Airtel TV మరో ఆరు నెలల పాటు ఉచితం, బెస్ట్ ప్లాన్లు ఇవే

ఎయిర్‌టెల్ గతేడాది డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

|

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న సంస్థ ఎయిర్‌టెల్ గతేడాది డిసెంబర్‌లో ఎయిర్‌టెల్ టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను తన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ కస్టమర్లందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్ జూన్ నెలతో ముగియనుంది. ఈ క్రమంలో మరో ఆరు నెలల పాటు అంటే.. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొడిగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ వెల్లడించింది. దీనికి ప్రధాన కారణం.. ఎయిర్‌టెల్ టీవీ యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య గతేడాది ఆగస్టు వరకు 10 మిలియన్లు ఉండగా, అది కేవలం 9 నెలల్లోనే ఏకంగా 40 మిలియన్లు పెరిగి ఆ సంఖ్య 50 మిలియన్లకు చేరుకోవడమేనని కంపెనీ తెలిపింది. దీంతో ఈ మైలు రాయిని సాధించినందుకు గాను మరో ఆరు నెలల పాటు తన టీవీ యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా వినియోగదారులందరికీ అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.

రూ.1299కే 4జీ వీడియో కాల్ స్మార్ట్‌ఫోన్, జియో ఆఫర్ తరువాత..

ఎయిర్‌టెల్ ఇప్పుడు అందిస్తున్న బెస్ట్ ప్లాన్ల వివరాలపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

399 రూపాయల ప్లాన్‌

399 రూపాయల ప్లాన్‌

ఈ డేటా ప్లాన్‌పై రోజుకు 2.4జీబీ డేటా ఆఫర్‌ చేస్తోంది. ప్యాక్‌ వాలిడిటీ 70 రోజులు. అయితే ఎంపిక చేసిన యూజర్లకు ప్యాక్‌ వాలిడిటీని కూడా 84 రోజులకు పెంచింది. డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను కూడా ఎయిర్‌టెల్‌ ఆఫర్‌ చేస్తోంది.

 రూ.449 ప్లాన్‌

రూ.449 ప్లాన్‌

ఈ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా వాడుకోవచ్చు. ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు. అంటే మొత్తం 140 జీబీ డేటాను అందిస్తోంది. అన్‌లిమిటెడ్ లోకల్, ఎస్‌టీడీ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జియోలో ఇదే తరహాలో రూ.448 ప్లాన్ అందుబాటులో ఉండగా ఆ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2జీబీ డేటా వస్తుంది.

 రూ.149 రూపాయల ప్రీ పెయిడ్‌ ప్లాన్‌
 

రూ.149 రూపాయల ప్రీ పెయిడ్‌ ప్లాన్‌

ఈ ప్లాన్‌‌లో రోజులు 1 జీబీ డేటా చొప్పున 28 జీబీ 3జీ/4జీ డేటాను అందిస్తున్నారు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. వాలిడిటీ 28రోజులు. అయితే 28 రోజుల వాలిడిటీ ఉన్న జియో 149 రూపాయల ప్లాన్‌లో రోజుకు 1.5 జీబీ డేటా అందిస్తోంది.

రూ.49 ప్యాక్

రూ.49 ప్యాక్

ఇందులో 3జీబీ హై స్పీడ్‌ డేటా. వ్యాలిడిటీ 1 రోజు మాత్రమే. ఈ ప్లాన్ లో అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. ఎటువంటి కాల్స్ అందుబాటులో ఉండవు.

రూ. 92 ప్లాన్

రూ. 92 ప్లాన్

7 రోజుల పాటు 6జీబీ డేటా అందిస్తోంది. అధిక-వేగ డేటాను ఆఫర్ చేస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ నిబంధన ఏదీ లేదు. ఏడు రోజుల్లోనూ ఎపుడైనా 6జీబీ డేటా వాడు కోవచ్చు.

రూ. 129 ప్లాన్

రూ. 129 ప్లాన్

రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్‌కాలింగ్‌ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్‌టెల్‌ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. ఈ ప్లాన్‌ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్‌ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

రూ.549, రూ.799 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్

రూ.549, రూ.799 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్

ఎయిర్‌టెల్‌ ఇటీవలే తన రూ.549, రూ.799 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లను సమీక్షించింది. సమీక్షించిన రూ.549 ప్రీపెయిడ్‌ ప్లాన్‌పై రోజుకు 3.5జీబీ డేటాను ఆఫర్‌ చేస్తుండగా.. రూ.799 ప్లాన్‌పై రోజుకు 4జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.

219 రూపాయల ప్లాన్

219 రూపాయల ప్లాన్

219 రూపాయలతో ఎయిర్‌టెల్‌ ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రోజుకు 1.4జీబీ 3జీ లేదా 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌ తెలిపింది. అంటే మొత్తంగా 39.2జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. డేటాతో పాటు ‘హలో ట్యూన్‌' ప్రయోజనాలను, కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు ఆఫర్‌ చేయనున్నట్టు కంపెనీ పేర్కొంది.

రూ.249 ప్లాన్‌.

రూ.249 ప్లాన్‌.

రూ.249రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.349 ప్యాక్‌

రూ.349 ప్యాక్‌

రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్‌ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది.

రూ. 499 ప్లాన్‌

రూ. 499 ప్లాన్‌

499 ప్లాన్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా అందిస్తుంది. యూజర్లు అన్‌ లిమిటెడ్‌, లోకల్‌, రోమిండ్‌ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు. రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. ఈ ప్లాన్ 82 రోజులు చెల్లుతుంది.

 రూ. 995 plan

రూ. 995 plan


995 రూపాయలతో 3జీ, 4జీ యూజర్ల కోసం ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ కింద రూ.995కి ఆరు నెలల పాటు అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ను, రోమింగ్‌ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లను, నెలకు 1 జీబీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. అంటే మొత్తంగా ఆరు నెలల్లో నెలకు 1జీబీ డేటా చొప్పున 6జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందనున్నారు.

Best Mobiles in India

English summary
Airtel TV Extends Free Subscription Till End of 2018 To Mark 50 Million Downloads More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X