Rs.1,750ల తగ్గింపు ధరతో Airtel Xstream Box

|

డిటిహెచ్ రంగంలో దేశంలో మూడవ అతిపెద్ద డిటిహెచ్ ఆపరేటర్ అయిన ఎయిర్‌టెల్ డిజిటల్ టివి యొక్క ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌పై ఇప్పుడు భారీ తగ్గింపును అందిస్తోంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ ఆండ్రాయిడ్-పవర్డ్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ డిల్లీ-NCR సర్కిల్‌లోని కొత్త వినియోగదారులకు 1,750 రూపాయల తగ్గింపుతో లభిస్తుంది.

ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌
 

ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద డిటిహెచ్ ఆపరేటర్ అయిన టాటా స్కై బింగే + సెట్ టాప్ బాక్స్‌ను ప్రారంభించింది. ఇప్పుడు టాటా స్కైను ఎదుర్కోవటానికి ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌పై భారీ మొత్తంలో తగ్గింపును ప్రకటించింది. ఎయిర్‌టెల్ డిటిహెచ్ మార్కెట్లో పెద్ద లాభాలలో ఒకటిగా ఉంది. ఇప్పుడు దాని ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌పై డిస్కౌంట్లను అందించడం ద్వారా దాని పరిధిని మరింత విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది.

మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం MNP 10 కొత్త నిబంధనలు

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్: డిస్కౌంట్స్ మరియు ఫీచర్స్

ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్: డిస్కౌంట్స్ మరియు ఫీచర్స్

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్‌ను ఇండియాలో రూ.3,999ల ధర వద్ద లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు డిల్లీ ప్రాంతంలో కేవలం 2,249 రూపాయలకే దీనిని కంపెనీ అందిస్తోంది. ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ థాంక్స్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా లభిస్తుంది. అదనంగా ఆండ్రాయిడ్ బాక్స్ 7 రోజుల మెగా హెచ్‌డి ట్రయల్ ప్యాక్‌తో కూడా వస్తుంది. డిల్లీ, నోయిడా, గుర్గావ్, ఘజియాబాద్ మరియు ఫరీదాబాద్ వంటి ప్రాంతాల్లోని ఎయిర్‌టెల్ కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

తక్కువ ధరతో 10,000mAh పవర్ బ్యాంకులు

ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌పై డిస్కౌంట్‌

సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్టెల్ సంస్థ తన ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌పై డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తన వెబ్ సైట్‌లో పోస్ట్ చేసింది. డిల్లీ- NCR సర్కిల్ లో వున్న వినియోగదారుల MyAirtel యాప్ లో కూడా ఈ ఆఫర్ కనిపిస్తుంది. ఈ ఆఫర్ యొక్క చెల్లుబాటు విషయం గురించి ఎక్కడా ప్రస్తావించబడలేదు కాని ఇది చాలా తక్కువ కాలానికి మాత్రమే పరిమితం కావచ్చు. మీరు పైన పేర్కొన్న ఏదైనా నగరాల్లో నివసిస్తుంటే కనుక మీరు ఈ ఆఫర్‌ను త్వరగా పొందండి. ఈ ఆఫర్ గొప్పగా అనిపించినప్పటికీ ఇందులో ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ బాక్స్ ను కొనుగోలు చేసే వారు సాధారణ రూ.360 ప్లాన్‌కు బదులుగా రూ.699ల ఎయిర్‌టెల్ బండిల్‌ను ఎంచుకోవాలి.

ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌
 

మీరు ఎక్స్‌ట్రీమ్ బాక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు నెలవారీ అద్దెతో సహా మొత్తంగా మీకు రూ.2,785 డిస్కౌంట్ లభిస్తుంది. సెట్-టాప్ బాక్స్ రూ.100 విలువైన వన్ ఇయర్ వారంటీతో పాటుగా రూ.999ల విలువైన ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ పరిచయ ఆఫర్‌ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి MyAirtel యాప్ లేదా వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు. Xstream థాంక్స్ ఆఫర్‌లో మీ నగరాన్ని ఎంచుకోండి మరియు మీ మొబైల్ నంబర్‌ను ఉపయోగించి వెరిఫై చేయండి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో లేదా డెలివరీ సమయంలో పేమెంట్ చేయడం కోసం మీ ఇన్‌స్టాలేషన్ చిరునామా మరియు చెక్అవుట్ ను నమోదు చేయండి.

టాటా స్కై బింగే + సెట్-టాప్-బాక్స్‌ ఎలా ఉందొ చూడండి

ఛానల్లు

రూ .699ల ఎయిర్‌టెల్ బండిల్ తో కంపెనీ 154 ఛానెల్‌లను అందిస్తుంది. ఇందులోని చానల్స్ మీకు నచ్చకపోతే దానిని మీరు ఎప్పుడైనా వదిలివేయవచ్చు. ఈ ప్యాక్‌లో 54 హెచ్‌డి ఛానెల్స్, 22 హిందీ న్యూస్, 11 కిడ్స్, 10 హిందీ ఎంటర్టైన్మెంట్, 10 న్యూస్, 10 హిందీ మూవీస్ , 7 మ్యూజిక్, 6 ఇన్ఫోటైన్‌మెంట్, 4 స్పోర్ట్స్, 4 ఉర్దూ, 2 పంజాబీ, 2 గుజరాతీ, 2 నార్త్ ఈస్ట్, 2 భోజ్‌పురి, 1 ఇంగ్లీష్ మూవీ, 1 తమిళం, 1 తెలుగు, 1 మలయాళం, 1 కన్నడ, 1 మరాఠీ, 1 బెంగాలీ, మరియు 1 ఒరియా ఛానల్లు లబిస్తాయి. ఈ ఆఫర్‌తో ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఇతర సర్కిల్‌లలోని వినియోగదారులకు ఇప్పుడు రూ.3639 ల ధర వద్ద లభిస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Airtel Xstream Box Now Comes With Rs.1,750 Discount Offer

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X