Home
News

ఇప్పుడు రెండే నిమిషాల్లో మీ సిమ్ యాక్టివేషన్

By Hazarath

మీరు కొత్త సిమ్ తీసుకోవాలంటే నానా తంటాలు పడాలి. ఫొటో, సరైన ధ్రువీకరణ పత్రాలు సరిగా ఉంటేనే యాక్టివేట్ చేస్తారు. అవి సరిగా ఉన్నా కూడా ఒక్కోసారి యాక్టివేట్ కావు. అప్పుడు మనకు చిరాకు లేస్తుంటుంది కూడా. అయితే ఇప్పుడు అలాంటివాటికి రాంరా చెప్పే దిశగా అన్ని కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. కేవలం రెండే నిమిషాల్లో మీ సిమ్ యాక్టివేషన్ అయ్యేలా ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) విధానాన్ని టెల్కోలు అమల్లోకి తెచ్చాయి. ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఓ సారి చూద్దాం.

వాట్సప్‌లో నంబర్ బ్లాక్ చేస్తే..

ఆధార్ కార్డు తీసుకెళితే

ఆధార్ కార్డు తీసుకెళితే

ఎయిర్‌టెల్, రిలయన్స్, ఐడియా సంస్థలు ఇప్పటికే ఈ-కేవైసీ విధానాన్ని అమలు చేస్తున్నాయి. మీరు ధ్రువపత్రాలను తీసుకెళ్లకుండా ఆధార్ కార్డు తీసుకెళితే మీసిమ్ రెండే నిమిషాల్లో యాక్టివేట్ అవుతుంది.

ఆధార్ కార్డు ఇవ్వగానే

ఆధార్ కార్డు ఇవ్వగానే

ఔట్లెట్లలో ఉన్న సిబ్బందికి ఆధార్ కార్డు ఇవ్వగానే వారి వద్ద ఉన్న ప్రత్యేక ట్యాబ్లెట్ పీసీ, స్మార్ట్ఫోన్లలో ఆధార్ నంబరును టైప్ చేస్తారు. ఆ వెంటనే వినియోగదారుడి వివరాలు ప్రత్యక్షమవుతాయి.

మరో పరికరంలో కస్టమర్ వేలిముద్రలను

మరో పరికరంలో కస్టమర్ వేలిముద్రలను

వివరాలు ప్రత్యక్షం కాగానే మరో పరికరంలో కస్టమర్ వేలిముద్రలను సిబ్బంది తీసుకుంటారు. ఈ మొత్తం ప్రక్రియకు రెండు నుంచి మూడు నిమిషాల సమయం పడుతుంది.

దరఖాస్తు తిరస్కరణకు

దరఖాస్తు తిరస్కరణకు

ఈ విధానంలో సిమ్ కోసం చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉండదని, దీంతో పాటు సిమ్‌లు పక్కదారి పట్టే అవకాశం కూడా ఉండదని కంపెనీలు చెబుతున్నాయి.

పనిభారం

పనిభారం

అంతేకాదు, ఈ-కేవైసీ వల్ల పనిభారం చాలా వరకు తగ్గిపోతుందని చెబుతున్నాయి. సరికొత్త విధానం వల్ల వచ్చే ఐదేళ్లలో టెలికం కంపెనీలకు రూ .10 వేల కోట్ల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

రూ.145-175 వరకు ఖర్చు

రూ.145-175 వరకు ఖర్చు

ఇప్పటి వరకు కొనసాగుతున్న పద్ధతిలో ప్రతి కనెక్షన్‌కు టెలికం కంపెనీలు మెట్రో నగరాల్లో రూ.145-175 వరకు ఖర్చు చేస్తున్నాయి. ఈ-కేవైసీ ద్వారా ఇవి ఆదా అవుతాయి.

జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని

జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని

మొబైల్ రిటైల్ చైన్ సంస్థలైన బిగ్ సి, లాట్ మొబైల్స్‌లు తమ స్టోర్లలో జియో కస్టమర్ల కోసం ఈ-కేవైసీని అమలులోకి తెచ్చాయి. మరి ముందు ముందు అన్ని స్టోర్లలో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని కంపెనీలు చెబుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel, Vodafone, Idea to issue new mobile connections using Aadhaar eKYC read more gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X