ఆండ్రాయిడ్ ఫోన్‌లకు ‘హైఅలర్ట్’!

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా..?, జాగ్రత్త! మీ ఫోన్‌ను ఒకేఒక్క టెక్స్ట్ మెసేజ్ ద్వారా హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు కుట్రలు పన్నుతున్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపీరియమ్ ఈ హెచ్చరికలను జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతోన్న 95శాతం ఫోన్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందట.

Read More: రూ.7,000కే ఆక్టా ‌కోర్ ఫోన్‌!

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని సెక్యూరిటీ లోపాన్ని ఆసారగా చేసుకుని హ్యాకర్లు ప్రపంచవ్యాప్తంగా 950 మిలియన్ల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లు, టాబ్లెట్ ల పై దాడి చేసేందుకు ఆస్కారం ఉందని సదరు సెక్యూరిటీ సంస్థ హెచ్చరిస్తోంది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే అన్ని స్మార్ట్ డివైస్‌లకు ఈ ముప్పు పొంచి ఉందని జింపీరియమ్ సంస్థ ఉప్యాధ్యక్షుడు జాషువా డ్రేక్ తెలిపారు. కథనం కొనసాగింపు క్రింది స్లైడ్‌షోలో...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హ్యాకర్లకు మీ ఫోన్ నెంబర్ దొరికితే చాలు, ఈ ప్రమాదకర వైరస్‌ను టెక్స్ట్ మెసేజ్ రూపంలో మీకు పంపిస్తారు.

ఈ టెక్స్ట్ మెసేజ్ మీ ఫోన్‌లోకి చొరబడి మీ ప్రమేయం లేకుండానే ఫోన్ మొత్తం తన ఆధీనంలోకి తీసుకని హానికరమైనక కోడ్‌ను అమలు చేసేస్తుంది.

దీంతో మీ ఫోన్‌ను హ్యాకర్లు రిమోట్ కంట్రోల్ ఆధారంగా ఆపరేట్ చేయగలుగుతారు.

సెక్యూరిటీ లోపానికి గురైన ఇంటర్నల్ కోడ్‌ను ఇప్పటికే ఫిక్స్ చేసిన గూగుల్ ఆ సురక్షిత కోడ్‌ను మొబైల్ ఫోన్ తయారీదారులకు పంపినట్లు తెలుస్తోంది.

ఆయా కంపెనీలు ఓవర్ ద ఎయిర్ అప్ డేట్‌ల రూపంలో సవరించబబడిన కోడ్‌ను తమ వినియోగదారుల ఫోన్‌లకు పంపాల్సి ఉంది.

యూజర్లు ఆ కోడ్‌‌కు అప్‌డేట్ అయినట్లయితే ఈ సెక్యూరిటీ ముప్పు నుంచి బయటపడవచ్చు!.

2012-13 మధ్యలో ఆండ్రాయిడ్ మాల్వేర్ 63 శాతానికి పెరిగినట్లు యాంటీ - వైరస్ సాఫ్ట్‌వేర్ ఇంకా ఇంటర్నెట్ ప్రొటెక్షన్‌లను సమకూర్చే ఇఎస్ఇటీ సంస్థ తన నివేదికలో పేర్కొంది. అత్యధికంగా హ్యాక్ చేయబడిన ఆపరేటింగ్ సిస్టం కూడా ‘ఆండ్రాయిడే' అని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.

 

 

కొత్తగా కనుగొన్న 99శాతం మొబైల్ మాలీషియస్ ప్రోగ్రామ్‌లలో 99 శాతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌ను టార్గెట్ చేసినవేనని క్యాస్పర్ స్కై సెక్యూరిటీ తన నివేదికలో పేర్కొంది.

ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌‌ను విశ్లేషించినట్లయితే 80శాతం మార్కెట్‌ను ఆండ్రాయిడ్ శాసిస్తోంది. ఈ నేపధ్యంలో ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్‌లపై వైరస్ దాడులు పెరిగిపోయాయి.

 

ప్రమాదకర వైరస్‌ల నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను రక్షించుకునేందుకు యూజర్లు నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Almost 1 billion Android phones at risk, Simple Text Message to Hack your Phone Remotely. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot