Home
News

జియోకి కౌంటర్ అటాక్ ఇస్తున్న దిగ్గజాలు

దాదాపు 10 సంవత్సరాల తరువాత టెలికం రంగంలోకి అడుగుపెట్టి దిగ్గజాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జియోకి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు దిగ్గజాలు రెడీ అయ్యాయి.

By Hazarath

దాదాపు 10 సంవత్సరాల తరువాత టెలికం రంగంలోకి అడుగుపెట్టి దిగ్గజాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న జియోకి కౌంటర్ అటాక్ ఇచ్చేందుకు దిగ్గజాలు రెడీ అయ్యాయి. ప్రైమ్ మెంబర్ షిప్ పేరుతో అంబాని ప్రకటించిన ఆఫర్ కు తమ కష్టమర్లు మారకుండా ఉండేందుకు జియోకి కౌంటర్ ఇచ్చేందుకు ఐడియా, వొడాఫోన్, ఎయిర్‌టెల్, బిఎస్ఎన్ఎల్, ఎయిర్‌టెల్ రెడీ అయ్యాయి. ఇందులో భాగంగా డేటా రేట్ల కోతకు పిలుపు ఇవ్వబోతున్నాయని ఇండస్ట్రీ విశ్లేషకులు చెబుతున్నారు.

హెచ్‌టీసీ వన్ X10 లీకయింది, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే ?

జియో టారిఫ్ ప్లాన్

జియో టారిఫ్ ప్లాన్

రూ.99 ప్రైమ్ మెంబర్ షిప్ ఫీజుతో పాటు, నెలకు మరో రూ.303లు చెల్లిస్తే హ్యాపీ న్యూఇయర్ కింద ప్రస్తుతం లభిస్తున్న ఉచిత డేటా, ఉచిత కాలింగ్ వంటి అన్ని ప్రయోజనాలను ఏడాదిపాటు పొందవచ్చని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మంగళవారం ప్రకటించారు.

అంబానీ టార్గెట్

అంబానీ టార్గెట్

ఈ తాజా ప్రకటనతో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా టాప్-ఎండ్ కస్టమర్లు, ఇప్పటికే జియోను రెండో సిమ్‌గా వాడుతున్న వారిని అంబానీ టార్గెట్ చేసినట్టు తెలిసింది. దీంతో తమ టాప్-ఎండ్ కస్టమర్లను కాపాడుకోవడంలో టెల్కోలు సిద్ధమయ్యాయి.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ఇప్పుడు ఎయిర్‌టెల్ రూ.345కు అపరిమిత కాలింగ్, 28 రోజుల పాటు 1జీబీ 4జీ డేటా, అలాగే రూ.1495కు 90రోజుల పాటు 30జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని మరింతగా తగ్గించేందుకు ఎయిర్‌టెల్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

వొడాఫోన్

వొడాఫోన్

అలాగే వొడాఫోన్ రూ.349కు అపరిమిత కాలింగ్, 50ఎంబీ 3జీ కస్టమర్లకు, 4జీ కస్టమర్లకు 1జీబీ 4జీ డేటా, రూ.1500కు 30రోజుల పాటు 35 జీబీ డేటాను అందిస్తోంది. దీన్ని కూడా తగ్గించాలని వొడాఫోన్ ఆలోచన చేస్తోంది.

ఐడియా

ఐడియా

ఐడియా కూడా ఇదే బాటల నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఐడియా రూ.348కు అపరిమిత కాలింగ్, 4జీ హ్యాండ్ సెట్లకు 28రోజులపాటు 1జీబీ 4జీ/3జీ డేటాని అలాగే 4జీ హ్యాండ్ సెట్లలోకి అప్ గ్రేడ్ అయ్యే వారికి 4జీబీ 4జీ/3జీ డేటాని ఉచితంగా అందిస్తోంది. దీంట్లో మరిన్ని మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది.

బీఎస్ఎన్ఎల్

బీఎస్ఎన్ఎల్

ప్రభుత్వ రంగ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ రూ.339కు అపరిమిత కాలింగ్, 28రోజుల పాటు 1జీబీ డేటాని అందిస్తోందిజ అయితే జియో ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ కూడా డేటా ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది.

కౌంటర్ ఇచ్చేందుకు దిగ్గజాలు కూడా రెడీ

కౌంటర్ ఇచ్చేందుకు దిగ్గజాలు కూడా రెడీ

వీటన్నింటికీ ఝలకిస్తూ జియో రూ.303కే నెలకు అపరిమిత కాలింగ్ ను, రోజుకు 1జీబీ డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. దీనికి కౌంటర్ ఇచ్చేందుకు దిగ్గజాలు కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Bharti Airtel, Vodafone India and Idea Cellular may have to take a call on data rate cut to counter Jio offer read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X