Home
News

Airtel Xstream ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు రూ.1,000లను ఉచితంగా పొందే మార్గాలు

భారతదేశంలోని బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో ఒకటైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ మొత్తం మీద సుమారు 3 మిలియన్ల చందాదారులను కలిగి ఉంది. కస్టమర్లను కోల్పోతున్న బిఎస్ఎన్ఎల్ మాదిరిగా కాకుండా ప్రతి త్రైమాసికంలోను ఈ ఆపరేటర్ కొత్త చందాదారులను జతచేస్తోంది. బ్రాడ్‌బ్యాండ్ పరిశ్రమలో ప్రతి సంస్థ తన ఆదాయాన్ని మరియు ARPU ని పెంచడానికి చందాదారులను ఎక్కువ కాలంపాటు లాక్ చేసినట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది కొత్త బ్రాడ్‌బ్యాండ్ చందాదారులు డిస్కౌంట్ మరియు క్యాష్ బ్యాక్ ఆఫర్ల కోసం చూస్తారు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఉదాహరణకు దీర్ఘకాలిక ప్లాన్ లను ఎన్నుకోవటానికి వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీలు ఇన్స్టాలేషన్ ఛార్జీలను మాఫీ చేస్తాయి. వీటితో పాటుగా మొత్తం ప్యాకేజీపై డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఒక నెల సబ్స్క్రిప్షన్ లపై ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను విధిస్తుంది. అయితే 3, 6 లేదా 12 నెలల దీర్ఘకాలిక ప్లాన్ లపై ఇన్‌స్టాలేషన్ చార్జీలను తొలగిస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు నెలకు రూ.499ల నుండి ప్రారంభమయి రూ.3,999 వరకు అందుబాటులో ఉన్నాయి. అన్ని బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 3, 6 మరియు 12 నెలల సబ్స్క్రిప్షన్ లతో అందించబడతాయి. ఒక కస్టమర్ ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ఒక నెల చెల్లుబాటుకు ఎంచుకుంటే కనుక వారు ఇన్‌స్టాలేషన్ ఛార్జీల కోసం రూ.1000 చెల్లించాలి. అయితే 3/6/12 నెలల దీర్ఘకాలిక ప్లాన్‌లపై ఇన్‌స్టాలేషన్ ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తాయని కంపెనీ తెలిపింది. అలాగే ఈ ప్లాన్‌లపై చందాదారులకు వరుసగా 7.5% మరియు 15% వరకు తగ్గింపు కూడా అదనంగా లభిస్తుంది.

ఉచితంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB

ఉచితంగా ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ STB

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు రూ.799 ధర వద్ద మరియు అంతకంటే ఎక్కువ ధర గల ప్లాన్‌లను ఎంచుకుంటే కనుక కస్టమర్లందరికీ రూ.3999 విలువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ను ఉచితంగా పొందడానికి అర్హత ఉంటుంది. దీని కోసం వారు తిరిగి చెల్లించాల్సిన 1,500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాలి. కస్టమర్లు 12 నెలల తర్వాత ఈ STBని తిరిగి ఇస్తే కనుక ఎయిర్‌టెల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను తిరిగి ఇస్తుంది. అయితే కస్టమర్ 12 నెలల్లోపు STBని తిరిగి ఇస్తే కనుక రూ.1,500 సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వబడదు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ ప్లాన్‌ల విషయానికొస్తే ఇవి 40 Mbps నుంచి 1Gbps వరకు వేగాన్ని అందిస్తాయి. వీటి ధరలు రూ.499 మరియు రూ.3,999 మధ్య ఉంటాయి. రూ.999 ధర వద్ద లభించే ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 200Mbps వేగంతో నెలకు 3.3TB చొప్పున అపరిమిత డేటా మరియు అపరిమిత కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ అందించే OTT చందాలలో ఒక సంవత్సర చెల్లుబాటుతో అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్స్టార్ విఐపి, ZEE5 ప్రీమియం మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వంటివి ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber Installation Charges Rs.1,000 Ways to Get Free
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X