సముద్రంలో గ్రహాంతర వాసుల కలకలం,ఏకంగా నగరాన్నే నిర్మించారు !

|

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సుందరమైన నగరాలు సముద్రంలో మునిగిపోయాయి.వందళ ఏళ్లనాటి మెట్రోపాలిటన్ సిటీలు సముద్రం అడుగుభాగాన ప్రశాంతంగా సేద తీరుతున్నాయి. ఒక్క మధ్యధార సముద్రంలోనే ఇటువంటి నగరాలు దాదాపు 200 దాకా ఉన్నాయి. అయితే ఈ నగరాలను చూస్తే మానవులు నిర్మించారా లేక గ్రహాంతర వాసులు నిర్మించారా అనే సందేహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. సముద్రగర్భంలో ఉన్న ఈ నగరాలు ప్రాచీన మానవుని నాగరికతలకు ప్రతిరూపాలా? లేక ప్రాచీన ఏలియన్స్‌ (గ్రహాంతరవాసుల) సముద్రగర్భ స్థావరాలా? అనేది ఇప్పుడు అందరిని ఉత్కంఠకు గురి చేస్తున్న ప్రశ్న. కథనం చదవండి మీకే తెలుస్తుంది.

ఏలియన్స్ పై స్నోడెన్ చెప్పిన షాకింగ్ నిజాలు

రెండు రకాల గ్రూపుల మనుషులు
 

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

1940 లో జరిగిన యుద్ధ సమయంలో లాస్ ఏంజెల్స్ లోని శాంటా మోనికా సముద్రంలో రెండు రకాల గ్రూపుల మనుషులు సంచరిస్తున్నారని వీరంతా సముద్రం అడుగుభాగంలో చక్కర్లు కొడుతున్నారని యుఎఫ్ ఓ డైలీ తన కథనంలో పేర్కొంది.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

అయితే అవి ఏంటో తెలుసుకునేందుకు కెమెరాను వివిధ యాంగిల్లో జూమ్ చేశారు. వింత ఆకారాలు కనిపించాయి. అయితే అవి ఏలియన్స్ అయి ఉంటాయని అనుమానించారు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

ఇవి మనుషలకు కనపడకుండా సముద్ర గర్భంలో తిరుగుతన్నాయని ఖచ్చితంగా అవి ఏలియన్స్ అయి ఉంటాయని నిపుణులు అంచనా వేశారు. ఇంతవరకు నిర్థారణకు రాలేదు.

వీడియో రూపంలో

అయితే దీన్ని వీడియో రూపంలో కూడా చిత్రీకరించారు

సముద్ర గర్భంలో ఎన్నో వింతలు
 

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

భూ గ్రహాన్ని 71 శాతం ఆక్రమించిన సముద్రాన్ని పూర్తిగా ఎవరూ పరిశోధించలేదు. సముద్ర గర్భంలో ఎన్నో వింతలు వెలుగు చూడని రహస్యాలుగానే మిగిలి ఉన్నాయి. అందుబాటులోకి వస్తున్న మోడ్రన్‌ టెక్నాలజీ సహాయంతో ఇప్పుడిప్పుడే మానవుడు ఈ రహస్యాలను ఛేదించడం ప్రారంభించాడు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

సైంటిస్టుల అభిప్రాయం ప్రకారం చివరి మంచు యుగంలో (లక్ష పదివేల నుంచి 12 వేల ఏళ్ళ వరకు ఉన్న కాలం) సముద్ర మట్టం చాలా లోపలికి ఉండేది. ఇదే సమయంలో ఉత్తర యూరప్‌, ఉత్తర అమెరికా భూభాగాలను రెండు మైళ్ళ మందం ఉన్న మంచు దిమ్మలు ఆవరించి ఉండేవి. 21 వేల ఏళ్ళక్రితం ఈ హిమ ఖండాలు కరగటం ప్రారంభమయ్యాయి.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

పదివేల ఏళ్ళ క్రితం వరకు ఇలా కరుగుతూనే ఉన్న మంచు వల్ల అపారమైన జలరాశి సముద్రంలో కలిసిపోయింది. ఫలితంగా సముద్రమట్టం పెరిగి సంపన్నవంతమైన తీర ప్రాంతాలు అనేకం మునిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కోటి చదరపు మైళ్ళ భూభాగం సముద్ర గర్భంలో కలిసిపోయినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

ఈ భూభాగంలో విలసిల్లిన అనేక నాగరికతలూ సముద్రగర్భంలో సమాధి అయ్యాయి. ఆర్కియాలజిస్టులు ఇలా మునిగిపోయిన మానవ నాగరికతా అవశేషాలను బయటికి తీయడానికి ఇప్పుడిప్పుడే నడుం బిగిస్తున్నారు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

ప్రాచీన గ్రీకు గ్రంథాల ప్రకారం అట్లాంటిస్‌ ప్రాచీన గ్రహాంతరవాసులు స్థాపించిన నగరం. పొసీడన్‌ అనే గ్రీకుదేవుడు దీన్ని స్థాపించాడు. పొసీడన్‌ ఈ భూమికి చెందినవాడు కాదని ఎక్కడి నుంచో భూమిపైకి వచ్చిన అతడికి ఒక అందమైన యువతి కనిపించిందనీ, ఆమె అతడి వల్ల గర్భవతి అయిందని, తన కుటుంబం జీవించడం కోసం అట్లాంటిస్‌ నగరాన్ని స్థాపించాడని అంటారు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

ఏథెన్స్‌ నగరాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించి పొసీడన్‌ విఫలమైనప్పుడు అట్లాంటిస్‌కి పెను విపత్తు సంభవించింది. ప్లేటో రాతల ప్రకారం అట్లాంటిస్‌ ఒక్క రాత్రిలో నాశనమై పోయింది. సముద్రుడు నగరాన్ని ముంచివేశాడు. మరికొన్ని ప్రచారంలో ఉన్న కథల వల్ల అట్లాంటిస్‌ను సొంత ప్రజలే నాశనం చేశారని తెలుస్తోంది.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

ప్లేటో పేర్కొన్న సంగతులను బట్టి అట్లాంటిస్‌ జిబ్రాల్టర్‌ జలసంధి ప్రాంతంలో ఉండవచ్చని కొందరు సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఫ్లోరిడా సమీపంలోని బహుమాస్‌ ద్వీప సముదాయం ఉన్న ప్రాంతంలో 1968లో జెమాన్సన్‌ వేలంటైన్‌ అట్లాంటిస్‌ నగర ఆనవాళ్లను కనుగొన్నట్లు ప్రకటించాడు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

హార్బర్‌ వంటి నిర్మాణంతో పాటు అనేక ప్రాచీన కట్టడాలు, రోడ్లను సైంటిస్టులు ఇక్కడ కనుగొన్నారు. అయితే ఇవి ప్రాచీన అట్లాంటిస్‌ నగరానికి సంబంధించినవేనా అనే విషయాన్ని ఇంకా ధ్రువపరుచుకోవాల్సి ఉంది.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

సముద్ర గర్భంలో ఏలియన్స్‌ నిర్మించినట్లు భావిస్తున్న నగరాల్లో ఒకటి జపాన్‌ సముద్ర జలాల్లో ఉంది. జపనీస్‌ ఆర్కిపాలినోకి పశ్చిమ కొననున్న యొనిగొని ఒక చిన్న దీవి. రాతియుగాల కాలంలో ఆగేయ ఆసియా నుంచి వలస వచ్చిన ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. 1987లో హిచీరో ఆర్టాకీ అనే డైవ్‌ టూర్‌ ఆపరేటర్‌ అద్భుతమైన ఆవిష్కరణకు తెర లేపాడు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

అరవై నుండి వంద అడుగుల లోతులో రెండు ఫుట్‌బాల్‌ మైదానాలంత వైశాల్యం ఉన్న స్థలంలో నిర్మితమైన ఒక అయిదు అంతస్తుల పిరమిడ్‌ ఇక్కడ కనిపించింది. మనుషులు నడవడానికి వీలున్న టన్నెల్స్‌, మెట్లు ఉన్న ఈ నిర్మాణాలు కచ్చితమైన దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నాయి. ఈ నిర్మాణానికి ముందు ఒక భారీ విగ్రహం నిలిచి ఉంది. దాన్ని చూసినవారికి వెంటనే నోవా గుర్తుకు వస్తుంది.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

కాస్త పరీక్షగా చూస్తే కానీ అది ఈజిప్టు పిరమిడ్‌ ముందున్న భారీ విగ్రహాన్ని పోలి ఉందని అర్థం కాదు. ఇంతకు దీన్ని ఎవరు నిర్మించినట్లు? ఈ భారీ నిర్మాణాన్ని సాధారణ మానవులు నిర్మించ గలరా? అలాగే ఇది నీటిలో నిర్మించిన కట్టడమా? లేక నేలపై సృష్టించిన అద్భుతమా? శాస్త్రవేత్తలు మాత్రం ఈ కట్టడాన్ని మతపరమైన కర్మకాండలను నిర్వహించుకోవడానికి నేలపై కట్టినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

చివరి మంచుయుగంలో మంచు కరిగినప్పుడు ఇది నీటిలో మునిగిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇది సుమారు 14 వేల సంవత్సరాల క్రితం నిర్మించినదిగా చెబుతున్నారు. నిజానికి ఆ సమయంలో మానవుడు సంచారజీవిగా ఉండి కొండలు గుట్టల్లో తిరుగుతూ ఆహార సేకరణ చేస్తూ బతికేవాడు.

మానవులా, గ్రహాంతర వాసులా : సముద్రం లోపల ఈ నగరాలను నిర్మించిదెవరు ?

అటువంటి మనిషి ఇంతటి అద్భుతమైన కట్టడాన్ని నిర్మించాడని నమ్మడమెలా? ఇంత భారీ నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ, శక్తి సామర్థ్యాలు వారికి ఎక్కడివని కొెందరు ప్రశ్నిస్తున్నారు. అందుకనే ఈ కట్టడాన్ని నిర్మించినవారు భూవాసులు కారనీ, గ్రహాంతరవాసులే (ఏలియన్స్‌) దీన్ని నిర్మించి ఉండవచ్చని వీరంటున్నారు. వాస్తవం ఏమిటో ముందు ముందు జరగనున్న పరిశోధనలే తేల్చాలి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Most Read Articles
Best Mobiles in India

English summary
here Write Alien Structures Below Ocean Off Santa Monica, California Says UFO Hunter, Video And Photos

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more