ఎయిర్‌టెల్ & డిష్ టీవీ ఆండ్రాయిడ్ బాక్స్‌లో మెరుగైన ఫీచర్స్ ఎందులో ఉన్నాయి??
ఇండియాలో డైరెక్ట్-టు-హోమ్ (DTH) రంగంలో భారతీ ఎయిర్‌టెల్ మరియు డిష్ టీవీ రెండు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్‌టెల్ టెలికాం బ్రాండ్ ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ కింద DTH సర్వీసును అందిస్తుంది. ఈ రెండు కంపెనీలు ఆండ్రాయిడ్ సెట్-టాప్ బాక్స్ (STB) ని వినియోగదారులకు అందిస్తున్నాయి. ఎయిర్‌టెల్ "ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్" పేరుతో మరియు డిష్ టీవీ "dishSMRT హబ్" పేరుతో తన తన ఆండ్రాయిడ్ STB లను అందిస్తున్నాయి. ఈ రెండు కంపెనీలు తమ STBలను రూ .2,499 ఒకే ధర వద్ద అందిస్తున్నాయి. ఈ రెండూ ఆండ్రాయిడ్ STB లు ఒకే ధర వద్ద వస్తాయి కాబట్టి ప్రజలు మెరుగైన దాన్ని ఎంచుకోవడం కష్టమవుతుంది. మీ యొక్క నిర్ణయాన్ని మరింత సులభతరం చేయడానికి ఈ ఆండ్రాయిడ్ STB ల యొక్క అన్ని ప్రధాన స్పెసిఫికేషన్స్ జాబితాను పొందుపరిచాము. ఈ వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ స్పెసిఫికేషన్స్
ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ఆండ్రాయిడ్ టీవీ 9 ప్లాట్‌ఫామ్‌పై రన్ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ బాక్స్ కాబట్టి ఇది గూగుల్ అసిస్టెంట్‌కు మద్దతు ఇస్తుంది అంటే వినియోగదారులు వాయిస్ కమాండ్‌లను ఇవ్వగలరు. ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ యొక్క మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ని రిమోట్ లేదా గేమ్‌ప్యాడ్‌గా మార్చుకునేలా చేస్తుంది. అంతర్నిర్మిత Chromecast ఉంది కాబట్టి వినియోగదారులు నేరుగా తమ ఫోన్ స్క్రీన్‌ను టీవీలో ప్రసారం చేయవచ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ శాటిలైట్ TV మరియు ఓవర్-ది-టాప్ (OTT) అప్లికేషన్లకు మద్దతు ఇస్తుంది. ఏదైనా ఒక బటన్‌ను ఒక్కసారి నొక్కితే వినియోగదారులు శాటిలైట్ టీవీ కంటెంట్ మరియు OTT కంటెంట్ మధ్య మారవచ్చు. ఇది 4K నాణ్యతలో కంటెంట్ ప్లేబ్యాక్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

dishSMRT HUB స్పెసిఫికేషన్స్
డిష్ ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్ అనేది డిష్ టివి నుండి వచ్చిన ఆండ్రాయిడ్ టివి బాక్స్. ఈ STB శాటిలైట్ TV కంటెంట్ మరియు OTT అప్లికేషన్‌ల మద్దతుతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కాబట్టి వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుండి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు మరియు ఇన్స్టాల్ చేయవచ్చు. ఈ STB గూగుల్ అసిస్టెంట్ సహాయంతో వాయిస్ కమాండ్‌లకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా మీరు డిష్ ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్ సహాయంతో స్మార్ట్ హోమ్ పరికరాలను కూడా నియంత్రించవచ్చు. డిష్ టీవీ నుండి వచ్చిన ఈ ఆండ్రాయిడ్ టీవీ బాక్స్ కూడా Chromecast సపోర్ట్ తో వస్తుంది. దీని అర్థం డిష్ టీవీ వినియోగదారులు కూడా తమ స్మార్ట్‌ఫోన్‌లలోని కంటెంట్‌ను నేరుగా టీవీలో ప్రసారం చేయవచ్చు.

ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ vs డిష్ ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్: మీరు ఏది ఎంచుకోవాలి?
డిష్ ఎస్‌ఎమ్‌ఆర్‌టి హబ్ మరియు ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ఆండ్రాయిడ్ టివి రెండు బాక్సుల మధ్య ఎంచుకోవలసి వస్తే కనుక మంచి ఛానెల్ ప్యాక్‌లను అందించే బాక్స్‌తో వెళ్లడం మీకు మంచిది. ఒకవేళ మీరు ఇప్పటికే ఈ కంపెనీలలో దేని నుండి అయినా DTH సర్వీసుకు సభ్యత్వం పొందినట్లయితే మీరు ఆ కంపెనీతో మాత్రమే కొనసాగడం మంచిది. ఎందుకంటే అప్పుడు మీరు మీ ఛానెల్ ప్యాక్‌ని మార్చాల్సిన అవసరం లేదు. అయితే మీరు ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ ను ఉపయోగిస్తుంటే కనుక ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ బాక్స్ ను ఎంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు అన్ని రకాల సేవలను క్లబ్ చేయగలరు మరియు వాటి కోసం ఒకే బిల్లును చెల్లించగలరు.


Click it and Unblock the Notifications








