జియో మళ్లీ షాకిచ్చింది, రూ. 185కే డీటీహెచ్ సర్వీస్
డీటీహెచ్ రంగంలో దిగ్గజాలకు చుక్కలు చూపించడానికి పావులు, మధ్యతరగతి వర్గాలను కూడా ఆకట్టుకునే ప్రయత్నం
ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న జియో ఇప్పుడు మళ్లీ షాకిచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. జియో ఫ్రీ కాలింగ్ ఆఫర్ తో సామాన్యులను టార్గెట్ చేసిన ముఖేష్ అంబానీ ఈసారి మధ్యతరగతి వర్గాలను కూడా ఆకట్టుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. డీటీహెచ్ రంగంలో దిగ్గజాలకు చుక్కలు చూపించడానికి పావులు కదుపుతోందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెల్లోనే ఇది జరిగే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
కష్టమర్ల కోసం ఎయిర్‌టెల్, వొడాఫోన్ కీలక నిర్ణయం

త్వరలోనే అధికారిక ప్రకటన
డీటీహెచ్ రంగంలోకి రిలయన్స్ జియో అడుగుపెట్టబోతోంది. ఆరంభంతోనే ఇతర డీటీహెచ్ కంపెనీలను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు ప్రణాళిక సిద్ధమైంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

వినియోగదారులకు బంపర్ ఆఫర్
దేశంలో ఏ డీటీహెచ్ సర్వీస్ ఆపరేటర్ ప్రకటించనంత తక్కువగా జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించనుందని వార్తలు వస్తున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

185 రూపాయలకే
ఇతర కంపెనీలు 275 నుంచి 300 రూపాయలకు అందించే నెలవారీ డీటీహెచ్ ప్యాక్ను ముఖేష్ అంబానీ 185 రూపాయలకే అందించేందుకు రంగం సిద్ధమైంది.

ఎయిర్టెల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశం
ఇది ఎయిర్టెల్‌కు భారీ నష్టాన్ని మిగిల్చే అవకాశముందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదేగానీ జరిగితే డీటీహెచ్ రంగంలో రిలయన్స్ జియో హవా కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది.

కోలుకోలేని దెబ్బ
అయితే జియో డీటీహెచ్ సర్వీసులు లాంచ్ అయితే ఎయిర్టెల్, టాటా స్కై, డిష్ టీవీ యాజమాన్యాలను కోలుకోలేని దెబ్బ తీస్తుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

చర్యలపై దృష్టి
అయితే టెలికామ్ రంగంలోనే రిలయన్స్ జియో నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ పోరాడుతున్న ఎయిర్టెల్ ఈ ప్రకటన వెలువడితే తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించింది.

అడ్డుకట్ట వేయకపోతే మనుగడకే ప్రమాదం
జియో ఆఫర్లకు అడ్డుకట్ట వేయకపోతే మనుగడకే ప్రమాదం కలుగుతుందని ఇతర కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.ఎలాగైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications
