Home
News

Airtel vs Jio vs Vi: బ్రాడ్‌బ్యాండ్ కు ప్రత్యాన్మాయంగా అధిక డేటాతో లభించే పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్‌లు

భారతదేశంలో ప్రస్తుతం ఇంటర్నెట్ వినియోగం అధికంగా ఉంది. ఇంటి వద్ద బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ సహాయంతో ఇంటి సభ్యులు అందరూ కూడా సులభంగా ఇంటర్నెట్ ను వినియోగించవచ్చు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పెద్ద పట్టణాలలో లభించినంత సులభంగా చిన్న పట్టణాలలో దొరకదు. పల్లె ప్రాంతాలలో అయితే చెప్పవలసిన అవసరం లేదు. ఇటువంటి వారు అధికంగా టెలికాం సంస్థలు అందించే మొబైల్ డేటా మీద మాత్రమే ఆధారపడుతున్నారు. అయితే ఇంటిలోని మూడు లేదా నలుగురికి వివిధ ప్లాన్ లతో రీఛార్జ్ చేయడం చాలా ఖరీదైనది.

పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

ఇటువంటి సమస్యకు ఖచ్చితమైన పరిష్కారం కూడా టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. ఇంట్లోని ప్రతిఒక్కరికీ ఒకే రీఛార్జ్ మీద యాక్సిస్ ను ఫ్యామిలీ పోస్ట్ పైడ్ ప్లాన్ లతో అందింస్తున్నారు. దేశంలోని అగ్రశ్రేణి టెల్కోలు బిఎస్ఎన్ఎల్, జియో, వొడాఫోన్ ఐడియా మరియు ఎయిర్టెల్ ప్రొవైడర్లు రూ.999 లోపు ధర గల ప్యాక్‌లతో కుటుంబం మొత్తానికి సరిపోయే డేటాను అందిస్తున్నాయి. ఈ ప్లాన్ లలో అదనంగా ఫ్యామిలీ యాడ్-ఆన్‌లతో మరియు OTT ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి ఉంటాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

భారతి ఎయిర్‌టెల్ రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

భారతి ఎయిర్‌టెల్ రూ.999 ధర వద్ద అందించే ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100SMS ‌లతో పాటు నెలవారీ ప్రాతిపదికన 150GB 4G / 3G డేటాతో పాటు 200GB వరకు డేటా రోల్‌ఓవర్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ ఒక సంవత్సరం చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్‌ చందాతో పాటు డిస్నీ + హాట్‌స్టార్‌కు విఐపి చందా మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ చందాను ఉచితంగా అందిస్తుంది. 3 + 1 యాడ్-ఆన్‌లో భాగంగా ఒక ఫ్యామిలీలో నాలుగు కనెక్షన్‌లను జోడించడానికి ఈ ప్లాన్ అనుమతిస్తుంది. అదనపు ప్రయోజనాలలో హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ మరియు యాడ్-ఆన్ కనెక్షన్‌ల కోసం అపరిమిత కాల్‌లను అందిస్తుంది. డేటా వినియోగం పూర్తిగా పూర్తయిన తర్వాత 1MBకి 2 పైసలు చొప్పున వసూలు చేస్తుంది.

రిలయన్స్ జియో రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

రిలయన్స్ జియో రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

రూ.999 అదే ధర వద్ద లభించే జియో పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ మిగిలిన వారికి పోటీగా 200GB డేటా మరియు అపరిమిత కాల్స్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలతో లభిస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులకు ప్లాన్‌లో భాగంగా మూడు అదనపు సిమ్ కార్డులను పొందవచ్చు. OTT బండిల్స్ పరంగా ఈ ప్లాన్ జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ చందాలతో పాటుగా అమెజాన్ ప్రైమ్ చందాను రూ.99 అదనంగా చెల్లించి పొందవచ్చు.

Vi రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

Vi రూ.999 పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్

రూ.999 అదే ధర వద్ద లభించే Vi యొక్క పోస్ట్‌పెయిడ్ ఫ్యామిలీ ప్లాన్ UP ఈస్ట్ సర్కిల్‌లో ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ల క్రింద జాబితా చేయబడింది. ఈ ప్లాన్ 200GB వరకు రోల్‌ఓవర్ డేటా మద్దతుతో 200GB డేటాతో పాటుగా 100SMS మరియు అపరిమిత కాల్స్ ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 5 వ్యక్తిగత కనెక్షన్లు అందించడానికి అనుమతిని ఇస్తుంది. OTT ప్రయోజనాలలో అమెజాన్ ప్రైమ్, ఒక సంవత్సరం ZEE5 ప్రీమియం చందా మరియు Vi సినిమాలు మరియు టీవీలకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది. ఇది ప్రతిచోటా అందుబాటులో ఉండకపోవచ్చు కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా రూ.1,099 ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. ఇది అపరిమిత డేటా మరియు నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వంతో ఒకే ఒక కనెక్షన్‌తో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vi: Postpaid Family Plans With More Data as an Alternative to Broadband Connection
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X