జియోకి పంచ్ : 3 నెలలు ఉచిత అన్‌లిమిటెడ్ డేటా

By Hazarath
|

జియోకి ఎయిర్‌టెల్ అదిరిపోయే పంచ్ ఇచ్చింది. మూడునెలలపాటు అన్ లిమిటెడ్ డేటాతో అదరగొట్టిన జియో ఆఫర్‌నే ఎయిర్‌టెల్ కూడా ఇవ్వనుంది. రూ. 60 వేల కోట్లతో అత్యాధునిక టెక్నాలజీని సొంతం చేసుకున్న ఎయిర్‌టెల్ వైర్‌లెస్ ఇంట‌ర్నెట్‌లో జియోకి పోటీగా తన స్పీడ్ పెంచనున్నట్లు తెలుస్తోంది.

 

ఎయిర్‌టెల్ మరో సంచలనం : రూ. 49కే అన్ లిమిటెడ్ కాల్స్

మూడు నెల‌ల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటా

మూడు నెల‌ల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటా

కంపెనీ కొత్త యూజ‌ర్ల‌ను ఆక‌ర్షించేందుకు మూడు నెల‌ల పాటు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటా అందించాల‌ని నిర్ణ‌యించింది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మొద‌ట‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు

మొద‌ట‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు

ఈ ఆఫ‌ర్‌ను మొద‌ట‌ ప్రీపెయిడ్‌ కస్టమర్లకు అందించి, ఈ త‌రువాత పోస్ట్‌పెయిడ్ వినియోగ‌దారుల‌కు కూడా అందించాల‌ని యోచిస్తోంది.

ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌, ఎయిర్‌టెల్‌ డైలర్‌ అనే రెండు యాప్స్‌

ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌, ఎయిర్‌టెల్‌ డైలర్‌ అనే రెండు యాప్స్‌

ఈ ఆఫ‌ర్‌ను పొందాలంటే వినియోగదారులు ఎయిర్‌టెల్‌ క్లౌడ్‌, ఎయిర్‌టెల్‌ డైలర్‌ అనే రెండు యాప్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని పేర్కొంది.

ఎయిర్‌టెల్‌ క్లౌడ్ డౌన్ లోడ్ తో 2 జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌
 

ఎయిర్‌టెల్‌ క్లౌడ్ డౌన్ లోడ్ తో 2 జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌

క‌స్ట‌మ‌ర్లు ఎయిర్‌టెల్‌ క్లౌడ్ డౌన్ లోడ్ తో 2 జీబీ ఉచిత క్లౌడ్‌ స్టోరేజ్‌, బ్యాకప్‌ కూడా పొందవచ్చని చెప్పింది. అంతేకాదు, ఎయిర్‌టెల్‌ డైలర్‌ ఎయిర్‌టెల్ నుంచి ఎయిర్‌టెల్‌కి 50 నిమిషాల పాటు ఉచిత కాల్ చేసుకోవ‌చ్చ‌ని పేర్కొంది.

సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను

సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను

వినియోగదారుల కోసం ఇప్పటికే పలు ఆఫర్లను ప్రకటించిన ఎయిర్‌టెల్‌ తాజాగా వి-ఫైబర్‌ టెక్నాలజీతో సెకనుకు 100 మెగాబిట్‌ ఇంటర్నెట్‌ స్పీడ్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు

కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు

కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ యూజర్లతో పాటు పాత కస్టమర్లకు ఈ సేవలను అందించనున్నట్లు పేర్కొంది.

ప్రస్తుత కస్టమర్లు..

ప్రస్తుత కస్టమర్లు..

ప్రస్తుత కస్టమర్లు.. తాము ఉన్న ప్లాన్‌లోనే వి- ఫైబర్‌ స్పీడ్‌కు అప్‌గ్రేడ్‌కు కావటం ద్వారా ఈ స్పీడ్‌ను అందుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు

ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు

అయితే ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు విధించబోవటం లేదని, పాత కష్టమర్లు పాత ప్లాన్‌లోనే ఈ ఆఫర్ వినియోగించుకోవచ్చని పేర్కొంది.

నెల రోజుల వ్యవధిలో

నెల రోజుల వ్యవధిలో

నెల రోజుల వ్యవధిలో వినియోగదారులు తాము అందిస్తున్న సేవల పట్ల సంతృప్తి చెందకపోతే మోడెమ్‌ చార్జీలను పూర్తిగా చెల్లించనున్నట్లు ఎయిర్‌టెల్‌ తెలపడం విశేషం.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వైర్‌లెస్ ఇంట‌ర్నెట్‌లో జియో మాత్ర‌మే

వైర్‌లెస్ ఇంట‌ర్నెట్‌లో జియో మాత్ర‌మే

వైర్‌లెస్ ఇంట‌ర్నెట్‌లో జియో మాత్ర‌మే ఇప్పుడు డిసెంబ‌ర్ వ‌ర‌కు హైస్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తోంది. ఈ ఆఫ‌ర్‌ను మ‌రింత కాలం పొడిగించే దిశ‌గా కూడా ఆ కంపెనీ ఆలోచిస్తోంది.

ఎయిర్‌టెల్‌ మళ్లీ పుంజుకునేందుకు

ఎయిర్‌టెల్‌ మళ్లీ పుంజుకునేందుకు

ఫ్రీ ఆఫ‌ర్ దేశంలో లీడింగ్ టెలికామ్ సంస్థ ఎయిర్‌టెల్‌ను తీవ్రంగా దెబ్బ‌తీయడంతో ఎయిర్‌టెల్‌ మళ్లీ పుంజుకునేందుకు రూ. 60 వేల కోట్లతో దేశంలోనే తొలిసారి అత్యాధునిక టెక్నాల‌జీని అందిపుచ్చుకుంది .

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ కొత్త టెక్నాల‌జీ సాయంతో

ఈ కొత్త టెక్నాల‌జీ సాయంతో

వెక్టోరైజేష‌న్‌గా పిలిచే ఈ కొత్త టెక్నాల‌జీ సాయంతో ఇప్పుడున్న మౌలిక వ‌స‌తుల‌తోనే యూజ‌ర్ల‌కు 100 ఎంబీపీఎస్ స్పీడు ఇంట‌ర్నెట్ అందించ‌నుంది ఎయిర్‌టెల్‌.

వెయ్యి రూపాయ‌లు చెల్లించి కొత్త మోడెమ్

వెయ్యి రూపాయ‌లు చెల్లించి కొత్త మోడెమ్

దీనికోసం వెయ్యి రూపాయ‌లు చెల్లించి కొత్త మోడెమ్ తీసుకుంటే చాలు. ఇప్పుడున్న యూజ‌ర్లకు అద‌న‌పు చార్జీలేవీ లేకుండానే ఎక్కువ స్పీడు డేటా అందుబాటులోకి రానుంది.

వైఫైని వాడే యూజ‌ర్లు పెరిగితే

వైఫైని వాడే యూజ‌ర్లు పెరిగితే

వైఫైని వాడే యూజ‌ర్లు పెరిగితే ఆ స్పీడు కూడా అంద‌రికీ స‌మానంగా షేర‌వుతుంది. అందువ‌ల్ల ఎంత ఎక్కువ స్పీడు ఉంటే అంత లాభం చేకూరుతుందని కంపెనీ తెలిపింది.

Best Mobiles in India

English summary
Airtel 'V-Fiber’ Superfast Broadband Service Launched with 100 Mbps Speed read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X