Airtel, Vi, BSNL, Jio: తక్కువ ధరలో లభించే డేటా ప్యాక్‌లు ఇవే...
భారతదేశంలో అధికంగా డేటాను ఉపయోగించే వినియోగదారులు తమ యొక్క రోజువారి డేటా సరిపోక అదనపు డేటా కోసం స్టాండర్డ్ డేటా ప్లాన్ మీద ఆధారపడుతున్నారు. అన్ని టెల్కోలు తమ యొక్క డేటా ప్లాన్ ను వారి నెలవారీ లేదా వార్షిక చందాతో కలిసి వస్తుంది. మొబైల్ డేటా అవసరం అధికంగా లేని వినియోగదారులకు ప్రతి నెల రీఛార్జ్ చేయడం అంటే కొద్దిగా విసుగు తెస్తుంది.

మీరు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంటే లేదా మొబైల్ డేటా లేకపోవడం వంటి వాటితో బాధపడుతూ ఉంటే కనుక టెలికాం సర్వీసు ప్రొవైడర్లు అన్ని కూడా చౌకైన ధరల వద్ద డేటా ప్యాక్‌లను అందిస్తున్నాయి. మీకు ఇంటర్నెట్‌కు యాక్సిస్ లేని సమయంలో ఇవి మీకు సహాయపడతాయి. భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, బిఎస్‌ఎన్‌ఎల్ మరియు వొడాఫోన్ ఐడియా (Vi) నుండి చౌకైన ధరలో లభించే ప్లాన్ ల జాబితా గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

Vi చౌకైన డేటా ప్లాన్ (రూ .16)
Vi గా రూపాంతరం చెందిన వోడాఫోన్ ఐడియా చౌకైన ధరలో డేటా ప్లాన్‌లను అందిస్తుంది. ఈ చౌకైన రీఛార్జి ధర కేవలం రూ.16 మాత్రమే. ఇది 1GB మొబైల్ డేటాను 24 గంటల యాక్సిస్ తో అందిస్తుంది.
చౌకైన ఆఫర్‌లో తదుపరి ప్లాన్ రూ.48 ధర వద్ద లభిస్తుంది. ఇది 3GB డేటాను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ ప్లాన్‌తో ఎటువంటి అదనపు కాలింగ్ మరియు మెసేజ్ ప్రయోజనాలు రావు.

జియో చౌకైన డేటా ప్లాన్ (రూ.11)
రిలయన్స్ జియో టెలికాం సంస్థ చౌకైన డేటా జాబితాలో రూ.11 ధర వద్ద చౌకైన డేటా ప్లాన్ ను అందిస్తుంది. ఈ ప్లాన్ 1GB డేటా ప్రయోజనాన్ని వినియోగదారులకు అందిస్తుంది. తదుపరి ఉత్తమ ఎంపికలో రూ.21 ధర వద్ద లభించే డేటా ప్లాన్ 2GB అదనపు డేటాను వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ చెల్లుబాటు కాలంతో అందిస్తుంది. ఇవి రెండు కూడా కేవలం డేటా ప్లాన్ మాత్రమే. ఈ మినీ-ప్యాక్‌లో మెసేజ్ లు లేదా కాలింగ్ ప్రయోజనం అందుబాటులో లేవు.

ఎయిర్‌టెల్ చౌకైన డేటా ప్లాన్ (రూ .48)
ఎయిర్‌టెల్ యొక్క చౌకైన డేటా ప్లాన్ రూ.48 ధర వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఇది వినియోగదారులకు 3GB డేటా ఆఫర్‌తో లభిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులు చెల్లుబాటు కాలంతో లభిస్తుంది.

బిఎస్‌ఎన్‌ఎల్ చౌకైన డేటా ప్లాన్ (రూ .19)
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ రూ.19 తక్కువ ధర వద్ద చౌకైన డేటా ప్లాన్‌ను అందిస్తుంది. మినీ_19 పేరుతో లభించే ఈ డేటా ప్లాన్ ఒక రోజు చెల్లుబాటుతో 1GB డేటా ఆఫర్‌ను అందిస్తుంది. ఈ ఆఫర్లలో తదుపరి ఉత్తమ ఎంపిక రూ.56 ధర వద్ద లభిస్తుంది. ఇది 10GB డేటాతో పాటుగా జింగ్ యాక్సెస్ ను 10 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది.


Click it and Unblock the Notifications








