BSNL vs JioFiber vs Airtel : రూ.500లోపు లభించే ఎంట్రీ-లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ల ప్రయోజనాలు ఇవే!

|

ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేస్తున్న బ్రాడ్‌బ్యాండ్ సంస్థ BSNL ప్రైవేట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో పోటీ పడటానికి చాలా కాలం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. బిఎస్‌ఎన్‌ఎల్ ఇప్పుడు రూ.449 సరసమైన ధర వద్ద కొత్తగా ఎంట్రీ-లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. జియోఫైబర్ ఎంట్రీ-లెవెల్ ప్లాన్ కింద 30Mbps వేగంతో రూ.399 ప్లాన్‌ను తీసుకువస్తున్నది.

BSNL vs JioFiber vs Airtel Xstream Fiber: ఎంట్రీ-లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

BSNL vs JioFiber vs Airtel Xstream Fiber: ఎంట్రీ-లెవెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

బిఎస్ఎన్ఎల్ మొదటి ఎంచుకున్న నగరాల్లో మాత్రమే తన రూ.449 ఫైబర్ బేసిక్ ప్లాన్‌ను ప్రారంభించింది. అయితే ఈ ప్లాన్‌ను ఇటీవల అన్ని భారత్ ఫైబర్ నగరాలకు విస్తరించింది. ఈ కొత్త మార్పుతో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు జియో ఫైబర్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రెండింటికి గట్టి పోటీని ఇస్తున్నది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ .449 ఫైబర్ బేసిక్ ప్లాన్, జియోఫైబర్ యొక్క రూ.399 ప్లాన్ మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ యొక్క రూ.499 ప్లాన్‌ వినియోగదారులకు ఏలాంటి ప్రయోజనాలను అందిస్తున్నాయో వంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

Also Read: టాటా స్కైలో ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌లను కొత్త EPG స్లాట్‌లకు తరలించారు!!!Also Read: టాటా స్కైలో ఇంగ్లీష్ మూవీ ఛానెల్‌లను కొత్త EPG స్లాట్‌లకు తరలించారు!!!

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.449 ఫైబర్ బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ రూ.449 ఫైబర్ బేసిక్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో రూ.449 ఎంట్రీ లెవల్ ధర వద్ద లభించే ఈ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ వినియోగదారులకు 30Mbps వేగంతో 3300GB లేదా 3.3TB డేటాను అందిస్తుంది. ఎఫ్‌యుపి పరిమితి అధికంగా ఉన్నందున బిఎస్‌ఎన్‌ఎల్ ఈ ప్లాన్‌ను అపరిమిత డేటా ప్లాన్‌గా పరిగణలోకి తీసుకొని మార్కెటింగ్ చేస్తోంది. FUP పరిమితి తరువాత దీని యొక్క వేగం 2 Mbps కు తగ్గించబడుతుంది. BSNL సంస్థ ఈ ప్లాన్‌లో ఎటువంటి OTT సబ్స్క్రిప్షన్ లను అందించడం లేదు. కానీ ఈ ప్లాన్‌ను ఎంచుకునే వినియోగదారులందరికీ ల్యాండ్‌లైన్ సర్వీస్ ద్వారా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనం అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ రేంజ్ బ్రాడ్బ్యాండ్ ప్లాన్‌లను అందిస్తున్న అన్ని సర్కిల్లలో ఈ ప్లాన్‌ అందుబాటులో ఉంది.

జియోఫైబర్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ రూ.399 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

జియోఫైబర్ 399 రూపాయల ధర వద్ద తన చౌకైన ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నది. JioFiber కొన్ని నెలల క్రితం ఈ కొత్త కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. ఇది మార్కెట్లో ఇతరులతో ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లలో గట్టి పోటీని ఇస్తున్నది. ఈ ప్లాన్ 30 Mbps డౌన్‌లోడ్ & అప్‌లోడ్ వేగంతో అపరిమిత డేటాను అందిస్తుంది. ఇందులో 3300GB లేదా 3.3TB FUP పరిమిత డేటా లభిస్తుంది. అంతేకాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్‌ ప్రయోజనం కూడా లభిస్తుంది. BSNL మాదిరిగానే JioFiber కూడా ఎటువంటి అదనపు OTT యాప్ సబ్స్క్రిప్షన్ లను అందించడం లేదు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రయోజనాలు

బిఎస్‌ఎన్‌ఎల్ ఫైబర్ బేసిక్ ప్లాన్ మరియు జియోఫైబర్ యొక్క రూ 399 ప్లాన్‌తో పోటీ పడటానికి ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ రూ.499 ధర వద్ద తన యొక్క ఎంట్రీ లెవల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అందిస్తున్నది. ఇది 40 Mbps వేగంతో 3.3TB (3300GB) FUP పరిమితి డేటా ప్రయోజనం అందిస్తుంది. దీనితో పాటుగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలు కూడా లబిస్తాయి. దీన్ని ఎంచుకునే వినియోగదారులకు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్, వూట్ బేసిక్, ఈరోస్ నౌ, హంగమా ప్లే, షెమరూ మి మరియు అల్ట్రా వంటి OTT యాప్ కంటెంట్‌లకు ఉచిత యాక్సిస్ లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fiber vs JioFiber vs Bharat Fiber: Which Broadband Plan Best Under Rs.500 Price

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X