HD సెట్-టాప్ బాక్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించిన డిష్‌టీవీ
ప్రముఖ డిటిహెచ్ సర్వీస్ ప్రొవైడర్ డిష్ టివి ప్రస్తుతం ఇండియాలో మొత్తంగా 40 మిలియన్ల మంది చందాదారులను కలిగి ఉంది. డిష్ టీవీ మరియు డి 2 హెచ్ యూజర్ బేస్ ని నిలబెట్టుకోవడానికి తమ చందాదారుల సంఖ్యను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం డిష్ టివి తన HD సెట్-టాప్ బాక్స్ కొనుగోలుపై జీవితకాల వారంటీని మరియు ఒక నెలపాటు ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా అందిస్తోంది.

సాధారణంగా DTH ఆపరేటర్లు దాని సెట్-టాప్ బాక్స్‌ల కోసం గరిష్టంగా మూడు సంవత్సరాల వారంటీని అందిస్తారు. అయితే డిష్ టివి డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్‌తో ఈ పంథాను మారుస్తున్నది. అదనంగా కొత్త డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ కొనుగోలుదారులకు ఏదైనా ఛానల్ ప్యాక్‌ను ఉచితంగా మరియు కూపన్ దునియా నుండి రూ.2,000 విలువైన కూపన్లను అందిస్తున్నాయి. ఇప్పుడు డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ ధర రూ.1,590 లకు తగ్గించబడింది. కాకపోతే ఇది పరిమిత కాల ఆఫర్ అని కంపెనీ తెలిపింది.

డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్
డిష్ టీవీ కొత్త కనెక్షన్‌ను కొనుగోలు చేయదలచిన వారికి అందుబాటులో ఉన్న హై-ఎండ్ ఎస్‌టిబి డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ ఇప్పుడు అత్యంత ప్రీమియం ఆఫర్ గా లభిస్తుంది. డిష్ టివి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం డిష్ ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి ఎస్‌టిబి 1,590 రూపాయలకు లభిస్తుంది. సాధారణంగా ఇంతమొత్తంలో వినియోగదారులు స్టాండర్డ్ STB మాత్రమే ఉంటుంది.

ఆఫర్స్
రూ.1,590లకు లభిస్తున్న డిష్‌ఎన్‌ఎక్స్‌టి హెచ్‌డి సెట్-టాప్ బాక్స్ కోసం ఇప్పుడు మరిన్ని ఆఫర్లను అందిస్తోంది. అందులో భాగంగా ఒక నెల పాటు ఉచితంగా ఛానెల్ ను,డిష్ టివి కూపన్ డునియా నుండి రూ .2,000 విలువైన కూపన్లను మరియు బాక్స్ కోసం లైఫ్ టైం వారంటీని అందిస్తోంది.

ఫీచర్స్
డిష్NXT హెచ్డి సెట్-టాప్ బాక్స్ చందాదారులకు డిష్ టివి అందిస్తున్న అత్యధిక ప్రీమియం ఆఫర్ అందువల్ల ఇది చాలా ఫీచర్లతో వస్తుంది. సెట్-టాప్ బాక్స్ స్పష్టమైన కార్యాచరణతో ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించడానికి సులభమైనది. ఇందులో 5x పిక్చర్ క్వాలిటీ మరియు మెరుగైన వీక్షణ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది చాలా భాషలకు మద్దతును అందిస్తుంది. తద్వారా వారు ఎస్టిబితో అన్ని భాషలలో ఇంటరాక్ట్ అవ్వవచ్చు. వీటన్నిటితో పాటు ఇది గేమ్స్ కు యాక్సిస్ ను అందిస్తుంది.

ఇతర సెట్-టాప్ బాక్స్ లు
డిష్NXT సెట్-టాప్ బాక్స్ రూ.1,490 లకు లభిస్తుంది. ఇది కొన్ని ఫీచర్ల మినహా హెచ్‌డి ఎస్టీబి లక్షణాలను అందిస్తుంది. మరోవైపు ఎయిర్‌టెల్ డిజిటల్ టివి మరియు టాటా స్కై డిటిహెచ్ సర్వీసు ప్రొవైడర్లు అందిస్తున్న హెచ్‌డి మరియు ఎస్‌డి వేరియంట్‌లలో దాని ఎస్‌టిబిల ధరను రూ .200 తగ్గించింది. కాగా టాటా స్కై తన ఎస్‌టిబి ధరను రూ.400 తగ్గించింది. తద్వారా ఎస్‌టిబి ఎస్‌డి వేరియంట్ ధరను రూ.1,399 కు, హెచ్‌డి వేరియంట్ ధరను రూ.1,499 కు తగ్గించింది.

లైఫ్ టైం వారంటీ
లైఫ్ టైం వారంటీ అంశంలో డిష్ టీవీని ఇతర డిటిహెచ్ ఆపరేటర్ల నుండి వేరు చేస్తున్న విభాగం. పరిశ్రమలోని ఇతర డిటిహెచ్ ఆపరేటర్లు ప్రస్తుతం దాని సెట్-టాప్ బాక్స్‌ల కోసం జీవితకాల వారంటీని అందించడం లేదు. జనాదరణ పొందిన టాటా స్కై కూడా దాని సెట్-టాప్ బాక్స్‌ల కోసం కేవలం మూడు సంవత్సరాల వారంటీని అందిస్తోంది.


Click it and Unblock the Notifications








