వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్,వొడాపోన్

Written By:

వాట్సాప్ భారతీయుల చేతిలో సమాచార వారధిగా మారిపోయి రోజురోజుకూ యూజర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉచిత కాల్స్, మేస్సేజీలను ఆఫర్ చేస్తుండడంతో దిగ్గజ టెలికాం కంపెనీలు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలో కలవరం మొదలైంది. ఇలాంటి యాప్స్‌ను నిషేధించాలని ఈ కంపెనీలతో కూడిన సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తాజాగా టెలికామ్ శాఖను కోరింది.ఈ మేరకు టెలికామ్ శాఖ కార్యదర్శి జేఎస్ దీపక్ కు లేఖ రాసింది. మొబైల్, ల్యాండ్ లైన్ ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ కాల్స్ ను అనుమతించడం నిబంధనలకు వ్యతిరేకమని లేఖలో కంపెనీలు పేర్కొన్నాయి.

Read more: మూడు రోజులు వాట్సప్ బంద్

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్,వొడాపోన్

ఇలాంటి చట్ట విరుద్ధమైన చర్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాయి. ఇంటర్నెట్ టెలిఫోన్ కాల్స్‌ను అనుమతించవద్దని ఈ మేరకు లైసెన్స్ దారులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్లప్తి చేశాయి. ఇదిలా ఉంటే వాట్సప్ మెసేజ్ లు చూడటం సాధ్యం కావడం లేదని ఇది చాలా సమస్యలను సృష్టించే అవకాశం ఉందని కేంద్ర సమాచార,ఐటీ మంత్రి రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు.

Read more : బుధుడు సూర్యుడి ముందు బుడ్డ చుక్కగా..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్, వొడాపోన్

వాట్సప్ లాంటి కమ్యూనికేషన్ యాప్‌ల మేసెజ్ లను డీక్రిప్ట్ (వ్యక్తీకరించడానికి) చేయడానికి భారత సెక్యురిటీ ఏజెన్సీలకు సాధ్యపడదని కేంద్ర సమాచార, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ రాజ్యసభలో తెలిపారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్, వొడాపోన్

న్యాయపరంగా, టెక్నికల్ గా, రెగ్యులేటరీ పాలసీ వంటి కారణాలతో ఈ వాట్సాప్ మెసేజ్ లను చదివగలిగే ఆకృతులోకి మార్చడం కుదరదని పేర్కొన్నారు. వివిధ అప్లికేషన్ సర్వీస్ ప్రొవేడర్లు కల్పిస్తున్న ఎన్ర్కిప్టెడ్ కమ్యూనిషన్ తో వ్యవహరించేటప్పుడు సెక్యురిటీ ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్, వొడాపోన్

ఆ అప్లికేషన్లు ఎన్కిప్షన్ టెక్నాలజీని, యాజమాన్య ధృవీకరణ ప్రొటోకాల్స్ ను వాడుతూ మెసేజ్ లను భద్రంగా ఉంచుతున్నాయని పేర్కొన్నారు. మొబైల్ అప్లికేషన్లలో వాట్సప్ అనేది సమాచారం మార్పిడికి ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, ఇంటర్ నెట్ సేవలు కల్గి ఉన్న ప్రతి ఒక్కరికి ఇది అందుబాటులో ఉందని చెప్పారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి: ఎయిర్‌టెల్, వొడాపోన్

సెక్యురిటీ ఏజెన్సీలు ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగించి, వాటిని డీక్రిప్ట్ చేయడం సాధ్యపడదని, ఒకవేళ డీక్రిప్ట్ చేయాలనుకున్నా టెక్నికల్ గా, న్యాయపరంగా, రెగ్యులేటరీ పాలసీ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి:ఎయిర్‌టెల్,వొడాపోన్

టెలికాం సర్వీసు ప్రొవేడర్లతో పాటు సోషల్ మీడియా ప్రొవైడర్లతో రెగ్యులేటరీ ఎప్పడికప్పుడూ సమావేశమై దేశ భద్రత, అభివృద్ధి అంశాలు, సేవల విషయంలో నెలకొన్న సమస్యలకు పరిష్కార మార్గాల అమలు చేస్తుంటాయని చెప్పారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి:ఎయిర్‌టెల్,వొడాపోన్

ఇటీవలే వాట్సప్ ద్వారా అందించే అన్ని సేవలకు ఎండ్ టూ ఎండ్ ఎన్ర్కిప్షన్ ను ఫేస్ బుక్ తీసుకొచ్చింది. ఉద్దేశించిన గ్రహీతలు మాత్రమే ఈ మెసేజ్ లు చదువుకోగలిగే రీతిలో దీన్ని రూపొందించారు. ఎన్ స్క్రిప్షన్ అనేది అత్యంత ప్రాముఖ్యం కల్గిన సాధనమని, ఈ కొత్త డిజిటల్ యుగంలో ప్రభుత్వాలు, కంపెనీలు, వినియోగదారులు భద్రతను, సెక్యురిటీని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాయని పేర్కొన్నారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి:ఎయిర్‌టెల్,వొడాపోన్

ఎన్‌స్క్రిప్ట్‌డ్ సర్వీసులకు, లా ఎన్ ఫోర్స్ మెంట్ లకు సంబంధించి చాలా చర్చలు జరిగాయని, అయితే ప్రజల సమాచారాన్ని సైబర్ క్రిమినల్స్, హ్యాంకర్ల దగ్గర్నుంచి భద్రతగా ఉంచడమే లా ఎన్‌ఫోర్స్ మెంట్ విధిగా గుర్తించామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

వాట్సప్‌ను ఇండియాలో లేపేయండి:ఎయిర్‌టెల్,వొడాపోన్

ఈ అంశాలన్నింటినీ గమనిస్తే రానున్న రోజుల్లో వాట్సప్ ఇండియాలో బంద్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Airtel Vodafone want ban on whatsapp like calling apps
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot