100 ఎంబిపిస్ స్పీడ్‌‌తో ఎయిర్‌టెల్, జియోకి చుక్కలేనా ?

Written By:

జియో రాకతో టెలికం రంగంలో వార్ మొదలైన విషయం తెలిసిందే. టెలికం వార్‌లో జియోతో పోటీ పడుతున్న ఎయిర్‌టెల్ మరో అడుగు ముందుకేసి అత్యంత వేగవంతమైన సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. వి ఫైబర్ పేరుతో వస్తున్న ఈ బ్రాడ్‌బ్యాండ్ సేవలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. 40 ఎంబిపిఎస్ వేగంతో ఇప్పటివరకు కంపెనీలు అందిస్తున్న దాన్ని పటాపంచలు చేస్తూ 100 ఎంబిపిఎస్ తో ఎయిర్‌టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించేందుకు రెడీ అయింది.

15 నిమిషాల ఛార్జింగ్‌తో 10 గంటల బ్యాటరీ లైఫ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

100 ఎంబిపిఎస్ వేగం

ఎయిర్‌టెల్ కంపెనీ విఫైబర్ పేరుతో వేగవంతమైన సేవలను హైదరాబాద్ నగరంలో ప్రారంభించింది. ఇప్పటివరకు ఉన్న 40 ఎంబిపిఎస్ వేగాన్ని పటాపంచలు చేస్తూ 100 ఎంబిపిఎస్ వేగంతో కష్టమర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు రెడి అయింది.

పాత కస్టమర్లు

పాత కస్టమర్లు ఎటువంటి అదనపు భారం లేకుండానే కొత్త టెక్నాలజీకి అప్‌గ్రేడ్ కావచ్చని తెలిపింది. వారు ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించకుండా కేవలం మోడెమ్‌ను మార్చుకుంటే సరిపోతుందని ఎయిర్‌టెల్ చెబుతోంది.

కొత్తగా ఎటువంటి వైర్లు గాని తవ్వకాలు కాని

ఈ బ్రాడ్ బ్యాండ్‌కు కొత్తగా ఎటువంటి వైర్లు గాని తవ్వకాలు కాని అవసరం లేదు. యూరప్‌లో నంబర్ వన్ బ్రాడ్‌బ్యాండ్ టెక్నాలజీ అయిన వెక్టోరైజేషన్ ఆధారంగా వి ఫైబర్ పనిచేస్తుందని భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ సీఈవో విజయ్ రాఘవన్ చెబుతున్నారు.

1 జీబీ స్పీడ్ అందించే సామర్థ్యం

భారత్లో ప్రస్తుతం ఎయిర్టెల్ మాత్రమే ఈ పరిజ్ఞానాన్ని పరిచయం చేసిందని ఆయన చెప్పారు. 1 జీబీ స్పీడ్ అందించే సామర్థ్యం సైతం కంపెనీకి ఉందని పేర్కొన్నారు. మార్కెట్ సిద్ధం కాగానే అందుబాటులోకి తెస్తామన్నారు.

మూడు నెలల పాటు సేవలు ఉచితం

దీంతో పాటు కొత్తగా వి-ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే మూడు నెలల పాటు సేవలు ఉచితంగా అందిచనున్నారు. వి-ఫైబర్ ప్లాన్స్ రూ .650 నుంచి రూ. 999 వరకు ప్రారంభంమవుతాయి. బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లందరూ ఏ టెలికం కంపెనీ వినియోగదార్లకైనా దేశవ్యాప్తంగా వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు.

నచ్చకపోతే నెల రోజుల్లోగా

ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఎవరైనా ఈ కొత్త సేవలు పొందవచ్చు. వి-ఫైబర్కు అప్గ్రేడ్ అయ్యాక సర్వీసు నచ్చకపోతే నెల రోజుల్లోగా కస్టమర్ చెల్లించిన యాక్టివేషన్ చార్జీల మొత్తాన్ని కంపెనీ రిఫండ్ చేస్తుంది. ప్రాజెక్ట్ లీప్లో భాగంగా నెట్వర్క్ను పటిష్టం చేసే కార్యక్రమమిదని కంపెనీ తెలిపింది.

హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో

హైదరాబాద్ సహా ఏడు నగరాల్లో వి-ఫైబర్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్లో అన్ని కంపెనీలకు కలిపి సుమారు 6 లక్షల బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో ఎయిర్టెల్ వాటా 20 శాతం దాకా ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 English summary
Airtel V-Fiber Broadband Service Launched In Indore offers speeds up to 100Mbps read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting