్వడానికి ZEE5 తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రోగ్రామ్
ఎయిర్‌టెల్ థాంక్స్ ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేసిన వినియోగదారులకు మాత్రమే ఎయిర్‌టెల్ అందించే ఈ ప్రత్యేక ప్రయోజనం లభిస్తుంది. ఈ ఆఫర్ 2020 మే 4 నుండి జూలై 12 వరకు చెల్లుబాటులో ఉంటుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ZEE5 కంటెంట్
ZEE5 అన్ని రకాల బాషలలో వైవిధ్యమైన కంటెంట్‌ను కలిగి ఉంది. ZEE5 లో అద్భుతమైన కథలతో చాలా రకాల స్టోరీలు ఉన్నాయి. మీకు నచ్చిన టీవీ షో లేదా చలన చిత్రం మీకు ఇష్టమైన భాషలో చూడడానికి కూడా అవకాశం ఉంది. ZEE5 కు ఇండియాలో భారీ సంఖ్యలో ప్రేక్షకులు ఉన్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు టీవీ కార్యక్రమాలు మరియు సినిమాలను ప్రసారం చేయడానికి ఈ వేదికను ఉపయోగిస్తున్నారు.

ZEE5 - ఎయిర్టెల్
ప్రస్తుతం ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యం చేసుకోవడం ద్వారా Zee5 యొక్క పరిధి మరింత విస్తరించడానికి సహాయపడుతుంది. అలాగే భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది వినియోగదారులను తమ ప్లాట్ ఫారంలో పొందవచ్చు అని Zee సంస్థ భావిస్తున్నది. ZEE5 యొక్క బిజినెస్ డెవలప్‌మెంట్ & కమర్షియల్ హెడ్, మన్‌ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ ZEE5 లో లభించే ప్రీమియం కంటెంట్ అధికంగా ఉండటం వల్ల ఎయిర్‌టెల్ కస్టమర్లు ఎంతో వినోదం పొందుతారని వారు విశ్వసిస్తున్నారని అన్నారు.

భారతదేశపు అతిపెద్ద రివార్డ్ ప్రోగ్రాం ఎయిర్టెల్ థాంక్స్
భారతీ ఎయిర్‌టెల్ యొక్క చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శశ్వత్ శర్మ మాట్లాడుతూ ఎయిర్‌టెల్ థాంక్స్ భారతదేశంలో అతిపెద్ద రివార్డ్ ప్రోగ్రామ్‌లలో ఒకటిగా మారిందని పేర్కొన్నారు. టెల్కోకు విధేయులైన వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందుతారు. ఎయిర్టెల్ తన యూజర్లకు ఎటువంటి అంతరాయం లేని కంటెంట్ అనుభవాన్ని అందించడానికి ZEE5 తో భాగస్వామ్యం కలిగి ఉంది. ఎయిర్టెల్ థాంక్స్ ప్రోగ్రాంను సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం అనే మూడు విభాగాలుగా విభజించారు.


Click it and Unblock the Notifications








