మూడు రోజులు వాట్సప్ బంద్

Written By:

బ్రెజిల్‌లో వాట్సప్‌పై వేటు పడింది. వాట్సప్ ను మూడు రోజులపాటు నిషేధించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించడంతో గత 72గంటలుగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఈ నిర్ణయంతో దాదాపు 100 మిలియన్లమంది వాట్సాప్ యూజర్లపై ఈ ప్రభావం పడింది. అసలు ఎందుకు దీనిపై నిషేధం విధించాల్సి వచ్చిందనే కారణం స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ముఠా నేరాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు వాట్సప్ సంస్థ అంగీకరించని కారణంగానే పరోక్షంగా దానిపై పోలీసులు నిషేధం విధించాల్సిందిగా కోర్టును కోరినట్లు తెలుస్తోంది.

Read more: వాట్సప్‌తో హ్యాకర్లకు చుక్కలు : భారత్‌లో వాట్సప్‌‌కు చిక్కులు

మూడు రోజులు వాట్సప్ బంద్

బ్రెజిల్ లో పలు నేరాలు చేసే దొంగలు, క్రిమినల్స్ అంతా కూడా ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సామాజిక మాధ్యమాలనే ఉపయోగించుకుంటున్నారని, ఈ నేపథ్యంలో వారి నేరాలను విచారించే పోలీసులకు సమాచారం అవసరం ఉన్నందున చాలాసార్లు ఆ కంపెనీలను కోరిన సహకరించలేదని తెలుస్తోంది. అందుకే బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాట్సప్ ను హ్యాకింగ్ చేయకుండా ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఆప్సన్ ను వాట్సప్ అందుబాటులోకి తెచ్చింది. అదేంటో తెలుసుకోండి.

Read more: మీ వాట్సాప్ అకౌంట్‌లో పనికిరాని డేటాను డిలీట్ చేయటం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మూడు రోజులు వాట్సప్ బంద్

వాట్సప్ ఇప్పుడు శత్రు దుర్భేద్యంగా మారింది. తాజాగా ఆ సర్వీస్ ఓనర్లు ఆ యాప్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ ఇచ్చారు. అంటే వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్‌లు, కాల్స్, వీడియోలు, ఫోటోలను ఎవ్వరూ ఛేదించలేరు.

మూడు రోజులు వాట్సప్ బంద్

సెండర్ నుంచి వెళ్లిన మెసేజ్‌ను కేవలం రిసీవర్ మాత్రం చూడగలరు. నేరస్థులు కానీ, ప్రభుత్వాధికారులు కానీ, హ్యాకర్లు కానీ ఎవ్వరూ ఆ మెసేజ్‌లను అక్రమంగా చూసే ప్రసక్తే లేదు.ఐఫోన్, ఆండ్రాయిడ్, విండోస్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఫోన్ ఏదైనా మెసేజ్‌లను అక్రమంగా చూడడం సాధ్యం కాదు.

మూడు రోజులు వాట్సప్ బంద్

తాజాగా అప్‌లోడ్ చేసుకున్న వాట్సప్ యాప్‌లకే ఇది వర్తిస్తుంది. వాట్సప్‌ను ప్రస్తుతం ఫేస్‌బుక్ సంస్థ నడుపుతోంది. కానీ దాని అసలు ఓనర్లు కాలిఫోర్నియాలోని మౌంట్‌వ్యూలో ఉన్నారు. వాట్సప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ అక్టన్‌లు ఎన్‌స్క్రిప్షన్ కోసం తీవ్ర కసరత్తులు చేశారు.

మూడు రోజులు వాట్సప్ బంద్

ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల శత్రువులెవరూ వాట్సప్ ఎన్‌స్క్రిప్షన్ కోసం మరో వ్యక్తి ఆ ఇద్దరికీ సహకరించాడు. మాక్సీ మార్లిన్ స్పైక్ అనే క్రిప్టోగ్రాఫర్ ఎన్‌స్క్రిప్షన్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఎండ్ టు ఎండ్ ఎన్‌స్క్రిప్షన్ వల్ల శత్రువులెవరూ మెసేజ్‌లను అక్రమంగా చదవలేరు.

మూడు రోజులు వాట్సప్ బంద్

ఒకవేళ ఆ మెసేజ్‌లను చూడాలనుకున్నా ఆ అక్షరాలు చదవలేని భాషలో కనిపిస్తాయి. మీ వాట్సప్ మెసేజ్‌లను మూడో వ్యక్తి ఎవరైనా హ్యాక్ చేసేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాదు. అంతే కాదు మూడో వ్యక్తి చేస్తున్న చొరబాటు ప్రయత్నాలు మీకు తెలిసిపోతాయి.

మూడు రోజులు వాట్సప్ బంద్

ప్రస్తుతం వాట్సప్‌కు ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వాట్సాప్ ద్వారా వెళ్లే మెసేజ్, ఫోన్ కాల్స్, ఫోటోలు, వీడియోలను ఇప్పుడూ ఎవరూ చేధించలేరు. ఇంకా చెప్పాలంటే వాట్సప్ ఉద్యోగులకు కూడా అది సాధ్యంకాదట. ప్రభుత్వ నిఘా వ్యవస్థలు కూడా ఆ ఎన్‌స్క్రిప్షన్‌ను ఏమీ చేయలేవు.

మూడు రోజులు వాట్సప్ బంద్

అయితే వాట్సప్ తెచ్చిన ఈ ఫీచర్‌తో భారత్‌లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నాయి. దీనికి కారణం ఏంటంటే మన ఐటీ చట్టాలే ఈ చట్టాల ఆధారంగా వాట్పప్ పై ప్రభుత్వం నిషేధం విధించే అవకాశం కూడా ఉంది.

మూడు రోజులు వాట్సప్ బంద్

యూజర్ల మెసేజ్ లు, వాయిస్ కాల్స్ వాటంతటవే ఎన్ క్రిప్ట్ అయ్యేవిధంగా వాట్సప్ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ చర్యల కారణంగా ప్రభుత్వం కావాలని కోరినా వాట్సప్ మీ సమాచారాన్ని పోలీసులకు ఇవ్వలేదు. బై డిపాల్ట్ గా 256 బిట్ ఎన్ క్రిప్షన్ ను ఇందుకు వాడటమే కారణం.

మూడు రోజులు వాట్సప్ బంద్

తాజా ఎన్ క్రిప్షన్ ను అన్ లాక్ చేసే కీస్ ప్రభుత్వానికి వాట్సప్ ఇవ్వడం అసాధ్యం. ఎందుకంటే తాజాగా చేపట్టిన భద్రతా చర్యల వల్ల ఈ కీస్ వాట్సప్ దగ్గర కూడా ఉండవు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write WhatsApp is closed down for three days for Brazils
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot