నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా అందిస్తున్న బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

|

ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ సమర్పణలలో రోజు రోజుకి పోటీ పెరుగుతున్నది. అన్ని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ ప్లేయర్‌లు మరియు ISP లు బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పోటీ పెరుగుదలను చూసి చందాదారులకు తమ ప్లాన్లను ఇప్పుడు మరింత ఆకర్షణీయంగా మార్చాయి. దీని ఫలితంగా ఇండియాలోని బ్రాడ్‌బ్యాండ్ చందాదారులందరూ తమ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలతో ఇంతకు ముందు చూడని ప్రయోజనాలను పొందుతున్నారు.

 

OTT

టెక్నాలజీ పరంగా ప్రస్తుతం OTTల వినియోగం ఎక్కువగా కనిపిస్తోంది. ఓవర్-ది-టాప్ వీడియో స్ట్రీమింగ్ యాప్లను ఇండియాలో దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్‌ వినియోగదారుడు వాడుతున్నాడు. అమెజాన్ ప్రైమ్ వీడియో, ZEE5, హాట్‌స్టార్ వంటివి వీటిలో అత్యంత ప్రాచుర్యం పొందినవి. కానీ ప్రతి ఒక్కరూ యాక్సెస్ చేయాలనుకునే మరొక OTT యాప్ నెట్‌ఫ్లిక్స్.

 

ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?ఇంటర్నెట్ లేనప్పుడు ట్వీట్ చేయడం ఎలా?

నెట్‌ఫ్లిక్స్‌

నెట్‌ఫ్లిక్స్‌తో ఉన్న ఏకైక అడ్డంకి ఏమిటంటే ఇతర వీడియో స్ట్రీమింగ్ యాప్ల సర్వీస్లకు అయ్యే ఖర్చు కంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. కానీ అదృష్టవశాత్తూ ఇండియాలో పెరుగుతున్న ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలతో చందాదారుల కోసం కొన్ని ఎంపికలలో నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వాన్ని ఉచితంగా లేదా భారీ తగ్గింపుతో అందిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ (OS)ను నిర్మిస్తున్న ఫేస్‌బుక్సొంత ఆపరేటింగ్ సిస్టమ్‌ (OS)ను నిర్మిస్తున్న ఫేస్‌బుక్

నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వంతో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు
 

నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వంతో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు

చందాదారులకు నెట్‌ఫ్లిక్స్ చందాను పూర్తిగా ఉచితంగా అందించే వాటిలో ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు ఉన్నాయి. ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ఫైబర్ బ్యానర్‌లో నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుండటం గమనార్హం. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు రూ.799 నుంచి ప్రారంభమవుతాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ బెనిఫిట్‌తో వచ్చే ప్లాన్‌లు రూ.999 నుంచి ప్రారంభమవుతాయి.

 

అందుబాటులోకి జియో VoWi-Fi సర్వీస్అందుబాటులోకి జియో VoWi-Fi సర్వీస్

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ 200mbps వేగంతో చందాదారులకు నెలకు 300 జిబి డేటాను అందిస్తుంది. నెట్‌ఫ్లిక్స్ చందా విషయానికొస్తే చందాదారులకు మూడు నెలల నెట్‌ఫ్లిక్స్ చందా ఉచితంగా లభిస్తుంది. దీనితో పాటు వినియోగదారులు అమెజాన్ ప్రైమ్, Zee5 మరియు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ చందాలకు ఒక సంవత్సరానికి యాక్సిస్ ను కూడా పొందుతారు. ఇది వినియోగదారులకు అదనపు ప్రయోజనం.

 

00 బహుమతిని పొందే అవకాశం... బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ ను ప్రకటించిన వన్‌ప్లస్00 బహుమతిని పొందే అవకాశం... బగ్ బౌంటీ ప్రోగ్రామ్‌ ను ప్రకటించిన వన్‌ప్లస్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్‌లో వినియోగదారుల కోసం అందిస్తున్న మరికొన్ని ప్లాన్లు వరుసగా రూ.1,499 మరియు రూ.3,999 కూడా ఉన్నాయి. ఈ ప్లాన్‌లు వరుసగా 300 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌తో 500 జిబి డేటాను, 1 జిబిపిఎస్‌ స్పీడ్‌తో అన్‌లిమిటెడ్ డేటాను (3.3 టిబి) అందిస్తున్నాయి. ఈ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనంను కూడా ఉచితంగా పొందవచ్చు.

ACT ఫైబర్నెట్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనం

ACT ఫైబర్నెట్ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనం

చందాదారులకు నెట్‌ఫ్లిక్స్ ప్రయోజనాన్ని అందించే తదుపరి ఆపరేటర్ ACT ఫైబర్నెట్. ACT ఫైబర్నెట్ విషయంలో చందాదారులకు నెట్‌ఫ్లిక్స్ చందా పూర్తిగా ఉచితంగా లభించదని గమనించాలి. కానీ బదులుగా వారు వారి నెట్‌ఫ్లిక్స్ చందాలో క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఇది తక్కువ ధర వద్ద నెట్‌ఫ్లిక్స్ OTT సర్వీసుకు యాక్సిస్ ను పొందటానికి సహాయపడుతుంది. మీరు ఎంచుకున్న ప్లాన్ల ఆధారంగా మీ నెట్‌ఫ్లిక్స్ సభ్యత్వంలోని క్యాష్‌బ్యాక్ భిన్నంగా ఉంటుంది. మీరు మీ నెట్‌ఫ్లిక్స్ బిల్లును మీ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు ACT ఫైబర్నెట్ ద్వారా చెల్లించవలసి ఉంటుంది.

ACT బ్లేజ్ ప్లాన్

ఉదాహరణకు రూ.1,059 ధరతో 100 Mbps వేగాన్ని అందించే ACT బ్లేజ్ ప్లాన్ విషయంలో చందాదారులు రూ.50 క్యాష్‌బ్యాక్‌ను ఆనందిస్తారు. ఇంకా 1,159 రూపాయల ACT స్టార్మ్ ప్లాన్ రూ .50 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. 200 ఎమ్‌బిపిఎస్ వేగంతో 1,399 రూపాయల ACT లైటింగ్ ప్లాన్ నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూ .100 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. అలాగే రూ.1,999 యొక్క యాక్ట్ ఇన్క్రెడిబుల్ ప్లాన్ 250 ఎమ్‌బిపిఎస్‌ ఇంటర్నెట్ వేగంతో వస్తు రూ.150 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది. చివరగా అత్యంత ఆకర్షణీయమైన ACT గిగా ప్లాన్ రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

Best Mobiles in India

English summary
Airtel Xstream Fibre and ACT Fibernet Broadband plans that Offers Netflix for free

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X