Home
News

90 రోజుల వాలిడిటీతో ప్రైవేట్ టెల్కోలకు పోటీగా BSNL రీఛార్జ్ ప్లాన్‌!!

ఇండియాలోని టెలికాం సంస్థలలో అన్నిటిలో ప్రస్తుతం అందుబాటు ధరలో అద్బుతమైన ప్రయోజనాలతో ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందించే ఏకైక టెలికం ఆపరేటర్ ప్రభుత్వ ఆద్వర్యంలోని బిఎస్ఎన్ఎల్ అవ్వడం గమనార్హం. ఇది 1GB రోజువారీ డేటా ప్లాన్‌ను 30 రోజుల చెల్లుబాటుతో కేవలం రూ.150 తక్కువ ధర వద్దనే అందిస్తుంది. 2019 డిసెంబర్‌లో ధరల పెంపు తరువాత రిలయన్స్ జియోతో పాటు ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా టెల్కోలు కూడా 1GB రోజువారీ డేటాను రూ.219 ధర వద్ద 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నాయి.

బిఎస్ఎన్ఎల్ 1GB రోజువారీ డేటా

ప్రైవేట్ టెల్కోలను ఓడించడానికి బిఎస్ఎన్ఎల్ 1GB రోజువారీ డేటా ప్రయోజనంను రూ.153 ధర వద్ద అందిస్తున్నది. అలాగే కొద్దిగా అధిక డేటాను కోరుకునే వారికి బిఎస్‌ఎన్‌ఎల్‌ 1.5GB రోజువారి డేటాను 90 రోజుల వాలిడిటీ కాలానికి రూ.485 ధర వద్ద లభించే ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌తో అందిస్తున్నది. దీని యొక్క అన్ని రకాల ప్రయోజనాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రయోజనాలు

BSNL టెలికాం సంస్థ రూ.485 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ అపరిమిత కాంబో ఆఫర్ లో భాగంగా 1.5GB రోజువారీ డేటా, అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ప్రయోజనాలను అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల సవరించిన దాని ప్రకారం అపరిమిత కాంబో ప్లాన్‌లు ఎటువంటి ఎఫ్‌యుపి పరిమితి లేకుండా అపరిమిత కాలింగ్ ప్రయోజనంతో వస్తాయి. దీనికి మునుపు ప్రతి ప్రీపెయిడ్ మరియు పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితితో లభించేది.

BSNL 90 రోజుల వాలిడిటీ ప్లాన్‌ అదనపు ప్రయోజనాలు

BSNL 90 రోజుల వాలిడిటీ ప్లాన్‌ అదనపు ప్రయోజనాలు

BSNL రూ.485 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లలో రోజువారీ 1.5GB పరిమితి తర్వాత డేటా స్పీడ్ 40 Kbps కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కాలం 90 రోజులు. ప్రైవేట్ టెల్కోలు తమ రోజువారీ 1.5GB ప్లాన్‌లను 84 రోజుల చెల్లుబాటుతో అందిస్తున్నాయి. వీటితో పోల్చిచూస్తే BSNL యొక్క ఈ ప్లాన్ ఆరు రోజుల అదనపు చెల్లుబాటుతో లభించడం గమనార్హం.

ఎయిర్‌టెల్, Vi, జియో 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్, Vi, జియో 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌లు

భారతి ఎయిర్‌టెల్ టెల్కో రూ.598 ధర వద్ద అందించే ప్రీపెయిడ్ ప్లాన్ 84 రోజుల చెల్లుబాటు కాలంతో 1.5GB రోజువారీ డేటా ప్రయోజనంతో లభిస్తుంది. అయితే వోడాఫోన్ ఇండియా(Vi) కూడా అదే ధర వద్ద ప్రీపెయిడ్ ప్లాన్‌ను తన వినియోగదారులకు అందిస్తున్నది. జియో యొక్క 1.5GB రోజువారి డేటా ప్లాన్ రూ.555 ధర వద్ద 84 రోజుల వాలిడిటీతో లభిస్తుంది. ప్రైవేటు టెలికం ఆపరేటర్లకు పోటీగా ముఖ్యంగా టారిఫ్ ప్లాన్స్ విభాగంలో బిఎస్ఎన్ఎల్ పోటీ పడుతూనే ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Rs.485 Recharge Plan Comes With 90 Days Validity to Compete With Private Telcos‌
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X